అమరావతి (చైతన్యరథం): ఏరోస్పేస్ పరిశ్రమలను ఏపీకి ఆహ్వానిస్తూ రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌పై కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ తేజశ్వీ సూర్య స్పందించారు. ఈ మేరకు ఆయన కూడా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వ్యాపారాన్ని ఆకర్షించే, పరిశ్రమలను స్వాగతించే, ఉద్యోగాలు సృష్టించే విధానం అంటే ఇలా ఉంటుందని ప్రశంసలు కురిపించారు. ఈ విషయంలో ఏపీ మంత్రి లోకేష్ బాటలో నడిచి కర్ణాటక ప్రభుత్వం తన మార్గాన్ని సరిదిద్దుకోవాలని ఆశిస్తున్నానన్నారు. ఏరోస్పేస్ పార్క్‌ను బెంగళూరులో స్థాపించడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజకీయ సంకల్పం చూపించాలన్నారు.