- టీడీపీకి కంచుకోటగా మార్చారు
- నరసింహారావును గౌరవించుకుంటాం
- అభివృద్ధిలో ఆయనే మాకు స్ఫూర్తి ప్రదాత
- ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం(చైతన్యరథం): శ్రమను నమ్ముకున్న నాయకుడు నడకుదిటి నరసింహారావు అని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ మేరకు మచిలీ పట్నం టీడీపీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి నడకుదిటి నరసిం హారావు 74వ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. పుష్పాంజ లి ఘటించి నివాళులర్పించారు. నడకుదిటి నరసింహారావు శ్రమ ను నమ్ముకున్నారు. నీతి నిజాయితీలతో జీవితాంతం బతికారు. వారి జీవితం తెరచిన పుస్తకం లాంటిది. బందరు నియోజక వర్గాన్ని టీడీపీకి కంచుకోటగా మార్చిన ఘనత నరసింహారావుకే దక్కుతుంది. ఎలాంటి రోడ్డు రవాణా సదుపాయాలు, కమ్యూ నికేషన్ సదుపాయాలు లేని రోజుల్లోనే ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపించారు. గరాల దిబ్బకు బ్రిడ్జి నిర్మాణం, రోడ్ల నిర్మాణం, పల్లెతుమ్మలపాలెం పోలాటితిప్పలో ఉప్పు పరిశ్రమ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి కల్పించారు. బందరు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కూడా ఆయనే. అందుకే ఆయన కష్టానికి గుర్తుగా బందరు హార్బర్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి హార్బర్‌కు ఆయన పేరు పెట్టుకుని గౌరవించుకుంటామని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బీసీలకు చేసిన కృషికి చిహ్నంగా బందరులో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మించబోతున్నామని చెప్పారు. ఎన్ని కష్టాలొచ్చినా నరసింహారావు చూపిన అడుగు జాడల్లోనే నడుస్తాం.. ప్రజా సమస్యల పరిష్కారం లో ఆయనే మాకు స్పూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కొనకళ్ల జగన్నాథ రావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, తదితర నాయకులు పాల్గొన్నారు.