- నేపాల్లో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకొస్తాం
- సీఎం ఆదేశాలతో పరిస్థితిని క్షణక్షణం సమీక్షిస్తున్నాం
- ఇప్పటివరకు 12 ప్రాంతాల్లో 217 మందిని గుర్తించాం
- నేటి మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి చేరుస్తాం
- మీడియా సమావేశంలో మంత్రి నారా లోకేష్ వెల్లడి
అమరావతి(చైతన్యరథం): నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని గురువారం సాయంత్రానికి క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత కూట మి ప్రభుత్వానిదని విద్య. ఐటీ, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సచివాలయం నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్లో గురు వారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉదయం నుంచి సీఎం ఆదేశాల మేరకు నేపాల్లో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాం. అక్కడ తెలుగువారు ఎలా ఉన్నారు. వాళ్ల పరిస్థితి ఏమిటి, వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు చర్య లు తీసుకోవాలని చంద్రబాబు చెప్పారు. దాంతో ఉదయం నుంచి నేను ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాం. హెూంమంత్రి అనిత, మంత్రి దుర్గేష్ అనంతపురం సభ నుంచి నేరుగా అమరావతికి వచ్చారు. మేం ముగ్గురం పరిస్థితిని మానిటరింగ్ చేశాం. ఏపీ భవన్లో ఎమర్జెన్సీ సెల్ ఏర్పాటు చేసి ఒక సింగిల్ నెంబర్ ద్వారా తెలుగువారిని సంప్రదించాం. ఎవరైతే ఆ నెంబరు ఫోన్ చేశారో.. ఒక ట్రాకర్ మెయింటెయిన్ చేసి ప్రతి రెండు గంటలకు ఒకసారి పరిస్థితిని సమీక్షించాం. వారికి అందుతున్న ఆహారం, నీరు, విద్యుత్ సదుపా యాలపై రియల్ టైంలో ఆరా తీసినట్లు చెప్పారు.
12 ప్రాంతాల్లో 217 మంది తెలుగువారు
ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్ ద్వారా టీడీపీ ఎంపీ సానా సతీ ష్, ఏపీ భవన్ అధికారి ఆర్.జె. శ్రీకాంత్ రియల్ టైంలో మాని టరింగ్ చేశారు. ఇప్పటికే మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 217 మంది ఆంధ్రులు 12 ప్రాంతాల్లో చిక్కుకుని ఉన్నారు. వీరం తా నేపాల్ లోని హెూటళ్లు, వేరే పట్టణాల్లో ఉన్నారు. ఇందులో సుమారు 173 మంది ఖాట్మండు, 22 మంది హిటోడా, 10 మంది పోక్రా, 12 మంది సిమికోట్లో ఉన్నారు. ఇందులో సుమారుగా 118 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు. అటు ఏపీ భవన్, ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడుఎంబీసీతో, ఇతర అధికారులతో నిరంతరం సంప్రదింపులు చేసినట్లు తెలిపారు.
నేటి మధ్యాహ్నానికి రాష్ట్రానికి తీసుకొస్తాం
గురువారం మధ్యాహ్నానికి ఖాట్మండు నుంచి ఆంధ్రులను తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పా టు చేసిన ఒక ప్రత్యేక విమానం ఖాట్మండు వెళు తుంది. అక్కడి నుంచి వారిని మొదటి హాల్ట్ విశాఖ, రెండో హాల్ట్ కడపకు తీసుకువస్తాం. ఖాట్మండుతో పాటు సిమికోట్లో ఉన్న 12 మందిని ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఉన్న నేపాల్ గంజ్ ఎయిర్ పోర్ట్కు గురువారం ఉదయం తరలిస్తాం. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వారు లక్నోకు వెళ్లి, అక్కడి నుంచి వారిని కమర్షియల్ ఫ్లైట్ ద్వారా రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లుచేశాం. పోక్రాలో ఉన్న 10 మందిని రేపు ఉదయం ప్రత్యేక విమానం ద్వారా ఖాట్మండుకు తీసుకువచ్చి.. అక్కడి నుంచి ఏపీ ప్రభు త్వం ఏర్పాటుచేసిన విమానం ద్వారా తిరిగి రాష్ట్రానికి వస్తారు. హిటోడాలో ఉన్న మరో 22 మంది రోడ్డు మార్గం ద్వారా బుధవారం రాత్రే బీహార్ సరిహద్దు లోని రాక్సాల్కు చేరుకున్నారు. వారికి కావాల్సిన ఇమ్మిగ్రేషన్ ఏర్పాట్లు కూడా చేశాం. వీరి సంరక్షణను ఏపీ భవన్ చూసుకుంటోందని వివరించారు.
క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వానిది
గురువారం ఉదయం 10 గంటలకు తిరిగి సమావేశం అవు తాం. ప్రతి ఆంధ్రుడు తిరిగి వచ్చేంత వరకు నిరంతరం పనిచే స్తాం. కేవలం విశాఖ, కడపకే కాదు.. ప్రభుత్వం అందరినీ వారి వారి నివాసాలకు క్షేమంగా చేర్చే బాధ్యత తీసుకుంటాం. విమా నాశ్రయంలో కూడా వారికి కావాల్సిన వాహనాలు ఏర్పాటు చేసి నేరుగా వారిని ఇంటివద్దకే చేర్చుతాం. ఇందుకోసం మేం అందరం వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. పరిస్థితిని ఎప్పటి కప్పుడు పర్యవేక్షించాం. ప్రతి రెండు గంటలకు ఒకసారి ముఖ్య మంత్రికి పరిస్థితిని వివరించాం. గురువారం సాయంత్రం నాటికి అందరినీ క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది.
మేం మాట్లాడాం
నేపాల్లో చిక్కుకున్న వారు మొదట కొంత ఆందోళనతో ఉన్నారు. మేం మాట్లాడిన తర్వాత కుదురుకున్నారు. అక్కడ నెలకొ న్న భయానక పరిస్థితులను వారంతా వివరించారు. ఏపీ నుంచి మేం 12 గ్రూపులతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాం. ఏవైనా సమస్యలు ఉంటే మమల్ని సంప్రదించాలని చెప్పాం. ఆందోళన లేకుండా మేం చూసుకున్నాం. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్నాయుడుతో కూడా దాదాపు 12 సార్లు మాట్లాడడం జరిగింది. కేబినెట్ భేటీకి ముందు కూడా సంప్రదిం చాను. ఆయన నేపాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకువచ్చే బాధ్యత తీసుకున్నారు. అక్కడ తెలుగువారిలో ప్రధానంగా విశాఖ నుంచి 42 మంది, విజయనగరం నుంచి 34 మంది, కర్నూలు నుంచి 22 మంది ఉన్నారని వివరించారు.