- ప్రపంచ టారిఫ్ సవాళ్లకు మోదీ నిర్ణయమే నినాదం
- మోదీ విజయం.. భారత్ విజయం.. అదే మన విజయం
- 21వ శతాబ్దపు ప్రగతిశీల నేత నరేంద్ర మోదీజీ
- కేంద్ర సహకారంతోనే రాష్ట్రానికి పెట్టుబడుల వరద
- జీఎస్టీ 2.0తో ప్రజలకు పొదుపు.. బతుకు భరోసా
- త్వరలో రాయలసీమకు హైకోర్టు బెంచ్
- ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ సభలో సీఎం చంద్రబాబు
- మోదీతో కలిసి శ్రీశైల మల్లన్నను దర్శించిన ముఖ్యమంత్రి
కర్నూలు (చైతన్య రథం): కేంద్రం, రాష్ట్రంలోని ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ ఏపీకి రెట్టింపు ప్రయోజనాలు దక్కుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని మోదీ సహకారంతోనే రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు వస్తున్నాయని సీఎం స్పష్టం చేశారు. గురువారం కర్నూలులో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ -సూపర్ సేవింగ్స్ బచత్ ఉత్సవ్ బహిరంగ సభలో సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో దేశ ప్రగతి వేగాన్ని పెంచటంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారని సీఎం ప్రశంసించారు. ముఖ్యమంత్రిగా.. ప్రధానిగా 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత అంకిత భావంతో దేశానికి సేవలందిస్తున్న మోదీ ఓ విశిష్టనేతగా కొనియాడారు. సరైన సమయంలో సరైనచోట సరైన నేతగా ప్రధాని స్థానంలో మోదీ ఉన్నారని.. ఆయన 21వ శతాబ్దపు నేతగా సీఎం స్థానంలో మోదీ ఉన్నారని.. ఆయన 21వ శతాబ్దపు నేతగా సీఎం చంద్రబాబు అభివర్ణించారు. విరామాన్ని విస్మరించి ప్రజాసేవకే మోదీ అంకితమయ్యారని, తాను చూసిన ప్రధానుల్లో మోదీ అత్యంత ప్రగతిశీల నేత అని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి ఆయన కీలకమైన సంస్కరణలు తీసుకువచ్చారని.. తద్వారా ప్రపంచవ్యాప్తంగా భారత్ అగ్రస్థానానికి చేరుకుంటోందన్నారు. 11 ఏళ్ల క్రితం 11వ స్థానంలో ఉన్న భారతదేశం.. ప్రధాని మోదీ సంకల్పంతో ఇప్పుడు 4వ స్థానానికి చేరిందని… వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా 2047కు దేశం సూపర్ పవర్ మారడం ఖాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సైనికపరంగా భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటడానికి మోదీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఒక్కటి చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు.
.
జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరికీ లాభమే
ఒకే దేశం -ఒకే పన్ను -ఒకే మార్కెట్ నినాదంతో వచ్చిన జీఎస్టీ పన్ను విధానంలో ప్రస్తుత సంస్కరణలవల్ల 99శాతం వస్తువులు సున్నానుంచి 5 శాతం పన్ను పరిధిలోకి వచ్చాయని.. తద్వారా అన్ని వస్తువుల ధరలు తగ్గాయని సీఎం స్పష్టం చేశారు. జీఎస్టీ 2.0తో పన్నులు తగ్గి పేదలు, మధ్యతరగతికి గణనీయంగా ఉపశమనం కలిగిందని అటు వ్యాపారులు, ఎంఎస్ఎంఈ వర్గాలకూ ప్రయోజనం చేకూరుతోందని స్పష్టం చేశారు. విద్యార్థులు, రైతులు, చిరుద్యోగులు, చిరు వ్యాపారులు, వృద్ధులు, కూలీలు, కార్మికులు ఇలా అన్ని వర్గాలకూ లబ్ది కలిగించేలా సంస్కరణలున్నాయని సీఎం పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికీ రూ.15 వేల వరకూ ఆదా అవుతుందన్నారు. దసరానుంచి దీపావళి వరకూ జీఎస్టీ సంస్కరణల్ని పండుగలా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 98 వేల ఈవెంట్లు నిర్వహించి అవగాహన కల్పించామన్నారు. జీఎస్టీ బచత్ ఉత్సవ్ కాస్తా ఇవాళ భరోసా ఉత్సవ్గా మారిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రానికి డబుల్ ప్రయోజనాలు కలుగుతున్నాయని సీఎం అభిప్రాయపడుతూ.. సూపర్ సిక్స్ పథకాలు, సూపర్ జీఎస్టీతో ప్రజలకు సూపర్ పొదుపు సాధ్యమైందని చంద్రబాబు అన్నారు.
స్వదేశీ మంత్రమే బ్రహ్మాస్త్రం
సీఎం స్పష్టం చేశారు. గురువారం కర్నూలులో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ -సూపర్ సేవింగ్స్ బచత్ ఉత్సవ్ బహిరంగ సభలో సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో దేశ ప్రగతి వేగాన్ని పెంచటంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారని సీఎం ప్రశంసించారు. ముఖ్యమంత్రిగా.. ప్రధానిగా 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత అంకిత భావంతో దేశానికి సేవలందిస్తున్న మోదీ ఓ విశిష్టనేతగా కొనియాడారు. సరైన సమయంలో సరైనచోట సరైన నేతగా ప్రధాని స్థానంలో మోదీ ఉన్నారని.. ఆయన 21వ శతాబ్దపు నేతగా సీఎం చంద్రబాబు అభివర్ణించారు. విరామాన్ని విస్మరించి ప్రజాసేవకే మోదీ అంకితమయ్యారని, తాను చూసిన ప్రధానుల్లో మోదీ అత్యంత ప్రగతిశీల నేత అని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి ఆయన కీలకమైన సంస్కరణలు తీసుకువచ్చారని.. తద్వారా ప్రపంచవ్యాప్తంగా భారత్ అగ్రస్థానానికి చేరుకుంటోందన్నారు. 11 ఏళ్ల క్రితం 11వ స్థానంలో ఉన్న భారతదేశం.. ప్రధాని మోదీ సంకల్పంతో ఇప్పుడు 4వ స్థానానికి చేరిందని… వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా 2047కు దేశం సూపర్ పవర్గా మారడం ఖాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సైనికపరంగా భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటడానికి మోదీ చేపట్టిన ఆపరేషన్
సిందూర్ ఒక్కటి
ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్న టారిఫ్ ను ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన స్వదేశీ పిలుపే తారక మంత్రం అవుతుందని సీఎం అన్నారు. స్వదేశీ పిలుపును అందిపుచ్చుకుని సెమీ కండక్టర్లనుంచి శాటిలైట్ల వరకూ చిప్ల నుంచి షిప్పుల వరకూ ఏపీలోనే ఉత్పత్తి చేసేలా కార్యాచరణ చేపట్టామన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మెగా డీఎస్సీ, పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి, తల్లికి వందనం, దీపం-2.0, పెన్షన్ల పంపిణీవంటి సంక్షేమ పథకాలను కేంద్ర సహకారంతోనే సూపర్ హిట్ చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రానికి 16 నెలలుగా ప్రధాని మోదీ అందిస్తోన్న సాయాన్ని మరువలేమన్నారు. కేంద్రం సహకారంతో అమరావతిని నిలబెట్టా మని, పోలవరాన్ని గాడిన పెట్టామని, విశాఖ ఉక్కును బలోపేతం చేశామన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అత్యధిక పెట్టుబడులు సాధిస్తోందని.. విశాఖలో ఆర్సెల్లార్ మిట్టల్, 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా హబ్ వస్తోందని, నెల్లూరులో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీ వస్తోందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. రాయలసీమకు త్వరలో హైకోర్టు బెంచ్ పునరుద్ఘాటించారు. రాయలసీమకు త్వరలో హైకోర్టు బెంచ్ రాబోతోందని వెల్లడిస్తూ.. రాయలసీమలో స్టీల్, స్పేస్, డిఫెన్స్, ఏరో స్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్స్టయారీ, గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, సిమెంట్ పరిశ్రమలు వస్తున్నాయన్నారు. వీటితోపాటు సెమీ కండక్టర్ యూనిట్, క్వాంటం వ్యాలీ రావడానికి కారణమైన ప్రధానికి రాష్ట్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.