- రాష్ట్రంలో మాఫియాలా తయారైంది
- బీహార్ రాజకీయం కూడా దిగదుడుపే
- ఆయన పాపాల్లో జగన్‌కూ భాగముంది
- అటవీ భూములను కూడా ఆక్రమించారు
- పాపం పండిరది. విజిలెన్స్‌కు దొరికాడు
- విదేశాలకు పారిపోయే అవకాశముంది
- పాసుపోర్టులు స్వాధీనం చేసుకోవాలి
- అక్రమాలపై విచారణ జరిపించాలి
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
మంగళగిరి(చైతన్యరథం): రాష్ట్రంలో పెద్దిరెడ్డి కుటుంబం ఒక మాఫియాలా తయారై ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో తన అక్రమ సంపాదనతో జగన్‌ను పడగొట్టి తాను ముఖ్యమంత్రి కావాలని కూడా పెద్దిరెడ్డి అనేకసార్లు ప్రయ త్నించారు. పెద్దిరెడ్డి కుటుంబం అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకుని గనులు, ఖనిజం, ఇసుక, ప్రభుత్వ స్థలాలు, పేదల, అటవీ భూములు, ఎర్రచందనం యథేచ్ఛగా దోచు కున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగించి నోరు మూయించేవారు. అధికారులు కూడా వీరి చేష్టలు చూసీ చూడనట్లు ఉండాల్సిం దే.. ఎదురుతిరిగితే తిప్పలు తప్పవు. పెద్దిరెడ్డి 238 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించా డంటే అటవీ చట్టం ఇతనికి ఎన్ని జీవిత శిక్షలు వేయొచ్చో చెప్పొచ్చు. బీహార్ రాజకీ యం కూడా పెద్దిరెడ్డి రాజకీయం ముందు దిగదుడుపే. గనుల శాఖలో 400 మందికి ప్రైవేటుగా ఉద్యోగాలిచ్చాడంటే ఈ పెద్దిరెడ్డి ఎంతటి ఘనాపాటో అర్థం చేసు కోవచ్చు.
పెద్దిరెడ్డి ప్రెస్‌మీట్‌లో తాను తప్పు చేయలేదని ఎప్పుడూ చెప్పుకోలేదు కానీ ఆయనను ఏమీ చేయలేరని మాత్రం పదే పదే చెప్పేవాడు. పెద్దిరెడ్డి పాపాల్లో జగన్ కు భాగముండబట్టే ఇతని అవినీతి సామ్రాజ్యాన్ని జగన్ ఏనాడూ ప్రశ్నించలేదు. చంద్రబాబు పుంగనూరు వెళతానంట అడుగు పెట్టడానికి వీల్లేదని నిరోధించిన అరాచకవాది అని మండిపడ్డారు. గనులేమో పెద్దిరెడ్డి, అటవీశాఖ పెద్దిరెడ్డి శ్రీమతికి, మద్యం అవినాష్‌రెడ్డికి, ఎర్రచందనం పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకనాథ్‌రెడ్డికి ఇలా పం చుకుని రాష్ట్రాన్ని కొల్లగొట్టారు. అనేక ఎకరాల అటవీ భూములను కొల్లగొడుతుంటే అటవీశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారు. ఏ చర్యలు తీసుకోలే దు. అటవీశాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తూ కూర్చున్నారు. ఇప్పుడైనా రంగం లోకి దిగాలి. విజిలెన్స్ రిపోర్టును ఆధారం చేసుకుని రంగంలోకి దిగాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేస్తున్నాం. రాక్షస సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న పెద్దిరెడ్డిపై వెంటనే ఫారెస్టు యాక్టు కింద కేసు నమోదు చేయాలి. పెద్దిరెడ్డి కుటుంబం విదేశాల కు పారిపోయే అవకాశముంది. ఆ నలుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి వారి పాస్ పోర్టులు స్వాధీనం చేసుకోవాలి. అటవీ చట్టాల నుంచి తప్పించుకోవడం అంత సుల భం కాదు..నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్నాయి. ఈ దుర్మార్గులకు ఆ సెక్షన్లు ఆపా దించాలి. పెద్దిరెడ్డి వెయ్యి తప్పులు పూర్తయ్యాయి.. దండన తప్పదని స్పష్టం చేశారు. ఆయనపై ఫిర్యాదు చేసిన ప్రతిఒక్కరికీ ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది. ఆయన ఇక కోరలు పీకిన పాములాంటివాడు. పుంగనూరు ప్రాంతంలోని రెవెన్యూ, పోలీసు, ఫారెస్టు శాఖల అధికారులు ఆయన తప్పులను వెలికితీయడంలో నిమగ్నమ వ్వాలి.. వారిని అరెస్టు చేసి జుడీషియల్ ఎంక్వైరీకి పంపాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ప్రెస్‌లో మాట్లాడుతుంటే పెద్దిరెడ్డి మీద ఫిర్యాదు ఇవ్వడానికి పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ ముందు బాధితులు క్యూ కట్టారు.
పెద్దిరెడ్డి కుటుంబ అవినీతిపై వెంటనే ఈడీ, ఐటీ శాఖాధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టాలని కోరారు. పెద్దిరెడ్డి కుటుంబం తమ విలాసాలకు కట్టుకున్న భవంతులపై కూడా విచారణ జరగాలి. తప్ప కుండా విచారణ జరిపించాల్సింగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. పెద్దిరెడ్డి కుటుంబం అసాంఘిక కార్యకలాపాల్లో ఆరితేరిన కుటుంబంగా పేరు తెచ్చుకుంది. గతంలో వీరి చేష్టలు అధికారులను కూడా ఇబ్బంది పెట్టేవి. పదేళ్ల క్రితం స్కూటర్‌పై తిరిగేవాడని సత్తెవీడు ఎమ్మెల్యే ఆదిమూలం చెప్పాడు. ఆర్థికంగా ఇంత ఎత్తుకు ఎలా ఎదగగలిగారో ప్రజలకు తెలియజేయాలి. అటవీ భూములను కొల్లగొట్టి ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వీరికి శిక్ష పడాలి. విజిలెన్స్ రిపోర్టు పెద్దిరెడ్డికి వ్యతిరే కంగా రావడం అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి కలుగజేసుకుని పెద్దిరెడ్డి పాపాలపై విచారణ చేయించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. విజిలెన్స్ దొరికిపోయా డు..చట్టం ఇతనిపై ఇనుప పాదం మోపబోతోంది. అందుకే బాధితులు కూడా స్పేచ్ఛ గా పార్టీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారు. పెద్దిరెడ్డి అక్రమాలను చెబుతున్నారు. ఆయన మా భూములు కొట్టేశారు.. మా ఆస్తులు కొట్టేశా రని వస్తున్నారు. ఇలాంటి వారు సభ్య సమాజంలో నివసించడా నికి వీలులేదని స్పష్టం చేశారు. సంబంధిత పోలీసుస్టేషన్‌లకు ప్రభుత్వం ద్వారా ఆయన పాపాల చిట్టా పోతుంది. వారిపై కేసులు నమోదు చేసి బాధితులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.