- వైసీపీ విముక్త ఏపీ కోసం టీడీపీ-జనసేన పొత్తు
- ఇది ప్రజలు కుదిర్చిన, జనం కోరుకున్న పొత్తు
- జగన్ ఒక బ్లఫ్ మాస్టర్
- జగన్ సినిమా అయిపోయింది
- అట్టర్ ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ఉండదు
- మనది విన్నింగ్ టీమ్.. వైసీపీది ఛీటింగ్ టీమ్
- త్వరలోనే టీడీపీ-జనసేన ఎన్నికల మేనిఫెస్టో
- సినిమా టికెట్ల పేరుతో చిరంజీవిని, దర్శకుడు రాజమౌళిని అవమానించారు
- వైసీపీ రాజేసిన అగ్గితోనే ఆ పార్టీని తగలబెట్టడానికి సిద్ధం
- ఆ అగ్గికి వాయువు పవన్ తోడయ్యారు
- పొత్తు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, ప్రజల బతుకులు వెలగాలి
తాడేపల్లిగూడెం(చైతన్యరథం): వైసీపీ విముక్త ఏపీ కోసమే టీడీపీ`జనసేన పొత్తుపెట్టుకున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు అన్నారు. జనం కోరుకున్న పొత్తు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో ‘తెలుగు జన’ విజయకేతనం.. జెండా పేరు తో బుధవారం లక్షలాది జనంతో నిర్వహించిన ఉమ్మడి సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఇది చరిత్రను తిరగ రాసే రోజు అన్నారు. మనం పోరాడాల్సింది వైసీపీ దొంగలపై. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రెండు పార్టీలు కలిసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల ప్రచార సభ ఇది. ఏపీ దిశ, దశ మార్చబోయే సభ ఇది. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాల కులను తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ సభకు వచ్చిన ప్రజలను చూసి తాడేపల్లి ప్యాలెస్ కంపిస్తోంది. మన విజయానికి ఈ సభకు వచ్చిన భారీ జనస్పందన శుభసూచికం. త్వరలోనే రాష్ట్రానికి నవోదయం. రాబోయే ఎన్నికలు రాష్ట్రానికి కీలకం. అందుకే రెండు పార్టీలు కలిసి బరిలో దిగాయి. మేం చేతులు కలిపింది మా కోసం, అధికారం కోసం, నా కోసం, పవన్ కల్యా ణ్‌కు అధికారం కోసమో కాదు. రాష్ట్రం కోసం, 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్ కోసం చేతులు కలిపాం. విధ్వంసమైన రాష్ట్రాన్ని నిల బెట్టడానికి చేతులు కలిపాం. దెబ్బతిన్న రైతుల కోసం, బిడ్డల ఉద్యోగాల కోసం కలిసి బరిలో దిగాం.
ప్రభుత్వ బాదుడుతో ఛిద్రమవుతున్న పేదవారిని కాపాడేందుకు ఇద్దరం కలిసి అడుగులేస్తున్నాం. ఎవరి వెనుకా ఎవరూ నడవడం లేదు. రెండు పార్టీలు కలిసి ప్రజల కోసం అడుగులు వేస్తున్నాయి. మా పొత్తు వైసీపీ విముక్త ఏపీ కోసం. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకు మా పొత్తు అని చంద్రబాబు ఉద్ఘాటించారు.
చూస్తూ ఊరుకోలేను
ఒక వ్యక్తి అహంకారం వల్ల జరిగే నష్టాన్ని సీనియర్ నేతగా నేను చూస్తూ ఊరుకోలేను. ప్రశ్నించేతత్వం, ఎదిరించే తత్వం ఉన్న పవన్ కల్యాణ్ కూడా మౌనంగా ఉండలేరు. అందుకే ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు. రాష్ట్రంలో వెలుగులు నింపే పొత్తు. రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం ప్రజలు కూడా మాతో చేతులు కల పాలని కోరుకుంటున్నా. రాష్ట్రాన్ని 2014 ఎన్నికలకు ముందు హేతుబద్ధత లేకుండా విభజించారు. ఆ సంక్షు భిత సమయంలో పవన్ ఎన్నికల ముందే తాను పోటీ చేయడం లేదని, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు టీడీపీ, బీజేపీని సమర్థిస్తామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చా రు. మేం అధికారాన్ని బాధ్యతగా తీసుకుని ప్రతిక్షణం రాష్ట్రం కోసం ఆలోచించాం. రాజధాని లేని రాష్ట్రం, అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని ఏం చేయాలని ఆలో చించాం. హైదరాబాద్ లేని రాష్ట్రంలో కనీసం పింఛన్ల యినా ఇస్తారా అని ప్రజలు ఆలోచించే సమయంలో పలు కార్యక్రమాలు చేశాం. ఏపీలో అన్ని వనరులు ఉన్నాయి.
ప్రపంచాన్ని జయించే శక్తి ఆంధ్రా తమ్ముళ్లకు ఉంది. సమర్థులైన ప్రజలు ఉన్నారు. పోల వరం ఉంది. సముద్రతీరం ఉంది. బంగారం పండిరచే భూములు ఉన్నాయి. అన్నదాతగా, అన్నపూర్ణగా రాష్ట్రా నికి పేరు వచ్చిందంటే గోదావరి, కృష్ణా డెల్టాలే కారణం. ఈ వనరులన్నింటినీ సమర్థవంతంగా విని యోగించుకుంటూ రాష్ట్రం బాగుకోసం ముందుకు వెళ్లాం. 2029కి విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అమరావతిని హైదరాబాద్ కంటే మిన్నగా ఉండాలని రూపకల్పన చేశాం. పోలవరం పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని ఉన్నతమైన సంకల్పంతో ముందుకు వెళ్లాం. కేంద్రం నుంచి 11 విద్యాసంస్థలను తీసుకు వచ్చాం. ఢల్లీికి వెళితే రాష్ట్రం కోసం మాత్రమే వెళ్లాం. అనేకం సాధించాం. ప్రపంచమంతా తిరిగి 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువచ్చాం. పది లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇలా ఇటుకా ఇటుకా పేర్చి కట్టిన సౌధాన్ని జగన్ వచ్చి ఒక్క గొడ్డలి వేటుతో నాశనం చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు.
మాస్క్ అడిగిన దళిత డాక్టర్‌ను చంపేశారు
ఇవాళ రాష్ట్రంలో సైకో పాలన ఉంది. ఏ రాష్ట్రంలోనైనా, ఏ ముఖ్యమంత్రినైనా సైకో అంటున్నారా? ప్రజావేదిక కూల్చివేత ద్వారా విధ్వం సంతో పరిపాలన ప్రారంభించారు. ఇదే జగన్ నిజ మైన నైజం. మీడియాను కంట్రోల్ చేయడానికి, ప్రతి పక్షాలను కంట్రోల్ చేయడానికి జీవో నెం.1 తీసుకు వచ్చారు. మీటింగ్‌లు అడ్డుకున్నారు. ఎన్నికల ముందు ముద్దులు పెట్టిన జగన్ తర్వాత మీడియాపైనా, అందరి పైనా పిడిగుద్దులు గుద్దారు. అన్న క్యాంటీన్లు మూసి ివేశారు. అన్న క్యాంటీన్ల ద్వారా అన్నం పెట్టకూడదన్న దుర్మార్గుడు జగన్. పెత్తందారీ వ్యవస్థకు ఇది నిదర్శ నం. రాజధానిని అడ్డుకున్నారని, శాసన మండలి లో బిల్లు పాస్ చేశారని, ఆ మండలినే రద్దు చేయాలని కోరిన వ్యక్తి జగన్ రెడ్డి. మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్‌ను పిచ్చోడిని చేసి చంపేశారు.
ఇది అతని అరా చకానికి పరాకాష్ట. రాజధానిలో విట్, ఎస్‌ఆర్‌ఎం, అమృత్ వంటి యూనివర్సిటీల్లో 15వేల మంది బయటి ప్రాంతాల విద్యార్థులు వచ్చి చదువు కుంటున్నారు. వీటిని టీడీపీ తీసుకువచ్చిందనే దురు ద్దేశంతో ఆ యూనివర్శిటీలకు రోడ్లు కూడా వేయ కుండా ఇబ్బంది పెడుతున్నారు. నీళ్లు కూడా ఇవ్వటం లేదు. టీడీపీ హయాంలో వేసిన రోడ్లలో మట్టిని కూడా తవ్వుకుని వెళ్లిపోయారు. అంతర్జాతీయ క్రికెటర్ హనుమ విహారి వైసీపీ వేధింపులు తట్టుకోలేక రాష్ట్ర జట్టుకు ఇక ఆడేది లేదంటూ వెళ్లిపోయేలా అవ మానాలకు గురి చేశారని చంద్రబాబు మండిపడ్డారు.
సొంత చెల్లి, తల్లిని కూడా వదిలిపెట్టలేదు
తన సొంత చెల్లెలు, ఆస్తి తగాదాలతో, ప్యాలెస్ తగాదాలతో విభేదించి వేరే పార్టీలో చేరితే ఆమె పుట్టుకపైనా, తల్లిపైనా సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టారంటే ఎలాంటి వ్యక్తో ఆలోచించుకోవాలి. సీఎం జగన్ మానసిక స్థితికి ఇవన్నీ నిదర్శనం. పవన్ కల్యాణ్ ఇప్పటంలో మీటింగ్ పెడితే, ఆ సభకు స్థలం ఇచ్చారని పొక్లెయిన్‌లు తీసుకువెళ్లి అక్కడి ఇళ్లను కూలగొట్టారు. నేను సీఎంగా ఉన్నప్పుడు తిరుపతిలో ఒక సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ఆడవారిని చంపేవాడు. ఒంటరిగా ఉన్నవారిని క్రూరంగా చంపేసేవాడు. అతడిని పట్టుకోవాలని చెప్పాను. చివరకు పట్టుకుంటే గతంలో నేరాలు చేసి జైలుకు పోయిన వ్యక్తి మహిళలపై ద్వేషం పెట్టుకుని ఇవన్నీ చేశాడని తేలింది. అతడిని జైల్లో పెట్టాం. చివరకు ఎన్ కౌంటర్‌లో చని పోయాడు. ఈ ముఖ్యమంత్రి ప్రవర్తన కూడా అలానే ఉంది. కక్ష పెట్టుకున్నట్లుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం కోసం, డబ్బుల కోసం, రాజ కీయం కోసం ఇవన్నీ చేస్తున్నాడు. వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిరచి సైకో నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి. సిద్ధమా అని హాజరైన జనాన్ని చంద్రబాబు అడిగారు.
తెలుగుజాతిని నెం.1 చేయడమే మా సంకల్పం
ఈ రాష్ట్రాన్ని కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విభజించి సర్వనాశనం చేయాలని చూస్తున్నాడు. కులాలు కూడు పెట్టవు. మంచి ప్రభుత్వాలే జీవితాలను మారుస్తాయి. నా ఆలోచన, పవన్ కల్యాణ్ ఆలోచన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలపాలనే. తెలుగుజాతిని నెం.1గా చేయాలనేది మా సంకల్పం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే ఎలాంటి త్యాగాలు చేయడానికైనా నేను, పవన్ సిద్ధంగా ఉన్నాం. ప్రజలు సిద్ధమా అని చంద్రబాబు అడిగారు.
చిరంజీవిని, రాజమౌళిని అవమానించారు
పవన్ విమానంలో వస్తే వీళ్ల అబ్బసొత్తు మాదిరిగా విమానాశ్రయానికి రావటానికి వీలులేదంటారు. విశాఖలో తిరగకూడదని హోటల్లోనే కట్టడి చేశారు. సినిమా టికెట్ల పేరుతో మహా నటుడు చిరంజీవిని, మహా దర్శకుడు రాజమౌళిని అవమానించే స్థాయికి వెళ్లారు. ఆ రోజు నేను బాధపడ్డా, జీవితంలో ఇలాంటివి జరగకూడదని అనుకున్నా. వై నాట్ 175 అంటున్నాడు జగన్.. ఏం పొడిచాడని? వై నాట్ జాబ్ కేలండర్, డీఎస్సీ, ఉచిత ఇసుక. వైనాట్ పులివెందుల? తాడేపల్లిగూడెం శబ్దం పులివెందులకు వినపడాలి. హూ కిల్డ్ బాబాయ్? సమాధానం చెప్పాలని చంద్రబాబు సవాల్ విసిరారు.
నీళ్ల పేరుతో నాటకం
జగన్ ఒక బ్లఫ్‌మాస్టర్. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు. తెచ్చాడా? మద్యపాన నిషేధం చేశావా, సీపీఎస్ రద్దు చేశావా? కుప్పంలో 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా. కుప్పానికి నీళ్లని నాటకాలు వేశాడు. ట్యాంకర్‌లో నీళ్లు తీసుకెళ్లి కాలువలో పోశాడు, గేట్లు తీసుకెళ్లి సినిమా సెట్టింగ్ వేశాడు. జగన్ నీళ్లు వదిలి వస్తే తెల్లారితే కాలువల్లో లేవు. జగన్ ఎత్తిన గేట్లు తెల్లారితే లేవు. సెట్టింగులు ఊడతీసుకుని వెళ్లిపోయారు. లక్ష ఓట్ల లక్ష్యంగా కుప్పంలో సహకరించాలని నేను పిలుపునిచ్చా. నా నియోజక వర్గంలో నాకు లక్ష మెజార్టీ వస్తుంది. జగన్ నాటకాలు జనం పట్టించుకోరని చంద్రబాబు అన్నారు.
నమ్మిన జనమే ఛీ కొడుతున్నారు
ప్రశాంత రాష్ట్రంలో హింస, దాడులు, కేసులతో వైసీపీ అగ్గి రాజేసింది. అదే అగ్గితో టీడీపీ-జనసేన తమ్ముళ్లు వైసీపీని తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అగ్నికి పవన్ అనే వాయువు కూడా తోడైంది. అగ్నికి వాయువు తోడైతే వైఎస్సార్ కాంగ్రెస్ బుగ్గి అవుతుంది. జగన్ ది ఫ్లాప్ సినిమా. జగన్ సినిమా అట్టర్ ఫ్ల్లాప్. దీనికి సీక్వెల్ ఉండదు. వైసీపీ రౌడీలకు 40 రోజుల్లో రియల్ సినిమా చూపిస్తాం. జనసేన, టీడీపీ పొత్తు సూపర్ హిట్. నీ కుట్రలు, కుతంత్రాలు, విధ్వంసానికి ఇక ఫుల్ స్టాప్. అందుకే టీడీపీ-జనసేన విన్నింగ్ టీమ్.. వైసీపీ ఛీటింగ్ టీమ్. మా ఇద్దరి కలయిక రాష్ట్ర భవిష్యత్ కోసం అని చంద్రబాబు ఉద్ఘాటించారు.
ప్రజల్లో ఉండేవారినే అభ్యర్థులుగా పెట్టాం
మేం 99 సీట్లు ప్రకటించాం. మిగిలిన సీట్లు కూడా ప్రకటిస్తాం. మీ ఆశీర్వాదం కోసం మొదటి సభ తాడేపల్లిగూడెంలో పెట్టాం. ఈ సభ తర్వాత మన గెలుపును ఎవ్వడూ ఆపలేడని తేలిపోయింది. బాధ్యతగా అభ్యర్థుల ఎంపిక చేస్తున్నాం. కోటి 30 లక్షల మంది అభిప్రాయాలు సేకరించాం. ప్రజల్లో ఉండే వారినే అభ్యర్థులుగా పెడుతున్నాం. వీరిని చూసిన తర్వాత జగన్ లో భయం మొదలై తన అభ్య ర్థులను మారుస్తానంటున్నాడు. మన అభ్యర్థులు విద్యా వంతులు, పేరున్నవారు. జగన్ అభ్యర్థులు స్మగర్లు, రౌడీలు. వారు గెలిస్తే రక్షణ ఉండదు. రాష్ట్రాన్ని పునర్ నిర్మించాలనే సంకల్పం మాకు ఉంది. కావాల్సింది మీ మద్దతు. జగన్ వద్ద రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో స్కెచ్ ఉంది. ఎలా అభివృద్ధి చేయాలో మా వద్ద బ్లూ ప్రింట్ ఉంది. బాదుడు లేకుండా సంక్షేమం అమలు చేస్తాం. పెట్టుబడులు తీసుకువచ్చి సంపద సృష్టిస్తాం. నీళ్లు ఇచ్చి రైతుల్ని బతికిస్తాం, యువతకు ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
త్వరలోనే టీడీపీ-జనసేన ఎన్నికల మేనిఫెస్టో
మేం సంపద ద్వారా వచ్చే ఆదాయాన్ని పేదవాళ్లకే ఇస్తాం. అందుకే సూపర్-6 తీసుకువచ్చాం. రేపో, ఎల్లుండో మళ్లీ అన్నివర్గాలకు న్యాయం చేసే విధంగా బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్ ఇస్తాం. ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు, రైతుల కోసం ఆలోచిస్తాం. ఉద్యోగులకు కూడా న్యాయం చేస్తాం. త్వరలోనే టీడీపీ-జనసేన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తాం. మన ఐక్యత దెబ్బతీసేందుకు జగన్ అనేక కుట్రలు చేస్తాడు. అప్రమత్తంగా ఉండాలి. అందరికీ సీట్లు ఇవ్వలేకపోవచ్చు. పనిచేసిన ప్రతి కార్యకర్త, నాయకుడికి న్యాయం చేసే బాధ్యత రెండు పార్టీలు తీసుకుంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు.
టీడీపీ-జనసేన పొత్తు సూపర్ హిట్
నేతలు ఈగోకు పోవద్దు. ఎవరూ ఎక్కువా, తక్కువా కారు. ఎవరి వెనుకా ఎవరూ నడవడం లేదు. రెండు పార్టీలు కలిసి ప్రజల కోసం అడుగులు వేస్తున్నాయి. పార్టీల నిర్ణయాలను అర్థం చేసుకున్న తెలుగుదేశం, జనసేన నాయకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. రాష్ట్రానికి న్యాయం చేయాలనే సంకల్పంతో మేం ఇద్దరం మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. ప్రజల జీవితాలను ఛిద్రం చేసిన ఫ్యాన్.. టీడీపీ-జనసేన కొట్టే దెబ్బకు ముక్కలు ముక్కలు అయిపోవాలి. కలిసి పనిచేయండి.. కసితో పనిచేయండి, కష్టపడి పనిచేయండి. అలాంటి కార్యకర్తలకు న్యాయం చేస్తాం. పొత్తు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, ప్రజల బతుకులు వెలగాలి. టీడీపీ-జనసేన పొత్తు సూపర్ హిట్. ఆంధ్రప్రదేశ్ ఇక అన్‌స్టాపబుల్. తెలుగుదేశం-జనసేన ఐక్యత వర్థిల్లాలి. ఎన్నికలయ్యే వరకు ఎవరూ విశ్రమించవద్దని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.