- గత ఐదేళ్లు అధికారం అండతో పేట్రేగిపోయారు
- పోసాని నోటి దురుసు వ్యాఖ్యలు గుర్తున్నాయి
- చట్టం తన పని తాను చేసుకుపోతుంది
- వైసీపీ నేతలు నీతులు మాట్లాడటం సిగ్గుచేటు
- గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర
మంగళగిరి(చైతన్యరథం): అధికారం అండగా అడ్డగోలుగా వ్యవహరిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చ రించారు. పోసాని కృష్ణమురళి అరెస్టుపై స్పందించిన మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టును సమర్థించారు. అధికారం అండతో గత ఐదేళ్లు వైసీపీ నేతలు ఎంతటి దుర్మార్గంగా వ్యవ హరించారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. నంది అవార్డులపై కూడా ఇష్టారీతిగా ప్రవర్తిం చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేశ్, పవన్‌కల్యాణ్ విషయంలో నాడు ఎంత టి పరుష పదజాలంతో దూషించారో ప్రజలందరికీ గుర్తుంది. అలాంటి వారి విషయం లో చట్టం తన పని తాను చేసుకుపోతుంటే వైసీపీ నేతలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నా రో వారికే తెలియాలి. ఐదేళ్ల పాటు దాడులు, దుర్మార్గాలు, తప్పుడు కేసులు, తప్పుడు పోస్టింగులతో పేట్రేగిపోయిన వైసీపీ నాయకులు ఇప్పుడు నీతులు మాట్లాడడం హాస్యా స్పదం. ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితులు కల్పించిన ఘనత జగన్‌రెడ్డిది. నేడు న్యాయబద్ధమైన పాలన అందిస్తుంటే చూసి ఓర్వలేక తప్పుడు ప్రచా రాలకు పాల్పడుతున్నారు. పోసాని కృష్ణమురళి సహా..తప్పు చేసిన ఏ ఒక్కరు కూడా చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.