- నిజాలు: స్కాం లేకపోతే డిజిటల్ పేమెంట్ విధానం ఎందుకు రద్దు చేశారు? కంప్యూటర్ ఆటోమేటెడ్ విధానం
- రద్దుచేసి మాన్యువల్ విధానం ఎందుకు పెట్టారు? నగదులోనే ఎందుకు లావాదేవీలు నడిపారు? విషపూరిత
- మద్యం సరఫరాదారులపై చర్యలు తీసుకోకుండా.. వారికే అధిక భాగం ఆర్డర్లు ఎందుకు ఇచ్చారు? మధ్య నిషేధం
- హామీపై ఎందుకు మాట తప్పారు? కొవిడ్‌లోనూ మద్యం అమ్మకాలు జరిపి.. వేలాది ప్రజల ప్రాణాలు ఎందుకు
- మంటగలిపారు? వేల కోట్ల దోపిడీ లేకుంటే ఇన్ని దారుణాలకు పాల్పడతారా?
కుతర్కం: లిక్కర్ సేల్స్ తగ్గాయి. ప్రభుత్వ ఆదాయం పెరిగింది. మరి అవినీతి ఎలా జరుగుతుంది?
నిజం: రూ.60 ఉన్న చీప్ లిక్కర్ క్వార్టర్ ధర రూ.180లకు పెంచారు. ఇలా ధరలు పెంచడంవల్ల కొంత ఆదాయం పెరిగింది. ధరలు పెంచింది కమీషన్లు దండుకోవడానికే. అధికారిక సేల్స్ ఎంత జరిగిందో.. అనధికార లిక్కర్ సేల్స్ అదే మోతాదులో జరిగింది. నాలుగు లక్షల మొబైల్ షాపులు/ బెల్ట్‌షాపులు నడిపారు. సేల్స్ తగ్గిందనేది కట్టుకథ మాత్రమే. సిట్ ఈ కోణంలో కూడా విచారణ చేస్తే దోపిడీ మరికొన్ని వేల కోట్లకు పెరుగుతుంది.
కుతర్కం: ఒక్క సాక్ష్యం చూపకుండా మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారు. జగన్‌కు సన్నిహితుడనే రాజకీయ కక్షతో కేసు పెట్టారు.
నిజం: ఎస్పీవై ఆగ్రో, సాన్‌హాక్ ల్యాబ్స్, డికార్ట్ లాజిస్టిక్స్ ద్వారా మద్యం ముడుపులు మిథున్ కుటుంబ సంస్థలైన పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్, శివశక్తి డెయిరీలకు చేరిన వైనం సిట్ చూపడం సాక్ష్యం కాదా?
మద్యం దోపిడీ పాత్రదారులతో మిథున్‌రెడ్డి సమావేశాలు, ఫోన్‌కాల్స్ చాటింగులను సిట్ రుజువులుగా చూపించడం నిజం కాదా?
అసిస్టెంట్ కమిషనర్ సత్యప్రసాద్‌ను మిథున్‌రెడ్డి తిరుపతిలోని తన ఇంటికి ఎందుకు పిలిపించుకున్నారు?
2023 మే 21న మిథున్‌రెడ్డి, కెసిరెడ్డి, చాణిక్య హైదరాబాద్ ఎవరెస్టు భవన్‌లో కలిసింది వాస్తవం కాదా?
2023 జూన్ 18న సైప్‌తో మిథున్ రెడ్డి హైదరాబాద్ అపోలో సమీపంలో సమావేశమైంది నిజం కాదా?
సాక్ష్యం చూపకుండా మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారనేది అబద్ధం. దోపిడీని కప్పిపెట్టుకుని ముసుగే. రాజకీయ కక్ష సాధింపు ఆరోపణ.
కుతర్కం: డిస్టలరీలన్నీ టీడీపీ వారివే. జగన్ ప్రభుత్వం ఒక్కదానికి కూడా లైసెన్స్ ఇవ్వలేదు.
నిజం: డిస్టిలరీ యజమానులందరి మెడపై కత్తిపెట్టి వాటన్నింటినీ లీజు పేరుతో దురాక్రమణ చేసింది నిజం. వీటిల్లో విషపూరిత మద్యం తయారుచేసి 30 వేలమంది మాంగల్యాలు మంటగలిపారు. 35 లక్షలమంది పేదల ఆరోగ్యాల్ని నాశనం చేసింది నిజం.
జగన్ ప్రభుత్వం ఒక్క డిస్టిలరీకి కూడా లైసెన్స్ ఇవ్వలేదనేది పచ్చి అబద్ధం. 1. 2020 మేలో టెండర్, బ్రాండ్ ట్రయల్ లేకుండానే ఆదాన్ డిస్టిలరీకి లైసెన్స్ ఇచ్చారు. 2. 2020 సెప్టెంబరులో లీలా డిస్టిలరీ. 3. 2021 జనవరిలో క్రిపాటీ బెవరేజెస్. 4. 2021 అక్టోబర్‌లో ఓల్విక్ డిస్టిలరీస్. 5. 2019 డిసెంబర్‌లో జోర్ హార్ట్ స్పిరిట్స్. 6. 2021 ఏప్రిల్‌లో ఫైన్ బార్ స్పిరిట్స్. 7. 2021 ఫిబ్రవరిలో టెక్కర్ ఎక్స్‌పోర్ట్స్. 8. 2020 నవంబర్‌లో డికార్ట్ లాజిస్టిక్స్. 9. 2021 మార్చిలో ట్రీఫర్ బెవరేజెస్. 10. 2020 జూన్‌లో న్యాసనా డిస్టిలరీకి లైసెన్సులు మంజూరు చేశారు. ఒక్క దానికీ లైసెన్స్ ఇవ్వలేదనే జగన్ ముఠా మాటలు పచ్చి అబద్ధం.
కుతర్కం: సెల్‌టవర్ లొకేషన్ కాల్ డేటా వక్రీకరించారు.
నిజం: సెల్ టవర్ లొకేషన్, కాల్‌డేటా, చాటింగ్, సత్యప్రసాద్.. వాసుదేవరెడ్డి వాంగ్మూలాలు, విషపూరిత మద్యం అని చెన్నై, బెంగళూరు, అమెరికా ల్యాబ్ రిపోర్టులన్నీ నిజాలు కాదట. జగన్ ముఠా, సాక్షి రాతలే నిజాలట.
గొడ్డలి వేటును గుండెపోటుగా చిత్రీకరించారు. నారాసుర రక్తచరిత్ర అని రాయించారు. డాక్టర్ సునీతమ్మ తన తండ్రిని హత్య చేయించిందన్న జగన్ ముఠా.. ప్రతి దాన్నీ వక్రీకరించి దాన్ని ఎదుటివారికి అంటగట్టడం పనిగా పెట్టుకున్నారు. వేయి గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలక తప్పదు.
కుతంత్రం: 2014`19 మధ్య మద్యం దోపిడీ చేసింది చంద్రబాబే.
నిజం: దొంగే.. దొంగ దొంగ అన్న కుట్రను జగన్ ముఠా తమ నేరాలకు కవచంగా వాడుకుంటున్నది. చంద్రబాబుపై జగన్, ఆయన తండ్రీ డజన్ల కొద్దీ అక్రమ కేసులు పెట్టారు. ఒక్కదానికి కూడా కనీస రుజువులు చూపలేక కోర్టుల్లో మొట్టికాయలు వేయించుకున్నారు. జగన్, గాలి జనార్దన్‌రెడ్డి దోపిడీపై టీడీపీ రుజువులు చూపింది. గాలికి జైలు శిక్ష పడిరది. జగన్ కోర్టు వాయిదాలను ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారు?
కుతంత్రం: రూ.3500 కోట్లు అంటూ సిట్ బేతాళ కథలు చెబుతుంది.
నిజం: డెన్‌లలో గుట్టలుగా పెట్టిన నోట్లకట్టల వీడియోలు పచ్చి నిజాలు. షెల్ కంపెనీలు పెట్టింది నిజం. టన్నులకొద్దీ బంగారం కొన్నది నిజం. సినిమాలు తీసింది నిజం. ఇలా ఎన్నో ఉన్నాయి.
ఇప్పటికి రుజువులు దొరికింది రూ.3,500 కోట్లకే. ఇంతకు అనేక రెట్ల మద్యం దోపిడీ జరిగింది. రూ.3500 కోట్ల దోపిడీ అధికారిక అమ్మకాల్లో కమీషన్ మాత్రమే. అనధికార అమ్మకాల ద్వారా హోల్‌సేల్‌గా మరెన్నో వేల కోట్ల దోపిడీ జరిగింది. ఆ దోపిడీ తేలాల్సి ఉంది.
2024`25 జగన్ పాలనలోని మొదటి మూడు మాసాలతో పోలిస్తే 2025`26 కూటమి ప్రభుత్వంలో తొలి మూడు మాసాల్లో లిక్కర్ అమ్మకాలు 24శాతం, బీరు 129 శాతం పెరిగింది. జగన్ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జే బ్రాండ్లు ప్రభుత్వ లెక్కల్లో చూపకుండా అనధికారికంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. అందువల్లే జగన్ పాలనలో తక్కువ అమ్మకాలు నమోదయ్యాయి.
కుతర్కం: జగన్‌కు సన్నిహితుడు కాబట్టే రాజకీయ కక్షతో మిథున్‌రెడ్డిపై అనేక కేసులు పెట్టారు.
నిజం: సహవాస దోషం తప్పదు కదా! సహవాస దోషంతోనే అనుకూల ఐపీఎస్‌లు, పారిశ్రామికవేత్తలు జైలుకు వెళ్లారు. కొందరికి కోర్టు శిక్షలు కూడా వేసింది.
మిథున్‌రెడ్డి కుటుంబ కంపెనీలైన పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్, శివశక్తి డెయిరీలకు.. మద్యం ముడుపులతో సంబంధమున్న కంపెనీల నుంచి ముడుపులు జమ అయ్యింది నిజం. అక్రమ మద్యం దోపిడీలో భాగస్తులైన వారితో మిథున్‌రెడ్డి సమావేశాలు, ఫోన్ సంభాషణలు నిజం. రాజకీయ కక్ష అనేది అబద్ధం. రాజకీయ కక్ష అనే ముసుగు తొడుక్కుని నేరస్తులు తప్పించుకునే ప్రయత్నాలను ప్రజలు ఆమోదించరు. జగన్ నిజాయితీపరుడైతే సీబీఐ కోర్టు విచారణలకు హాజరుకావాలి. ఎందుకు కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా 10 ఏళ్లుగా కుంటిసాకులతో తప్పించుకుంటున్నారు?
ఏం చేయాలి?
రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా దోపిడీ సొమ్ము జప్తు చేసి విషపూరిత మద్యంతో మాంగల్యాలు మంటగలిపిన కుటుంబాలు, ఆరోగ్యాలు గుల్లయిన బాధితుల సంక్షేమానికి, డి అడిక్షన్ సెంటర్ల నిర్వహణకు ఖర్చు చేయాలి.
మద్యం కుంభకోణంలో పాత్రధారులే కాక అంతిమ లబ్ధిదారులను కోర్టు బోనులో నిలబెట్టాలి.
దోపిడీదారులకు కులాలు ఉండవు. విషపూరిత మద్యం తాగి అన్ని కులాల వారూ ప్రాణాలు కోల్పోయారు. కులం ముసుగు కప్పుకునే కుట్రలను ప్రజలు అంగీకరించరాదు.
మద్యం మాఫియాలకు శిక్షలు పడకపోతే ప్రజల ధన, మాన, ప్రాణాలు, ఆస్తులకు రక్షణ ఉండదు. కనుక అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలి.
కుతర్కం: కూటమి ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపెట్టుకోవడానికి అక్రమ కేసులు పెడుతున్నారు.
నిజం: ప్రభుత్వ ఖజానాను జగన్ దివాలా తీయించి పోయినా.. చంద్రబాబు తన అనుభవంతో మేనిఫెస్టో హామీలు తొలి ఏడాది 70శాతం అమలు చేశారు. ఈ స్థాయిలో తొలి ఏడాదే ఇన్ని హామీలు అమలు చేసిన ప్రభుత్వం ఏపీ చరిత్రలో మరొకటి లేదు. ప్రభుత్వం వైఫల్యం చెందిందని జగన్ ముఠా ప్రచారం పచ్చి అబద్ధం మాత్రమే.
జగన్ తన తొలి ఏడాది పాలనలో మేనిఫెస్టో హామీలు 10శాతం మాత్రమే అమలు చేశారు. మద్య నిషేధంపై మాట తప్పారు. ఇద్దరు బిడ్డలకు అమ్మఒడి హామీపై మాట తప్పారు. అమ్మఒడికి రూ.13000 ఇచ్చి నాన్న బుడ్డిలో లక్ష కొట్టేశారు. ఇలా నవరత్నాలను నవ మోసాలు చేసింది జగన్ ప్రభుత్వమే. అక్రమ కేసులకు కేరాఫ్ అడ్రస్ జగన్ మాత్రమే!
గురజాల మాల్యాద్రి,
ఛైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్