- పీ`4 స్పందనతో అమితమైన ఆనందం
- ఎక్స్ పోస్టులో పేర్కొన్న సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): ‘‘పరోపకారం పరమో ధర్మః’’ అనేది మన భారతీయ ధర్మమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎదుటివారికి, సమాజానికి సేవ చేయడం మన సంస్కృతిలో భాగమని, అందుకే మనది పుణ్యభూమి అయ్యిందన్నారు. గురువారం ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. మనం బాగుండాలి.. మనతో పాటు నలుగురు బాగుండాలని నాడు ‘‘జన్మభూమి’’ కార్యక్రమం చేపట్టి సమాజంలో మార్పునకు శ్రీకారం చుట్టామని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో నేడు ‘‘జీరో పావర్టీ పీ`4’’ కార్యక్రమాన్ని తలపెట్టామని, దీనికి వస్తున్న స్పందన ఎంతో సంతృప్తినిస్తోందని వెల్లడిరచారు. ఇటీవల ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త తిరుమల వేంకటేశ్వరస్వామికి 121 కిలోల బంగారం విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారని, భూరి విరాళాలు తితిదే చేపట్టే విద్య, వైద్యంవంటి సేవలకు ఎంతో ఉపకరిస్తుందని, ఎన్నో సత్కార్యాలకు దోహదపడుతుందన్నారు. డబ్బు సంపాదన కంటే, దాన్ని తిరిగి సమాజంపై ఖర్చు చేయడమే ఎక్కువ తృప్తిని, నిజమైన సంతోషాన్నిస్తుంది అనడంలో సందేహం లేదన్నారు. సమాజంలో సంపద సృష్టించిన ప్రతి ఒక్కరూ మంచి మనసుతో తిరిగి సమాజం కోసం వెచ్చించేందుకు ముందుకు రావాలని కోరారు. ఇదో గొప్ప ఆదర్శంగా నిలిచి ఎన్నో మార్పులకు నాంది పలకాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. సీఎం సమక్షంలో ఏపీఎం టెర్మినల్స్ మారిటైమ్ బోర్డు ఒప్పందం చేసుకుంది. ఏపీఎం సంస్థ పోర్టుల్లో మౌలిక సౌకర్యాలు, నిర్వహణ చేపట్టనుంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల నిర్వహణను చేపట్టనుంది. ఓడరేవుల్లో టెర్మినల్స్, కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయనుంది. రూ.9 వేల కోట్లతో కార్గో హ్యాండ్లింగ్, టెర్మినల్స్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.