- తప్పు చేస్తే తప్పించుకోలేరు
- ఉనికి కోసం జగన్ ఫేక్ రాజకీయం
- జగన్ కుట్రలను సాగనివ్వం
- లీసులూ కఠినంగా ఉండాలి
- చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటానంటే ఎవరైనా ఒప్పుకోం
- టీడీపీపీ సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
అమరావతి(చైతన్యరథం): ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా తిరస్కరించిన తరువాత కూడా జగన్ ప్రవర్తనలో మార్పు రాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన శనివారం ఉండవల్లి నివాసంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఉనికి చాటుకోవడానికి జగన్ హింసా రాజకీయాలు అంటూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. జనం గట్టిగా బుద్ధి చెప్పినప్పటికీ జగన్ ఇప్పటికీ ఫేక్ పాలిటిక్స్‌నే నమ్ముకున్నాడు. జగన్ ది ఫేక్ రాజకీయం….వ్యక్తిగత దాడులకు రాజకీయ రంగు పులుముతున్నాడు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీపడేది లేదు…పోలీసులు కూడా కఠినంగా ఉండాలి. జగన్ బెదిరింపులకు భయపడేది లేదు..కుట్రలను సాగనిచ్చేది లేదు. తప్పుడు ప్రచారంతో మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు.
వినుకొండ హత్య అత్యంత కిరాతకం. నిందితులను వదిలేది లేదు. వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యకు కూడా జగన్ రాజకీయ రంగు వేస్తున్నాడు. హతుడు, నిందితుడి మధ్య వ్యక్తిగత గొడవలు ఉన్నాయని స్వయంగా ఆ పార్టీ నేతలే అంగీకరించారు. పోలీసుల విచారణలో కూడా ఇదే విషయం స్పష్టమయింది….అయినా వైసీపీ నీచ రాజకీయాలు చేస్తోంది. గత 5 ఏళ్లుగా వ్యవస్థలు అన్నీ ధ్వంసం అయ్యాయి. అదుపులేని గంజాయి, మద్యం, డ్రగ్స్ వల్లే రాష్ట్రంలో క్రైం రేటు పెరిగింది. దీన్ని త్వరలో పూర్తిగా కంట్రోల్ చేస్తాం. టీడీపీ అంటేనే బెస్ట్ లా అండ్ అర్డర్ అని అంతా భావిస్తారు. ఈ బ్రాండ్ ను దెబ్బతీయడానికి ఎవరు ప్రయత్నించినా సహించేది లేదు. రాష్ట్రంలో ఏ రకమైన హింసను అనుమతించేది లేదు. లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా ఉంటాం. నేరస్థులు రాజకీయ ముసుగులో తప్పులు చేసి తప్పించుకోవాలని చూస్తే కుదరదు. ఇకపై నేరస్థులు ఆటలు ఏమాత్రం సాగనివ్వం. నాకు లా అండ్ ఆర్డర్ కంటే ఏదీ ముఖ్యంకాదు.
పోలీసులు కూడా కూడా నేరం జరిగిన వెంటనే చర్యలకు దిగాలి. తప్పు చేస్తే శిక్ష తప్పదు అనే భయం నేరస్థుల్లో కలిగిస్తాం. మత ఘర్షణలు, ఫ్యాక్షన్, నక్సలిజం, రౌడీయిజాన్ని కంట్రోల్ చేసిన చరిత్ర మనది. తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరు. కానీ మనం అప్రమత్తంగా ఉండాలి. మనందరిపైనా కేసులు పెట్టారు. జైలుకు వెళ్లాం. అందరికీ కోపం, కసి ఉంది. కానీ కక్ష తీర్చుకునే విధానాలు వద్దు. దాడులకు పాల్పడితే ఎవరినైనా వదిలేది లేదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే మాత్రం అంగీకరించను. నేరస్థులను పట్టుకోవడంలో, విచారణలో ఆలస్యం జరిగితే నేను స్వయంగా విచారణకు వస్తాను. ఇందులో అనుమానం లేదు. హింస వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే సహించేది లేదు. రాష్ట్రంలో హింస అనేది కనిపించకూడదు. రౌడీలు, నేరస్థులను హెచ్చరిస్తున్నా…..ప్రభుత్వం మారింది. తీరుమార్చుకోకపోతే కష్టం అని నేరగాళ్లు తెలుసుకోవాలి. మహిళలపై అఘాయిత్యాల విషయంలో తీసుకునే చర్యలు చూసి నేరం చెయ్యాలంటేనే భయపడే పరిస్థితి తీసుకువస్తామని చంద్రబాబు సీఎం స్పష్టం చేశారు.