- వైసీపీ డ్రామాలు ప్రజలు నమ్మరు
- బొత్స విమర్శలకు మంత్రి నిమ్మల స్ట్రాంగ్ కౌంటర్
అమరావతి (చైతన్యరథం): భద్రత కావలసింది జగన్‌కు కాదు.. జగన్ నుండి రాష్ట్రానికి, ప్రజలకు భద్రత కావాలని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. జగన్ భద్రతపై వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ చేసిన విమర్శలను మంత్రి నిమ్మల గట్టిగా తిప్పికొట్టారు. నేర స్వభావం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే భద్రత ఎవరికి కావాలో బొత్సకు తెలియదా అని ప్రశ్నించారు. ప్రజలంతా జగన్ నుండి మాకు భద్రత కావాలని మొన్నటి ఎన్నికల్లోనే స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. సీఎం చంద్రబాబు సైతం తన పర్యటనల్లోనే పరదాలు వద్దు, ప్రజలను ఇబ్బంది పెట్టేలా పోలీసుల ఆంక్షలు వద్దు అని తన భద్రత కూడా తగ్గించుకున్నారు. జగన్‌కు మాత్రం 1100 మంది పోలీసులతో భద్రత కల్పిస్తే అదికూడా సరిపోదంటున్నాడు. పరామర్శకు వెళ్తున్నారా .. బల ప్రదర్శనకు వెళ్తున్నారా? డబ్బులు పంచిపెట్టి హెలికాఫ్టర్ దగ్గరకు జనసమీకరణ చేయాల్సిన అవసరం ఏముంది. హెలికాఫ్టర్ దగ్గరకు అంతమంది వైసీపీ కార్యకర్తలు, నాయకులను తీసుకురావడం, వాళ్ళే జగన్ మీద దాడి చేశారని చెప్పడం దేనికి సంకేతం. హెలికాఫ్టర్ దగ్గర 250 మంది పోలీసులను భద్రత పెడితే, భద్రత లేదు అంటూ వైసీపీ సోషల్ మీడియాలో ముందే ఏ విధంగా ప్రచారం చేశారు.
ఇందులో మతలబు ఏమిటి? గతంలోనూ కోడి కత్తి, గులకరాయి, గొడ్డలి పోటును గుండె పోటుగా మార్చిన డ్రామాలు చూశాం. ఇప్పుడు హెలికాఫ్టర్ మీద దాడి చేసి ధ్వంసం చేశారని అంటున్నారు. అలా అయితే గంటన్నర వ్యవధిలోనే హెలికాఫ్టర్ తిరిగి ఎలా వెళ్ళిపోయింది. జగన్ డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. గతంలో మీ పాలనలో చంద్రబాబు పర్యటన ఉంటే చాలు.. 30 యాక్ట్, ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు అంటూ, ఉదయాన్నే సాక్షి పేపర్ కంటే ముందే మా ఇళ్ల మీదకు వచ్చి అరెస్టులు చేసేవారు. అమరావతి, నందిగామ, ఎర్రగుంట్ల, పుంగనూరులో చంద్రబాబుపై దాడి చేశారు. కుప్పం వెళ్లడానికి కూడా చంద్రబాబును అడ్డుకుంటే, కాలి నడకన వెళ్ళారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అమరావతి రైతులు పాదయాత్ర చేపడితే అరెస్టులు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మిమ్మల్ని ఎక్కడైనా అడ్డుకున్నామా? మీకు నచ్చిన చోట మీటింగులు పెట్టుకుంటున్నారు, సభలు పెట్టుకుంటున్నారు, మిమ్మల్ని ఎక్కడైనా అరెస్టులు చేశామా? వైసీపీ మాజీ మంత్రి కారుమూరి మాట్లాడుతూ గుంటూరు ఇవతల, అవతల జనాల్ని ఇంట్లో నుండి లాక్కొచ్చి నరుకుతాం అంటున్నారు. అధికారంపోతే హింస, అరాచకం, పెంచి పోషిస్తున్నారు. మీరు ఢల్లీి వెళ్లి అమిత్ షాను కలవటం కాదు.. ముందు సీబీఐ కేసుల వాయుదాలకు హాజరవ్వాలి. ప్రధాని మోదీ సాయంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టాలని చూస్తుంటే , జగన్ రాష్ట్ర ప్రతిష్ట దిగజార్చుతున్నాడని మంత్రి నిమ్మల మండిపడ్డారు.