- దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సప్‌తో పౌర సేవలు చారిత్రాత్మకం
- ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు
- సాంకేతిక విప్లవంలో ‘మన మిత్ర’ ఓ సంచలనం
- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు నరహరి వరప్రసాద్
అమరావతి (చైతన్యరథం): సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ.. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా ఐటీ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు, టీడీపీ గిరిజన నేత డా. కొండారెడ్డి నరహరి వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఐటీ మంత్రి నారా లోకేష్ వాట్సాప్ ద్వారా 161 పౌర సేవలు ప్రారంభించిన నేపధ్యంలో కొండారెడ్డి మాట్లాడుతూ.. నాడు ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఐటీ రంగంలో హైటెక్ సిటీని నెలకొల్పి ఐటీ రంగంలో లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించిన చంద్రబాబు నాయుడి ఆలోచన విధానాలను ముందుకు తీసుకెళ్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ప్రజలకు విస్తృత రీతిలో పౌరసేవలు అందించే విధంగా మంత్రి నారా లోకేష్ అనేక విప్లవాత్మక విధానాలకు శ్రీకారం చుడుతున్నారన్నారు. విద్యా, ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ అనేక నూతన విధానాలను లోకేష్ తీసుకొస్తున్నారని కొనియాడారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సాంకేతిక పరిజ్ఞానంతో పౌర సేవలను మరింత సులభతరం చేస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా వాట్సాప్ ద్వారా వివిధ రకాల పౌర సేవలను అందించడం అత్యద్భుతం. నాడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు హైదరాబాదును ఐటికి హబ్ గా నిలిపితే నేడు నవ్యాంధ్రప్రదేశ్‌లో నారా లోకేష్ ఏపీని ఏఐకి హాబ్‌గా నిలుపుతున్నారు. ‘‘మనమిత్ర’’ పేరుతో వాట్సప్ ద్వారా పౌర సేవలను అందించే కార్యక్రమం ఇందుకు ఒక నిదర్శనం. గత వైసీపీ పాలన.. రాక్షస పరివారంతో విపక్షాలపై బూతులు, అల్లర్లు, హింసాకాండలే అజెండాగా కొనసాగితే… నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా పాలన కొనసాగుతోంది. యువనేత లోకేష్ రెండు సంవత్సరాల క్రితం చేసిన యువగళం పాదయాత్ర యువత భవిష్యత్తుకు భరోసాగా నిలిచింది. యువ గళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్న తీరును రాష్ట్ర యువత గమనిస్తోంది. ఇప్పటికే ఆరు లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చి యువత కలలకు రెక్కలు తొడుగుతున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ఓటు వేసిన ప్రతీ పౌరుడు గర్వపడే రీతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన ఉందని నరహరి పేర్కొన్నారు.