చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

గాలి మారుతోంది..!

వెంకటగిరి ‘‘రా. కదలిరా’’ సభలో చంద్రబాబు

by చైతన్యరధం
Jan 20, 2024 at 9:03am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
గాలి మారుతోంది..!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వెయ్యి తప్పులు చేసిన జగన్‌ను ఇంకా భరిస్తారా
  • జగన్‌ విశ్వసనీయత పెద్ద ఫార్స్‌
  • హోదా తెచ్చాడా, సీపీఎస్‌ రద్దు చేశాడా, మద్యం నిషేధించాడా?
  • ఎర్రచందనం స్మగ్లర్లకు అసెంబ్లీ టిక్కెట్లా?
  • టీడీఆర్‌ బాండ్ల అక్రమార్కులను వదిలేది లేదు
  • తిరుమల పవిత్రతను దెబ్బతీశారు
  • దొంగ ఓట్ల అక్రమాలకు అధికారులు మూల్యం చెల్లించక తప్పదు
  • వెంకటగిరి ‘‘రా. కదలిరా’’ సభలో చంద్రబాబు

వెంకటగిరి: రాష్ట్రంలో రాజకీయ గాలి మారుతోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రాన్ని రివర్స్‌ గేర్‌ లో నడిపించిన తుగ్లక్‌ పని అయిపోయిందన్నారు. పురాణాల్లో శిశుపాలుడు 100 తప్పులు చేస్తే, నేడు ఈ జగనాసురుడు వెయ్యి తప్పులు చేశాడు.. ఇంకా భరిద్దామా అని ప్రజలను ప్రశ్నించారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రా..కదలిరా సభలో చంద్రబాబు మాట్లాడారు. రా.. కదలిరా కార్యక్రమానికి వెంకటగిరి గర్జించింది.. వెంకటగిరి ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో ఉండి ఇప్పుడు తిరుపతికి వచ్చింది.. జిల్లా మారింది కాని వెంకటగిరి రాత మారిందా? ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఎవరైనా ఆనందంగా ఉన్నారా? విధ్వంసకర పాలనను తరమివేయడానికే రా. కదలిరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఉద్ఘాటించారు.

వెయ్యికి పైగా తప్పులు దాటిన తుగ్లక్‌
జగన్‌ పాలన బాగోలేదని చెప్పిన వ్యక్తి ఆనం రాంనారాయణ రెడ్డి. అందుకు ఆయన మీద ఏ విధంగా ప్రవర్తించాడో అందరం చూశాం. ఆయన ఎన్టీఆర్‌, రాజశేఖర్‌ రెడ్డి హయాంల్లో మంత్రిగా చేసిన ఆనం మాటే జగన్‌ రెడ్డి వినలేదు. ఆయన అడిగింది మంత్రి పదవి కాదు. ప్రజాహితం కోసం కోరితే దూరం పెట్టారు. అలాంటి సీనియర్‌ నాయకులను లెక్కచేయని అహంభావి జగన్‌ రెడ్డి. కురుగొండ్ల రామకృష్ణ నియోజకవర్గం ఇంచార్జ్‌ గా 5 ఏళ్లు పోరాడారు. శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు శ్రీకృష్ణుడు భరించారు. ఈ తుగ్లక్‌ ఇప్పటికే 1000 తప్పులు చేశాడు. ఇంక భరించలేము. మనకు ఇంకా 82 రోజులే సమయం ఉంది. జగన్‌ రెడ్డికి కౌంట్‌ డౌన్‌ మొదలయ్యిందని చంద్రబాబు అన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-03-2026

సెవెన్త్ నుంచి ట్వెల్త్ వరకూ ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లు

ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

ఏ ఒక్క వర్గం బాగుపడలేదు
రాష్ట్రంలో రైతులు, యువత, మహిళలు, ఏ వర్గమైనా ఆనందంగా ఉన్నారా? రాష్ట్రంలో ప్రజలకు రక్షణ ఉందా? పేదలు తిండే తినే పరిస్థితి లేదు. ఆఖరికి పండుగ కానుకలను కూడా రద్దు చేశారు. అన్న క్యాంటీన్లు నిలిపివేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పని అగమ్యగోచరం. జీతాలు పెంచమని అడగడం కంటే 1వ తారీఖు జీతాలు వెయ్యమని అడిగే పరిస్థితికి వచ్చారు. అడిగితే జైలుకు పోతామని భయంతో అడగకుండా రాజీ పడుతున్నారు. చిరు వ్యాపారస్థుల పరిస్థితి బాగోలేదు. వెంకటగిరి అంటే గుర్తుకు వచ్చేది చేనత రంగం. వెంకటగిరి చీరలు ప్రత్యేకం. ఒక్క చేనేత కార్మికుడైనా బాగుపడ్డారా? టీడీపీ హయాంలో 50 ఏళ్లకే పింఛన్లు ఇచ్చాం. కష్టం వస్తే ఆదుకున్నాం. 2015లో వరదలు వస్తే రూ.15వేలు కుటుంబానికి ఇచ్చాం. జగన్‌ పాలనలో ఏ కులమైనా బాగుపడిరదా? ఆఖరికి రెడ్డి కులస్థులు కూడా అథోగతి పాలవుతున్నారని చంద్రబాబు విమర్శించారు.

జగన్‌ పంపేయాలి.. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి
చెన్నైతో తిరుపతి, నెల్లూరుని లింక్‌ చేసి పారిశ్రామిక హబ్‌ గా చేయాలనుకున్నాం. వీటిని కనెక్ట్‌ చేస్తూ రోడ్లు వేశాం. తిరుపతిని ఎలక్ట్రానిక్‌ హబ్‌ గా చేశాం. సెల్‌కాన్‌, కార్బన్‌, డెక్కన్‌ వంటి అనేక కంపెనీలు తిరుపతికి తెచ్చాం. అక్కడ కంపెనీల్లో పని చేయించుకునేందుకు వెంకటగిరి నుంచి యువతను బస్సులో తీసుకువెళ్లుతున్నారు. హీరో మోటార్స్‌, అపోలో టైర్లు, రిపబ్లిక్‌ ఫోర్స్‌ కంపెనీలు శ్రీ సిటీలో పెట్టి యువతకు ఉద్యోగాలు ఇచ్చాం. దేశంలోనే మంచి సంస్థలను తీసుకువచ్చాం. కాని నేడు అన్నీ పోయాయి. జగన్‌ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. ప్రజలు గెలవాలి.. జగన్‌ పోవాలని చంద్రబాబు అన్నారు.

టీడీఆర్‌ బాండ్ల అవినీతిని వెలికితీస్తాం
నాడు టీడీపీ హయాంలో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తే జగన్‌ 24 శాతం నిరుద్యోగం పెంచాడు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తానని నిరుద్యోగులను మోసం చేశాడు. మనం దక్షిణ కొరియా ప్రభుత్వంతో మాట్లాడి కియా లాంటి కార్ల పరిశ్రమను తీసుకువస్తే జగన్‌ మాత్రం ఇక్కడ ఉన్న అమర్‌ రాజా కంపెనీని తరిమేశాడు. జాబు కావాలంటే బాబు రావాలి. బాబు రావాలంటే మీరు పని చేయాలి. తిరుపతి సహా అనేక నగరాలు, పట్టణాల్లో టీడీఆర్‌ బాండ్స్‌ లో రూ.25వేల కోట్ల అక్రమాలు జరిగాయి. భూ సేకరణలో నష్టపోయిన భూములకు పరిహారం కింద టీడీఆర్‌ బాంద్ల పేరిట భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. అనేక చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు టీడీఆర్‌ బాండ్ల పేరిట వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే విచారణ జరిపించి తప్పు చేసిన వాళ్లందరినీ శిక్షిస్తామని చంద్రబాబు హెచ్చరించారు.

ఎర్ర చందనం స్మగ్లర్లకు రెడ్‌ కార్పెట్టా?
ఎర్రచందనం వైసీపీ నాయకులకు ఆర్థిక వనరుగా మారింది. ఈ 5 ఏళ్లల్లో ఒక్క ఎర్రచందనం దొంగను పట్టుకున్నారా? ఎర్రచందనం స్మగ్లర్లకు రెడ్‌ కార్పెట్‌ వేస్తున్నారు. ప్రజాసందను దోచేస్తున్నారు. టీడీపీ హయాంలో ఎర్రచందనాన్ని ఉక్కుపాదంతో అణచివేశాం. నేడు సాక్షాత్తు స్మగ్లర్‌ కే చిత్తూరు ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో రూ.7,500 కోట్లు దోపిడీ చేశారు. తిరుమల భక్తుల కోసం నాడు టీడీపీ హయాంలో రూ.630 కోట్లతో గరుడ వారధి తీసుకువస్తే జగన్‌ గంజాయి తెచ్చారు. తిరుపతిని మనం ఒక టెంపుల్‌ సిటీగా ప్రమోట్‌ చేస్తే జగన్‌ దొంగ ఓట్ల సంస్కృతి తెచ్చారు. వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నారు. ఆయనకు అపచారం చేస్తే ఆ దేవుడు మిమ్మల్ని వదలిపెట్టరు. కొండపై అన్నదానం కార్యక్రమాన్ని కూడా పాడు చేశారు. నాశిరకం అన్న ప్రసాదాలు వడ్డిస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. దివంగత నేత ఎన్టీఆర్‌ తిరుమల కొండపై అన్నదానాన్ని ప్రారంభించారు. నాడు కార్పస్‌ ఫండ్‌ కూడా వచ్చింది. జగన్‌ ప్రభుత్వం అన్నదాన ప్రాశస్థ్యాన్ని దెబ్బతీస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

దోచుకొని దాచుకోవడమే జగన్‌ నైజం
ఎర్రచందనంతో పాటు ఇసుకను దండుకుంటున్నారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారు. మనం ఉచిత ఇసుకను ఇస్తే నేడు ఇసుకలో అడ్డం గా దోచుకుంటున్నారు. మంగంపేట బెరైటీస్‌, గ్రానైట్‌, లెటరైట్‌, లైమ్‌ స్టోన్‌, బీచ్‌ శాండ్‌ అన్నింటిలో దోపిడీకి పాల్పడుతున్నారు. రైతుల పొలాల్లో ఉండే మట్టిని కూడా అక్రమంగా తవ్వుకుని చెన్నైకి తీసుకుపోతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

కేంద్రం ముందు మెడలు దించాడు
రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో రాష్ట్రాన్ని రివర్స్‌ లో నడిపించారు. మూడు ముక్కలాట ఆడారు. ఆంధ్రప్రదేశ్‌ కు రాజధాని లేకుండా చేశారు. మాట తప్పను, మడమ తిప్పను అనేది జగన్‌ ఊతపదం. 98 శాతం హామీలు నెరవేర్చాం అన్నాడు. కేంద్రం మెడలు వచ్చి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు, యువతకు ఉద్యోగాలు వస్తాయన్నాడు, 5 ఏళ్లు అవుతోంది.. కేంద్రం మెడలు వంచాడా? కాదు జగనే మెడలు దించాడు. మద్య పాన నిషేదం చేస్తేనే ఓట్లు అడగుతానన్నాడు. నేడు సొంత బ్రాండ్లు, నాసిరకం బ్రాండ్లు పెట్టి మన జీవితంతో ఆడుకుంటున్నాడు. అప్పు కోసం 25 ఏళ్లకు మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టారు. జగన్‌కు ఓటు అడిగే హక్కు ఉందా? సీపీఎస్‌ వారంలో రద్దు చేస్తామన్నాడు. ఇప్పటికి ఎన్ని వారాలయ్యాయి. సీపీఎస్‌ రద్దు చేశాడా అని చంద్రబాబు ప్రశ్నించారు.

మారుస్తున్న ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది దళితులే..
విలువలు లేని వ్యక్తులు రాజకీయాలకు అనర్హులు. జగన్‌ రెడ్డి విశ్వసనీయత ఎలాంటిదంటే.. దళితులను నమ్మించి ఓట్లేయించుకుని, నేడు 29 మంది దళిత ఎమ్మెల్యేలను మార్చాడు. జగన్‌రెడ్డి మారుస్తున్న ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది దళితులే. దళితులకు పాలన చేతకాదనేలా జగన్‌ చేతలున్నాయి. దళితులను అవమానిస్తున్నాడు. 5 ఏళ్ల నుంచి ఒక్క ఎమ్మెల్యేని మందలించకుండా ఇప్పుడు వేరే నియోజకవర్గాలకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారు. మీ ఊరిలో చెత్త మరో ఊర్లో బంగారం అవుతుందా? దళితులను మాయ చేసి ఓట్లు వేయించుకుని, ఇప్పుడు అణగదొక్కుతున్నాడు. మరోసారి రాజకీయ కుట్రకు తెరలేపి, మోసంతో ఓట్లు వేయించుకోవాలని అనుకుంటున్నాడు. కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టినా.. దాని వెనుకటి గుణములు మరచిపోదు. ఫ్యాక్షనిస్టు, నేరస్తుడు, మానసిక రోగి అని తెలిసినా.. నెత్తిన చెయ్యి పెట్టి ఒక్క ఛాన్స్‌ అనగానే ఐస్‌ అయిపోయి ఓట్లేశాం. చివరవకి అందరం నష్టపోయామని చంద్రబాబు అన్నారు.

దోపిడీకి బ్రాండ్‌ అంబాసిడర్లు వైసీపీ ఎమ్మెల్యేలు
వైసీపీ ఎమ్మెల్యేలు దోపిడీకి బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారారు. వెంకటగిరికి కొత్త బిచ్చగాడులా వచ్చిన వైసీపీ సమన్వయకర్త.. పెన్నా నదిలో ఇసుకను వదలడు. తెల్లరాయి ని వదలడు. మొలకలకొండలో కొండలు తవ్వేశాడు. భూములు కబ్జా చేస్తున్నాడు. ఇక సూళ్లూరుపేట ఎమ్మెల్యే కలివేటి.. ఇసుక, మద్యం, గంజాయి, క్రిటెట్‌ బెట్టింగుల్లో సిద్ధహస్తుడు. జగన్‌ రెడ్డి స్పూర్తితో అంతకు మించి అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. గూడూరులో ఎమ్మెల్యే వర ప్రసాద్‌ ఇసుక, సిలికా దోపిడీ తేల్చాలంటే పుస్తకాలు సరిపోవు. క్లబ్బు డాన్సర్లు కూడా మహిళా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. కోర్టుల్లోని సాక్ష్యాలు కూడా కొట్టేసే కాకాణి గోవర్దన్‌రెడ్డి ఒక మంత్రి. మద్యం, గ్రావెల్‌ దోపిడీతో జిల్లాను సైతం కొనేసే స్థాయిలో వెనకేసుకున్నాడు. అతడి మైనింగ్‌ దోపిడీకి రాష్ట్రంలోని మైన్స్‌ అన్నీ బెంబేలెత్తుతున్నాయి. కాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌ రెడ్డి అవినీతికి అంతులేకుండా ఉంది. రేణిగుంటను కూతురికి, ఏర్పేడు తమ్ముడికి ఇచ్చేశాడు. ఆయన కాళహస్తిని ఆక్రమించుకున్నాడు. ఏడుకొండల వాడిని సైతం దోచుకునే వ్యక్తి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి. ఇంతటి దుర్మార్గులొస్తారని ఎప్పుడూ ఊహించలేదు. ప్రశాంతమైన చిత్తూరులో ఇలాంటి దుర్మార్గులు అధికారంలోకి రాకూడదు. కండలేరు జలాశయం పనులు పూర్తి చేయలేదు. తెలుగు గంగ గాలికొదిలేశారు. సోమశిల హైలెవల్‌ కెనాల్‌, తోపుగుంట పనులు ఎందుకు పూర్తి కాలేదు? గూడూరులో ఫ్లై ఓవర్‌ నిర్మాణాలు ఎందుకు చేయలేదు? ఆక్వా రంగాన్ని ఆదుకునే బాధ్యత తీసుకుంటా. స్వర్ణముఖి నదిపై బ్రిడ్జి పనులు పూర్తి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

పేదరిక నిర్మూలనే నా లక్ష్యం
ప్రతి కుటుంబాన్ని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది. కుటుంబ వికాసం కోసం ప్రపంచంలోని తెలుగువారంతా ఏకం కావాలి. పేదరికం లేని సమాజ నిర్మాణానికి శ్రీకారం చుడదాం. పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఇంట్లో దీనిపై చర్చ జరగాలి. నా ఆలోచన స్వర్ణయుగం.. జగన్‌ రెడ్డి ఆలోచన రాతియుగం. ప్రజలంతా సంతోషంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. తిరుపతి పార్లమెంటులో ఏడు అసెంబ్లీ సీట్లు గెలుస్తున్నామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని బ్లాక్‌ లిస్ట్‌లో పెడుతున్నారు
పెండిరగ్‌ బిల్లులు, కాంట్రాక్టర్ల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. జగన్‌ పాలనలో నష్టపోని వ్యక్తి లేడు. కాంట్రాక్టర్లకు రూ.95వేల కోట్ల బకాయిలు పెట్టారు. 43 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆఖరికి బిల్లు రాక వైసీపీ సర్పంచ్‌ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఒకప్పుడు ప్రభుత్వాలు కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్ట్‌ లో పెట్టేవి. ఇప్పుడు రివర్స్‌ లో కాంట్రాక్లరే ప్రభుత్వాన్ని బ్లాక్‌ లిస్ట్‌ లో పెడుతున్నారు. టెండర్‌ పిలిస్తే ఎవ్వరూ రావడం లేదని చంద్రబాబు ఎద్దేవ చేశారు.

దొంగ ఓట్ల కుట్రలో అధికారులకు శిక్షలు తప్పవు
ఏ పాలకుడైనా అభివృద్ధి చూసి ఓట్లు అడుగు తారు. కాని ఈ దుర్మార్గుడు మాత్రం ఓట్ల విధ్వం సానికి పాల్పడ్డాడు. చంద్రగిరి నియోజకవర్గంలో లక్షా 15వేల దొంగ ఓట్లు చేర్చారు. దానిని జగన్‌ వత్తాసు పలుకుతున్నారు. దొంగ ఓట్ల కుట్రలో భాగం పంచుకున్న అధికారులకు శిక్షలు పడుతున్నా యి. గతంలో తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా దొంగ ఓట్లపై నమోదైన కేసును వెనక్కి తీసుకోవా లంటూ టీడీపీ నాయకురాలు పనబాక లక్ష్మి ఇంటికి అధికారులు ఇప్పుడు క్యూలు కడుతున్నారు. కేసు వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. మిమ్మల్ని బోను ఎక్కిస్తాం. దొంగ ఓట్లతో మనుషులు బతికి ఉండగా నే చంపేస్తున్నారు. ఇటువంటి దుర్మార్గులకు శిక్షలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు.

Previous Post

రాయలసీమ ద్రోహి జగన్‌రెడ్డి

Next Post

తప్పులు చేసే అధికారులకు గిరీషా గతే: బొండా

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-03-2026

కార్యకర్త
@ March 7, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
చైతన్యరధం

సెవెన్త్ నుంచి ట్వెల్త్ వరకూ ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లు

చైతన్యరధం
@ March 7, 2026
ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్
ఆంధ్రప్రదేశ్

ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

చైతన్యరధం
@ March 7, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్

‘మా పిల్లలు బంగారం’

చైతన్యరధం
@ March 7, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్

ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్

చైతన్యరధం
@ March 7, 2026
చైతన్యరధం ఈ పేపర్ 06-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-03-2026

కార్యకర్త
@ March 6, 2026
ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ
ఆంధ్రప్రదేశ్

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ

చైతన్యరధం
@ March 6, 2026
ముంపు కాలనీలకు రక్షణ గోడ
ఆంధ్రప్రదేశ్

ముంపు కాలనీలకు రక్షణ గోడ

చైతన్యరధం
@ March 6, 2026
Load More

ముఖ్య వార్తలు

బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

సెవెన్త్ నుంచి ట్వెల్త్ వరకూ ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లు

చైతన్యరధం
@ March 7, 2026
ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

చైతన్యరధం
@ March 7, 2026
జనాభా భారం కాదు… భాగ్యం

జనాభా భారం కాదు… భాగ్యం

చైతన్యరధం
@ March 6, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం

ఐటీ గ్లోబల్ మ్యాప్‌లో విశాఖపట్నం

చైతన్యరధం
@ March 5, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

సెవెన్త్ నుంచి ట్వెల్త్ వరకూ ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లు

చైతన్యరధం
@ March 7, 2026
ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

చైతన్యరధం
@ March 7, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

‘మా పిల్లలు బంగారం’

చైతన్యరధం
@ March 7, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్

చైతన్యరధం
@ March 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms Conditions
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist