- నిందితులపై కఠినచర్యలు తీసుకుంటాం
- కుటుంబానికి అండగా ఉంటాం
- మంత్రి లోకేష్ స్పష్టీకరణ
అమరావతి (చైతన్యరథం): సంతనూతలపాడు నియోజకవర్గం టీడీపీ నేత, పార్టీ అధికార ప్రతినిధి వీరయ్య చౌదరి హత్యపై విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ వార్త తనను షాక్‌కు గురిచేసిందన్నారు. ఒంగోలులోని తన కార్యాలయంలో వీరయ్య చౌదరిని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపడం దారుణం. యువగళం పాదయాత్రలో నాతోపాటు అడుగులు వేసిన వీరయ్య చౌదరి పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసారు. హంతకులపై కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించాం. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.