- మహిళలు చిరస్థాయిగా గుర్తించుకుంటారు
- ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు
- మహిళా సాధికారతకు కృషి అభినందనీయం
- వైసీపీ విమర్శలు దిగుజారుడుతనానికి నిదర్శనం
- ఏపీడబ్ల్యూసీఎఫ్‌సీ చైర్‌పర్సన్ పీతల సుజాత
మంగళగిరి(చైతన్యరథం): ఆడబిడ్డలు, అక్కా చెల్లెమ్మలను వృద్ధిలోకి తీసుకురావాలన్న సిద్ధంతామే టీడీపీ విధానం..నాడు ఎన్టీఆర్ మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు..నేడు చంద్రబాబు మహిళా సాధికారతకు కృషిచేస్తున్నారని మాజీ మం త్రి, ఏపీడబ్ల్యూసీఎఫ్‌సీ చైర్‌పర్సన్ పీతల సుజాత ప్రశంసించారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావే శంలో మాట్లాడారు. చంద్రబాబు డ్వాక్రా అనే విత్తనం వేసి నేడు కోటి మంది మహిళలు వారి కుటుంబాలకు ఆసరాగా నిలిచేలా ప్రోత్సహించారు. మహిళా సాధికారతకు ఎన లేని కృషి చేశారు. యువ నాయకులు మంత్రి నారా లోకేష్ ఆలోచనల నుంచి వచ్చిన నా తెలుగు కుటుంబం తీర్మానాల్లోని విధానం ద్వారానే స్త్రీ శక్తి పథకం రూపొందిందని గుర్తుచేశారు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టారు. మహిళలకు స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఉచిత బస్సు పథకాన్ని కానుకగా ఇచ్చినందు కు రాష్ట్ర మహిళల తరపున చంద్రబాబు, ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళలకు ఇచ్చిన కాను క స్త్రీ శక్తి పథకం ఒక చారిత్రాత్మకమైన గిప్ట్. రాఖీ పండుగను అక్కా చెల్లెలు ఎలా గుర్తుపెట్టుకుంటారో నేడు స్త్రీ శక్తి పథకాన్ని కూడా మహిళలంతా చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారు. ఎంతో మంచి పథకాన్ని రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారు.
వైఎస్ భారతి ప్రయాణించవచ్చు
ఇలాంటి మంచి పథకాన్ని ప్రవేశపెడితే వైసీపీ పేటీఎం బ్యాచ్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇంత మంచి పథకంపై కూడా వైసీపీ వాళ్లు విమర్శలు చేయడం వాళ్ల దిగజారుడు తననానికి నిదర్శనం. వైఎస్ భారతి కూడా ఈ ఉచిత బస్సులో ప్రయాణం చేయొచ్చు. ఫ్రీ టికెట్ ద్వారా పులివెందుల నుంచి అమరావతికి రావచ్చు. వైసీపీ పాలనలో ఐదేళ్ల పాటు ప్రజలకు నరకం చూపిం చారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దగా చేశారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వానికి ఏటా రూ.1,942 కోట్ల భారం
ఏడాదిలో చెప్పినవే కాకుండా చెప్పని హామీలను కూడా అమ లు చేశాం. స్త్రీ శక్తి పథకం మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ పథకం ద్వారా కుటుంబ బంధాలు కూడా బలపడతా యి. ఆర్థిక ఇబ్బందుల వల్ల శుభకార్యాలకు వెళ్లాలన్న మహిళలు ఆలోచిస్తారు. అలాంటి దిగులు లేకుండా చంద్రబాబు ఉచిత బస్సు పథకం తీసుకొచ్చారు. సామాజిక కార్యక్రమాల్లో కూడా మహిళలు అధికంగా పాల్గొంటారు. మొత్తం 100 శాతం ఉన్న ఆర్టీసీ బస్సు ల్లో 74 శాతమున్న ఐదు రకాల బస్సులైన పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ప్రయాణం సాగించవచ్చు. ఆర్టీసీలో మొత్తం 11,449 బస్సులు ఉండగా 8,458 బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అను మతించాం. ఇందుకోసం ప్రభుత్వంపై ప్రతినెలా రూ.162 కోట్ల చొప్పున ఏడాదికి రూ.1,942 కోట్ల భారం పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సగటున రోజుకు 25 లక్షల మంది మహిళలు, బాలి కలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయబోతున్నారు. ‘స్త్రీ శక్తి’ అమలు తర్వాత మహిళల ప్రయాణం సంఖ్య 40 శాతం నుంచి అనూహ్యంగా 67 శాతానికి పెరుగుతుంది. ఆర్టీసీపై ఏటా రూ. 288 కోట్ల రాబడి తగ్గుతుంది. అదనంగా నిర్వహణ ఖర్చులు రూ. 201 కోట్ల వరకూ పెరిగే అవకాశం ఉంది. మహిళా ప్రయాణి కుల భద్రత దృష్ట్యా అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయా లని, మహిళా కండక్టర్లకు శరీరానికి ధరించే (బాడీ వోర్న్) కెమెరాలు సమకూర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. కొన్ని రూట్లు.. ఏపీ పరిధిలో మొదలై పొరుగు రాష్ట్రంలో కొన్ని గ్రామాల మీదుగా ప్రయాణించి మళ్లీ ఏపీలోని గమ్యస్థానానికి చేరుతుంటాయి. రాయలసీమ జిల్లాల్లో ఇటువంటి రూట్లు (ఎన్వ్ రూట్లు) ఉన్నాయి. అటువంటి రూట్లలో అయిదు రకాల బస్సుల్లో మహిళలు ఉచితం గా ప్రయాణించవచ్చని తెలిపారు.
ఏటా 2.5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలు
ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకా లను అమలు చేస్తింది. స్త్రీ నిధి రుణాలను రూ.3.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. వడ్డీ రాయితీని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచారు. మహిళా పారిశ్రామిక వేత్తలను తీర్చిద్దడమే లక్ష్యంగా ఎంఎస్‌ఎంఈ పార్కులను కూటమి ప్రభు త్వం ఏర్పాటు చేస్తుంది. గతంలో ఎన్నడు లేని విధంగా అంగన్ వాడీ కార్యకర్తలకు ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు అందజేస్తోంది. గ్రామైక్య మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీల ద్వారా రూ.3 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు అందజేస్తోంది. అం దులో రూ.10 లక్షల వరకు వడ్డీ రాయితీ కల్పిస్తుంది. బాలికా విద్యకు అత్యధిక నిధులు కేటాయించి ప్రాధాన్యత ఇస్తుంది. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. ఎస్సీ మహిళలకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు కల్పిం చాం. ఒక్కో మహిళా సంఘానికి గరిష్ఠంగా రూ.10 లక్షల నుంచి 25 లక్షల వరకు రుణాల మంజూరు చేశాం. తద్వారా రాష్ట్రంలో కుటీర, చిన్నతర హా పరిశ్రమలను మహిళలు ఏర్పాటు చేసుకునేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి 2.5 లక్ష ల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్న లక్ష్యం తో ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు.