- ప్రభుత్వ బడుల ముందు నో అడ్మిషన్ బోర్డులతో సంతృప్తి
- తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్న వాసుదేవరావు మాస్టార్ అభినందనీయులు
- విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్యరథం): ప్రభుత్వ పాఠశాలల ముందు నో అడ్మిషన్ బోర్డులు చూస్తుంటే ఇదే కదా తాను కోరుకున్న మార్పు అనిపిస్తోందని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ సంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయాలకు దూరంగా, సమగ్ర విద్యకు దగ్గరగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి, సమస్యలను పరిష్కరించి విద్యాలయాలుగా పాఠశాలలను తీర్చిదిద్దిన కష్టం .. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం డోలపేటకు చెందిన టీచర్ డోల వాసుదేవరావు లాంటి వారిని చూసి మర్చిపోతామన్నారు. ఈ మాస్టారు తన పిల్లలు ఇద్దరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నారని మెచ్చుకున్నారు. ఒక మాస్టారే తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తుంటే, మనం ఎందుకు చదివించకూడదు అని ప్రజల్లో ఆలోచన రేకెత్తించిన వాసు మాస్టర్‌కి అభినందనలు తెలుపుతున్నానన్నారు. మన బడికి మనమే అంబాసిడర్లుగా నిలుద్దాం. అంతా కలిసి దేశానికే దిక్సూచిగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీసుకొద్దామని మంత్రి లోకేష్ పిలుపు ఇచ్చారు.