- ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆర్యవైశ్యులంటే ఎనలేని గౌరవం
- పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు
- రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలపమెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్
- విజయవాడలో ఆర్వవైశ్య సంక్షేమ సంఘం రాష్ట్రస్థాయి ఆత్మీయ సమావేశం
- పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
విజయవాడ(చైతన్యరథం): తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యులకు ఎప్పుడూ అండగా ఉంటుందని, ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్యవైశ్యులకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు వందశాతం పూర్తి చేశారని, ఆర్యవైశ్యుల సంక్షేమానికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలపమెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ తెలిపారు. శుక్రవారం విజయవాడలో ఆర్వవైశ్య సంక్షేమ సంఘం రాష్ట్రస్థాయి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రత్యేకం గా ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ప్రదర్శించారు. కూటమి ప్రభుత్వమొచ్చాక ఆర్యవైశ్యులు భయం లేకుండా వ్యాపారాలు చేసుకుంటున్నారని, వైసీపీ హయాంలో ఆర్యవైశ్యుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని మండిపడ్డారు. ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలపమెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల పదవీ కాలంలో మూడు సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆర్వవైశ్యల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వ హించడం సంతోషంగా ఉందన్నారు. ఆర్యవైశ్యులంటే చంద్రబాబుకు ఎనలేని గౌరవ మని, సమాజంలో వెనకబడిన ఆర్యవైశ్యులను పైకి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని పేదలకు అండగా నిలిచేందుకు పీ-4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఈ కార్యక్రమం ద్వారా పేదరికంలో మగ్గిపోతున్న వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఆర్యవైశ్యులు ముందుకురావాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో పాట్టి శ్రీరాముల మొమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహి స్తామని, రాజధాని అమరావతిలో 58 అడుగులు పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నామని అందుకు రాష్ట్రంలోని ఆర్యవైశ్యులంతా సహకరించాలని కోరారు.
ఆర్యవైశ్యులకు అండగా ఉంటా : ఎంపీ కేశినేని శివనాథ్
ఆర్యవైశ్యులు చేసే వ్యాపారాల్లో వచ్చే సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించి అండగా ఉంటానని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం మాటంటే మాటేనని, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్స వాన్ని అధికారిక కార్యక్రమంగా చేపడతామని ఆర్యవైశ్యులకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి అమలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వైసీపీ పాలనలో ఆర్యవైశ్యులను బెదిరించి విరాళాలు సేకరించారని, ఆ ఆగడాలతో విసుగు చెందిన వారు ఏకపక్షంగా కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచారని పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిం దని, ఏ అవసరమొచ్చినా తను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
ఆర్యవైశ్యులకు పెద్దపీట వేసిందే కూటమి ప్రభుత్వం : మంత్రి టీజీ భరత్
ఆర్యవైశ్యులకు పెద్దపీట వేసిందే ఎన్డీయే ప్రభుత్వమని, పెనుగొండ ప్రాంతానికి త్వరలోనే వాసవి పెనుగొండగా నామకరణం చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వనున్నారని మంత్రి టీజీ భరత్ తెలిపారు. గత ఎన్నికల్లో 95 శాతం వైశ్యులు టీడీపీకిఇ ఓటేయడం జరిగిందని, వారి అభివృద్ధికి తమ ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందన్నారు. ఆర్యవైశ్యులకు ఏ ఇబ్బంది వచ్చినా, వారి సమస్యలు పరిష్కరించేం దుకు సిద్ధంగా ఉంటానని తెలిపారు.
కూటమి పాలనలో ఆర్యవైశ్యులకు స్వేచ్ఛ : ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరమే ఆర్యవైశ్యులకు స్వేచ్ఛ లభించిందని జగ్గయ్యపేట టీడీపీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో ఆర్యవైశ్యుల వ్యాపారాలను దెబ్బతీశారని, కూటమి పాలన రాకతో ఆర్యవైశ్యులు నేడు ప్రశాంతంగా వారి వ్యాపారాలు వారు నిర్వహించుకుంటున్నారని, ఆర్యువైశ్యుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతిఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో మరింత సంక్షేమాన్ని ఆర్యవైశ్యులకు అందించేందుకు చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు.