- ఎక్స్‌లో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. దీనిపై ఎక్స్ వేదికగా సీఎం స్పందించారు. అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్‌ను కలవడం, ఆ దేశంతో మా దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే మార్గాలను చర్చించడం ఆనందంగా ఉంది. వాణిజ్యం, పెట్టుబడి, విద్య, ఆవిష్కరణలు, ప్రజల మధ్య సంబంధాలతో సహా పరస్పర ఆసక్తి ఉన్న రంగాల గురించి మేము మాట్లాడాము. బలమైన వ్యాపార పర్యావరణ వ్యవస్థ, శక్తివంతమైన తెలుగు డయాస్పోరాతో భారతదేశం-యుఎస్ సంబంధాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తూనే ఉంది. మేము అమెరికా వ్యాపారాలకు, సంస్థలకు నమ్మకమైన.. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న భాగస్వామిగా ఉన్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.












