- విచారణ చేయకపోగా స్టేషన్‌కు పిలిపించి కొట్టారు
- ప్రజావినతుల కార్యక్రమంలో బాధితురాలి గోడు
- పొలాన్ని ఆక్రమించిన అన్నా రాంబాబు బంధువు
- మహిళను నగ్నంగా ఫొటోలు తీసి బెదిరింపులు
మంగళగిరి(చైతన్యరథం): వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు బంధువు మోదాల శ్రీనివాసరావు అతని అనుచరులు అక్రమంగా తన జామాయిల్ తోటలోకి ప్రవేశించి తోటలోని జామాయిల్ చెట్లను నరికి అమ్ముకున్నారని ప్రకాశం జిల్లా అర్థవీడుకు చెందిన అంజిరెడ్డి అనే వ్యక్తి సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో ఫిర్యాదు చేశాడు. జామాయిల్ విలువ దాదాపు రూ.25 లక్షలు ఉంటుందని..అంతేకాకుండా తమను పొలంలోకి వెళితే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వారి కబ్జా నుంచి తమ పొలాన్ని విడిపించి వారిపై చర్యలు తీసుకుని తమకు రావాల్సిన డబ్బులు ఇప్పిం చా లని వినతిపత్రం అందజేశాడు. ఎమ్మెల్సీ అశోక్‌బాబు, కార్పొరేషన్ల చైర్మన్‌లు కుడిపూ డి సత్తిబాబు, సజ్జా హేమలత అర్జీలు స్వీకరించారు.
` తాను స్నానం చేస్తున్న సమయంలో ఎదురింట్లో ఉంటున్న మాచర్ల పుష్ప అనే మహిళ తనను నగ్నంగా ఫొటోలు తీసి బెదిరించి రూ.50 లక్షల డబ్బులు, 80 సవర్ల బంగారం తీసుకుందని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలానికి చెందిన ఓ మహిళ వాపోయింది. అంతటితో ఆగకుండా తన ఫొటోలను అడ్డుపెట్టుకుని తన బంధువులను బెదిరించి డబ్బులు తీసుకుంటుందని ఫిర్యాదు చేసింది. తాను ఆత్మహ త్య చేసుకునే పరిస్థితి వచ్చిందని.. మాచర్ల పుష్ప వెనుక ఆమె భర్త బ్రహ్మయ్య, కుమా రుడు వీరేంద్ర, అల్లుడు ఆనంద్‌బాబు ఉండి కావాలని ఈ పని చేయించారని ఆవేద న వ్యక్తం చేసింది. పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని..విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మొరపెట్టుకుంది.
` ఎస్టీ ఎరుకుల కులానికి చెందిన తమకు వారసత్వంగా వచ్చిన భూమిని కబ్జా చేశారని పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన మొగిలి నాంచారమ్మ ఫిర్యాదు చేసింది. దీనిపై గతంలో మంత్రి లోకేష్‌కు అర్జీ పెట్టుకోగా విచారణ చేపట్టాలని పోలీసులకు అధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయని, అయినా పోలీసులు కబ్జాకోరులకు అండగా ఉండి తమనే స్టేషన్ పిలిపించి కొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు ఎటువంటి ఆస్తి లేదని బలవంతంగా కాగితాలు రాయించుకున్నారని వాపోయింది. దీనిపై ఉన్న తాధికారులు విచారించి తమకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు.
` తన తండ్రి ద్వారా తనకు వారసత్వంగా వచ్చిన భూమికి వైసీపీ నాయకులు నకిలీ పత్రాలు సృష్టించి రెవెన్యూ రికార్డులు మార్చేశారని కడప జిల్లా గోపవరం మండలం మడకలవారిపల్లి గ్రామానికి చెందిన వైకుంఠం రామకేశి ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా తమపై దాడి చేసి తన ఇంటిని కూల్చారని.. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా దాడి చేసిన వారికే అండగా ఉంటున్నారని వాపోయాడు. తమకు న్యాయం చేయాలని బాధితుడు నేతలకు మొరపెట్టుకున్నాడు.
` తాను ఉద్యోగ రీత్యా మరోచోట ఉండటంతో తన భూమిని వైసీపీకి చెందిన వారు దౌర్జన్యంగా ఆక్రమించుకోగా న్యాయస్థానానికి వెళ్లి స్వాధీనం చేసుకున్నానని, అయినా మళ్లీ తన భూమిని కబ్జా చేసి తన ఇంట్లోని సామగ్రిని దొంగిలించుకు పోయారని బాపట్ల జిల్లా నగరం మండలం ఘాలివారపాలెంకు చెందిన పండా శ్రీధర్‌బాబు వాపోయాడు.
` నంద్యాల జిల్లా అవుకు మండలం శింగనపల్లె గ్రామానికి చెందిన శివ ప్రసాద్ రెడ్డి సమస్యను వివరిస్తూ తన తండ్రి ఆర్మీలో పనిచేస్తుండగా కర్నూలు జిల్లా కల్లూరు మండలం గణేష్ నగర్‌లో ఇచ్చిన ఫ్లాట్‌ను నాగేశేషు అనే వ్యక్తి కబ్జా చేసేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదు చేశాడు. అధికారులు తమకే ఆ ఫ్లాట్‌పై హక్కులు ఉన్నా యని తేల్చారని, దాంతో అక్కడ పూరిల్లు, కొట్టం వేసుకుని కాంపౌండు కట్టుకోగా.. దాన్ని నాగశేషు కూలగొట్టాడని.. అతనిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
` పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన నిమ్మగడ్డ రమేష్ తన సమస్యను వివరిస్తూ భీమా శ్రీను అనే వ్యక్తి తమ వద్ద పొలాన్ని కౌలుకు తీసుకుని దాన్ని కబ్జా చేయడానికి యత్నిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. గెట్లను తొలగించిన దానిపై ప్రశ్నిస్తే తమపై దౌర్జ న్యానికి వచ్చాడని వివరించారు. అతనిపై చర్యలు తీసుకుని తమ భూమికి సరిహద్దు లు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు.
` దుర్గి మండలం మంగాపురం తండాలో తన తల్లికి చెందిన ఆస్తి వారసత్వంగా తనకు రావాల్సి ఉండగా వైసీపీ సానుభూతిపరులు ఆక్రమించుకున్నారని పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురి సౌత్‌కు చెందిన ఎర్రపల్లి ముత్యాలమ్మ ఫిర్యాదు చేసింది. వారి కబ్జా నుంచి తనకు రావాల్సిన భూమిని విడిపించాలని వేడుకుంది.
` తన పేరు మీద ఉన్న భూమిని వైసీపీ సానుభూతిపరులు గోల్ల వీరన్న, పి.ఓబులేసు, పప్పు వీరాంజనేయులు అక్రమంగా వారి పేరుమీదకు ఆన్‌లైన్ చేసు కున్నారని అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన ఓబులేసు ఫిర్యాదు చేశాడు. ఆక్రమణపై ప్రశ్నిస్తే తనను చంపాలని చూస్తున్నారని వాపోయాడు. వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
` విజయనగరం జిల్లా గుర్ల మండలం దేవుని కణపాక గ్రామానికి చెందిన గౌరీ శంకర్ సమస్యను వివరిస్తూ గతంలో గిరిజనులైన తమకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని పక్క గ్రామ వైసీపీ సర్పంచ్ ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ కార్యాలయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవంలేదని వివ రించాడు. అతనిపై చర్యలు తీసుకుని తమ భూమి కబ్జాకు గురికాకుండా సర్వే రాళ్లు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు.