- పశ్చిమ ప్రకాశం దాహార్తిని తీర్చేందుకు 2018కి ముందే రూ. 650 కోట్లు కేటాయించిన నాటి ప్రభుత్వం
- ఐదేళ్లు నిర్లక్ష్యం వహించిన గత వైసీపీ ప్రభుత్వం
- నేడు రూ.1290 కోట్లకు పెరిగిన వ్యయం
- మంత్రి డా. డోలా శీ బాల వీరాంజనేయస్వామి ధ్వజం
మార్కాపురం (చైతన్యరథం): పశ్చిమ ప్రకాశం ప్రజల దాహార్తిని తీర్చేందుకు 2018కి ముందే నాటి టీడీపీ ప్రభుత్వం రూ. 650 కోట్లు కేటాయించిందని, కానీ గత వైసీపీ పాలకులు పట్టించుకోకుండా గాలి కొదిలేసారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. శక్రవారం నాడు ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని నరసింహపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కలసి అతి పెద్ద తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యమంలో మంత్రి స్వామి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి డా. డోలా మాట్లాడుతూ….పశ్చిమ ప్రకాశం ప్రజల దాహార్తిని తీర్చేందుకు 2018కి ముందే నాటి ప్రభుత్వం ఈ తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు రూ. 650 కోట్లు కేటాయించిందన్నారు. గత వైసీపీ పాలకులు 5 ఏళ్లు ఈ ప్రాజెక్టును పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. వైసీపీ పాలకుల వల్లే నేడు ఈ ప్రాజెక్టు వ్యయం నేడు రూ.1290 కోట్లకు పెరిగింది, ఈ పాపం జగన్‌ది కాదా? 2019 లో మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయ్యేది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లా ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిలోనే ప్రకాశం జిల్లాలో రూ.165 కోట్లతో సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణం చేశాం. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగకుండా వాట్సప్ గవర్నెన్స్ ద్వారా నేరుగా అర చేతిలోనే సేవలందిస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నాం. ఒక్కొక్కరు రూ. 52 వేలు, రూ. 39 వేలు తీసుకొని తల్లులంతా ఆనందంగా ఉన్నారు. అవినీతి రహిత పాలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి డా.డోలా అన్నారు. ఈ సందర్భంగాఈ ప్రాజెక్టు ఫేజ్ 2 కింద తూర్పు ప్రకాశం ప్రాంతానికి కూడా తాగునీరు అందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని మంత్రి డా.డోలా కోరారు.