అమరావతి (చైతన్య రథం): వినయం, కరుణ, శాంతి సందేశాలతో లక్షలాది ప్రజలకు స్ఫూర్తినిచ్చిన ఆధ్యాత్మిక నాయకుడు, పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ మరణం చాలా బాధ కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోప్ ఇక లేరన్న సమాచారంతో ఎక్స్ వేదికపై పోస్టు పెట్టిన చంద్రబాబు ‘ఆశకు దీపంలా నిలిచిన ఆయన మానవాళిని ప్రేమ, దయతో నడిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున, ప్రపంచ కాథలిక్ సమాజానికి, ఆయన లోతైన వారసత్వంతో స్పర్శించిన వారందరికీ హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు.