- గ్రామీణాంధ్రప్రదేశ్ ప్రగతి పరుగులు
- పల్లె పండగ 2.0తో గ్రామాల్లో రెట్టింపు అభివృద్ధి లక్ష్యాలు
- ఐదు జిల్లాల పరిధిలో అమరజీవి జలధారలు
- మారుమూల గిరిజన గ్రామాల కోసం అడవి తల్లి బాట
- వన్యప్రాణి సంరక్షణకు హనుమాన్
- కుంకీలు, ఏఐ సాంకేతికతతో ఏనుగుల బెడదకు విముక్తి
- తన శాఖలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముద్ర
అమరావతి (చైతన్యరథం): గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందు వెళుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రజలకు అవసరమైన సంస్కరణలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల్లో పలు కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయని తెలిపారు.
గ్రామీణాంధ్రప్రదేశ్ ప్రగతిని పరుగులు పెట్టిస్తూ.. కూటమి ప్రభుత్వ లక్ష్యాలను అనుగుణంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ వడివడిగా ముందుకు వెళ్తున్నారు. 2025లో తన పరిధిలోని ప్రతి శాఖపై, వాటిలోని విభాగాలపై నిరంతర పర్యవేక్షణ చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను చేపటారు. 13,326 పంచాయతీల్లో ఒకేరోజు గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్ గారు, ఫిబ్రవరి 2025 నాటికి ఆ గ్రామ సభల లక్ష్యాలు పల్లెపండగ 1.0 ద్వారా పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో 4,300 కిలోమీటర్ల రోడ్లు, 22,500 మినీ గోకులాల, 15 వేలకు పైగా నీటి తొట్టెలు, లక్షకు పైగా ఫారం పాండ్స్ నిర్మించారు.
పట్టాలెక్కిన అడవి తల్లి బాట
పోరాట యాత్రలో గిరిజన గ్రామాల్లో పర్యటించి వారి కష్టాలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. డోలీ మోతల రహిత గిరిజన గ్రామాలు లక్ష్యంగా అడవి తల్లిబాట కార్యక్రమాన్ని ఏప్రిల్ 2025లో పట్టాలెక్కించారు. పీఎం జన్మన్, ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ రూ.1,005 కోట్లతో 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అరకు నియోజకవర్గం, పెదపాడు గ్రామం ఈ బృహత్తర కార్యక్రమానికి వేదికగా నిలిచింది. అడవి తల్లి బాటతో గిరి శిఖర గ్రామాలకు రోడ్లు వచ్చాయి..
రెట్టింపు అభివృద్ధి లక్ష్యాలతో పల్లెపండగ 2.0
పల్లెపండగ 1.0 విజయం తాలూకు స్ఫూర్తితో అక్టోబర్ 26వ తేదీన పల్లెపండగ 2.0కి శ్రీకారం చుట్టారు. పల్లెపండగ 2.0కి రెట్టింపు నిధులతో రెట్టింపు అభివృద్ధి లక్ష్యంగా రాజోలు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా రూ. 6,700 కోట్ల నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 53,382 అభివృద్ధి పనులను చేపట్టానున్నారు. అందులో 8,000 కి.మీ. రోడ్లు, మరో 25 వేల మినీ గోకులాలు, 58 కి.మీ. మేర మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మించనున్నారు. పల్లెపండగ 2.0 కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి సాస్కీ(రాష్ట్ర మూలధన పెట్టుబడులపై ప్రత్యేక సాయం) పథకం నుంచి రూ. 2 వేల కోట్లు నిధులు సమకూరాయి. మిగిలిన మొత్తం నాబార్డుతో పాటు మరికొన్ని సంస్థల నుంచి సమీకరించనున్నారు.
అమరజీవి జలధారలకు జీవం
గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన జల జీవన్ మిషన్‌కు కేంద్ర ప్రభుత్వ సాయంతో ముఖ్యమంత్రి చంద్రబాఋ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరిగి జీవం పోశారు. ఆ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఐదు జిల్లాల్లో మెగా వాటర్ గ్రిడ్ పథకాలను ముందుకు తీసుకువెళ్తున్నారు. చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రామీణ ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ. 7,910 కోట్లతో పనులు చేపట్టారు. అందులో జులై నెలలో మార్కాపురం వేదికగా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని 18 మండలాల పరిధిలో 578 గ్రామాలకు తాగునీరు అందించే రూ.1,290 కోట్ల ప్రాజెక్టుకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. డిసెంబర్ నెలలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల పనులను పెరవలిలో ప్రారంభించారు. మొత్తం ఐదు జిల్లాల్లో ప్రారంభించిన ప్రాజెక్టులను 2027 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. తద్వారా వచ్చే 30 ఏళ్లలో కోటీ 21 లక్షల మంది దాహార్తి తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి పొట్టి శ్రీరాములు పేరిట అమరజీవి జలధారగా నామకరణం చేశారు.
స్వచ్ఛరథాలు.. మ్యాజిక్ డ్రెయిన్లు..
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వచ్ఛరథం కాన్సెప్ట్ తీసుకువచ్చారు. వ్యర్థాలు ఇవ్వండి.. నిత్యావసర సరుకులు తీసుకోండి అంటూ జూన్ నెలలో ప్రారంభించిన స్వచ్ఛరథాలు విజయవంతంగా నడుస్తున్నాయి. పనికి రాని ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, గాజు సీసాలు, పేపర్లు, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు, ఇనుము, అల్యూమినియం వ్యర్థాలు ఇచ్చి వాటికి సమానంగా నగదు లెక్కించి 20 రకాల నిత్యావసరాలు అందజేస్తారు. ప్రస్తుతం 7 జిల్లాల్లో 28 స్వచ్ఛరథాలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. భవిష్యత్తులో వీటి సంఖ్యను మరింత పెంచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరో వైపు గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో మురుగు నీటిపారుదల సమస్యకు పరిష్కారం చూపేలా మ్యాజిక్ డ్రైన్ విధానం తీసుకువచ్చారు. ఎన్టీఆర్ జిల్లా సోమవరం గ్రామంలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడం తో రాష్ట్రమంతా అమలు చేస్తున్నారు. 126 గ్రామ పంచాయతీల్లో ఈ పనులు చేపట్టారు. 60.52 కి.మీ. మేర మ్యాజిక్ డ్రైన్లు నిర్మాణం చేస్తున్నారు.
ఏనుగుల బెడద నివారణకు ఏఐ సాంకేతికత
చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అడవి ఏనుగుల బెడదను అరికట్టేందుకు కర్ణాటక నుంచి రాష్ట్రానికి కుంకీ ఏనుగులను తీసుకువచ్చిన పవన్ కళ్యాణ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఓ వైపు కుంకీలకు క్యాంపులో మన రాష్ట్ర పరిస్థితులకి తగిన విధంగా శిక్షణ ఇప్పిస్తూ.. మరోవైపు ఏఐ సాంకేతికతతో కూడిన అధునాతన వ్యవస్థను అటవీశాఖకు పరిచయం చేశారు. అటు కుంకీలు కూడా ఈ ఏడాదిలో చేపట్టిన ఆపరేషన్లు విజయవంతం అయ్యాయి.
అటవీ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం
అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అడవుల సంరక్షణ, విస్తీర్ణం పెంపుపై పవన్ దృష్టి సారించారు. వనమహోత్సవం కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించి ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇప్పటికే నగరవనాలు ఏర్పాటు చేస్తూ గ్రీన్ కవర్ పెంపొందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తీర ప్రాంత సంరక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాంటి కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33 శాతంగా ఉన్న గ్రీన్ కవర్ ని 2047 నాటికి 50 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్తున్నారు. దీంతోపాటు అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడే వారిపైనా, అటవీ సంపద దోపిడికి పాల్పడే వారిపైనా ఉక్కుపాదం మోపే విధంగా యంత్రాంగానికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎర్రచందనం అక్రమణకు అడ్డుకట్ట వేయడంతో పాటు మన రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిపోయిన ఎర్రచందనాన్ని తిరిగి తెచ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు.
వన్యప్రాణి సంరక్షణలో కీలక అడుగు హనుమాన్
ఈ ఏడాది ద్వితీయార్ధంలో పలమనేరులోని కుంకీ ఏనుగుల క్యాంపుని సందర్శించిన సందర్భంలో మానవ, వన్యప్రాణి ఘర్షణలను నిలువరించడంతో పాటు గాయపడిన అటవీ జంతువుల సంరక్షణ, చికిత్స అందించడం, వాటి ప్రాణాలకు రక్షణ కల్పించడం లక్ష్యంగా న.A.చీ.ఖ.వీ.A.చీ. ఖీశీబఅసa్‌ఱశీఅకు రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టును మార్చి 3వ తేదీ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం రోజున పట్టాలు ఎక్కించనున్నారు. సాంకేతికతను వినియోగించుకుంటూ రెస్క్యూ టీమ్స్, అటవీ ప్రాంత సమీప గ్రామాల్లో నివశించే జన సమూహాల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లనున్నారు. స్పందన, పరిహారం, పునరావాసం అనే అంశాల ఆధారంగా హనుమాన్ ముందుకు వెళ్తుంది. అటవీ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సంక్షేమ నిధికి రూ. 5 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. అటవీ సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందన్న భరోసా ఇచ్చారు. జూన్ నెలలో రాజమహేంద్రవరంలోని దివాన్ చెరువు వద్ద ఫారెస్ట్ అకాడమీ నూతన కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బొమ్మూరులో సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభించి విద్యార్ధులు, యువతకు నూతన ఆవిష్కరణలకు అవకాశం కల్పించారు.
ఉద్యోగుల్లో ఉత్తేజం నింపిన సంస్కరణలు
క్లస్టర్ వ్యవస్థ రద్దు ద్వారా పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పించారు. అదే సమయంలో ఉద్యోగులకు గతంలో ఎన్నడూ లేని విధంగా పదోన్నతులు కల్పించారు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి 10 వేల మందికి పైగా పదోన్నతులు దక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా 77 డీడీఓ కార్యాలయాలు ప్రారంభించి డివిజన్ లెవల్ డెవలప్మెంట్ ఆఫీసర్ల ప్రశాంతంగా పని చేసుకునే వెసులుబాటు కల్పించారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి రికార్డు స్థాయిలో ఉద్యోగులకు శిక్షణ ఇప్పించి దేశంలో నంబర్ వన్ స్థానంలో రాష్ట్రాన్ని నిలిపారు. అంతేకాదు ఉద్యోగులతో మాటా మంతి కార్యక్రమం నిర్వహించి క్షేత్ర స్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యాటక, దేవాదాయ శాఖల సమన్వయంతో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివ ృద్ధికి చర్యలు చేపడుతున్నారు.
ఇచ్చిన ప్రతి హామీ అమలు
ప్రజలతో మమేకం కావడం.. ప్రజలు చెప్పే సమస్యలను మనసు పెట్టివినడం.. వాటి పరిష్కారానికి క ృషి చేయడం. అవసరం అయితే సొంత నిధులు వెచ్చించి అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్. క్షేత్ర స్థాయి పర్యటనల్లో తన చెంతకి వచ్చిన ప్రతి అర్జీకి రోజుల వ్యవధిలో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు.













