- విద్యామంత్రి నారా లోకేశ్ సారథ్యం అద్భుతం
- ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల ప్రశంసలు
అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో అమలవుతున్న సంస్కరణలకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల నుండి ప్రశంసలు దక్కాయి. ప్రపంచ బ్యాంకు, సమగ్ర శిక్షలో అమలవుతున్న సాల్ట్ ప్రోగ్రాం కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వినూత్నంగా అమలవుతున్నాయని, దేశానికే కాదు.. దక్షిణ ఆసియకే రోల్ మోడల్గా నిలుస్తున్నాయంటూ పపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. బుధవారం విద్యా మంత్రి నారా లోకేశ్తో సమావేశమైన ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం.. ఆయన నాయకత్వాన్ని ప్రత్యేకంగా అభినందించారు. పాల్ ల్యాబ్లు, గ్యారెంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, స్కూల్ లీడర్ షిప్ శిక్షణలు బాగా జరుగుతున్నాయన్నారు. మంత్రి లోకేశ్ను కలిసిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల్లో క్రిస్టెల్ కౌమే, సౌమ్య బజాజ్, యిన్ విన్ ఖైన్, ప్రియాంక సాహూతోపాటు పాఠశాల విద్యశాఖ కార్యదర్శి కోన శశిధర్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావులు ఉన్నారు.
భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు
లీప్ కార్యక్రమానికి సాల్ట్ ప్రొగ్రాం ఎంతగానో దోహదపడుతోందని విద్యా మంత్రి నారా లోకేశ్ ప్రస్తావించారు. గ్యారెంటెడ్ ఎఫ్ఎల్ఎన్కి సాల్ట్ ప్రోగ్రాం ద్వారా జరిగిన ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ పునాది వేయడానికి ఉపయోగపడతాయ న్నారు. శిక్షణ కార్యక్రమాల ద్వారా మూల్యాంకనం చేసి భవిష్యత్తు శిక్షణ కార్యక్రమాలు చేపడతామని పేర్కోన్నారు. ప్రపంచ బ్యాంకుతో భవిష్యత్తు నిర్మాణ కార్యక్రమానికి, భాగస్వామ్యానికి చర్చించడం కోసం మరోసారి సమావేశమవుతామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
పాల్ ల్యాబ్లు -విద్యలో కొత్త ఆవిష్కరణ
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేయడానికి పాల్ ల్యాబ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ ల్యాబ్ల ద్వారా విద్యార్థుల్లోని లోపాలను గుర్తించి వ్యక్తిగతంగా సహాయం చేయడానికి వీలుకలుగుతుంది. దీనివల్ల ఉపాధ్యాయులు మరింత మెరుగైన ప్రణాళికతో బోధించగలుగుతున్నారని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు మంత్రి లోకేశ్ వివరించారు.
ఏపీలో ఎఫ్ఎల్ఎన్ గ్యారంటీడ్ పథకం
ఫౌండేషనల్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ… అందించే లక్ష్యాన్ని సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో ఉందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. “గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ సాధిస్తామని.. అప్పుడు ప్రపంచానికే ఏపీ దిక్సూచిగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్ర విద్యాభివృద్ధికి సాల్ట్ -సమగ్ర శిక్ష చేస్తున్న కృషికి విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, ఎస్పీడీ బి. శ్రీనివాసరావును ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అభినందించారు.