- విజిలెన్స్ విచారణలో నిలిచిపోయిన బిల్లులకు నిధులు విడుదల చేయాలి
- రాష్ట్ర ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షణ్ముఖ్‌కు వీరంకి గురుమూర్తి, లక్ష్మీసుభాషిణి వినతి
అమరావతి (చైతన్యరథం): కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పెండిరగ్ నిధులు విడుదల చేయడం పట్ల రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర ఉపాధి హామీ మండలి మాజీ సభ్యులు వీరంకి వెంకటగురుమూర్తి, మొవ్వా లక్ష్మీ సుభాషిణి హర్షం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన మెటీరియల్, అడ్మిన్ నిధులు రూ. 1,136 కోట్లు రాష్ట్రానికి మంజూరయ్యాయి, మెటీరియల్ నిధులు రూ.960.15 కోట్లు, అడ్మిన్ నిధులు రూ.176.35 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు వీరంకి వెంకటగురుమూర్తి, మొవ్వా లక్ష్మీ సుభాషిణి గురువారం రాష్ట్ర ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షణ్ముఖ్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. పెండిరగ్ బిల్లులతోపాటు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పలు అంశాలు, సమస్యలను వివరించి విజిలెన్స్ విచారణలో నిలిచిపోయిన నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా గురుమూర్తి, సుభాషిణి మాట్లాడుతూ..
2014-19 సంవత్సరాల్లో పెండిరగ్ బిల్లులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, విజిలెన్స్ విచారణలో 21 శాతం, 6 శాతం నిలుపుదల చేసిన నిధులు సైతం విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షణ్ముఖ్ సానుకూలంగా స్పందించారని, ఆన్ గోయింగ్‌లో ఉండ ఆన్‌లైన్‌లో అప్లోడ్ అయిన, పనులకు సంబంధించిన నిధులు తక్షణం విడుదల చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అలాగే, క్లోజ్డ్ మోడ్ లో ఉన్న ఎఫ్‌టీఓ లను ఆన్ గోయింగ్లో కి తీసుకురావటానికి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని, సంప్రదింపులు పూర్తయిన తరువాత సంబంధిత నిధులు కూడా త్వరలో విడుదల చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, హామీ ఇచ్చినట్లు తెలిపారు.