- పిన్నెల్లి సోదరుల దందాపై బాధితుల ఫిర్యాదు
- భూమి అమ్మిన వారితోనే చేయించారని ఆవేదన
- మాచర్ల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో తతంగం
- న్యాయం చేయాలని ప్రజావేదికలో మంత్రికి వినతి
- అర్జీలు స్వీకరించిన కొలుసు పార్థసారథి, నేతలు
మంగళగిరి(చైతన్యరథం): తమ స్థలంపై అప్పటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని తమ్ముడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి కన్నుపడిరది.. తమను బెదిరించి తప్పుడు కేసులు బనాయించి తమకు భూమి అమ్మిన వారితోనే మాచర్ల సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో దొంగ రిజిస్ట్రేషన్ చేయించి తమ భూమిని కొట్టేశారు..విచారణ చేయించి తమ భూమిని ఇప్పిం చాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాల యంలో సోమవారం ప్రజా వినతుల కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథికి అర్జీ అందజేశారు. పిన్నెల్లి సోదరుల నిర్వాకంపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. తమ భూమిని విడిపించి న్యాయం చేయాలని అభ్యర్థించారు. ప్రజావినతుల కార్యక్రమంలో మంత్రితో పాటు నాయకులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, అన్నబత్తుల జయలక్ష్మి పాల్గొని అర్జీలు స్వీకరించారు.
` అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి, అతని సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి, వారి అనుచరులు అక్రమంగా తన భూమిని కొట్టేసి అమ్ముకున్నారని టీడీపీ స్టేట్ లీగల్ సెక్రటరీ పి.లక్ష్మన్న ఫిర్యాదు చేశారు. కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చినా వారి దౌర్జన్యాలకు నాడు అడ్డూ అదు పులేకుండా పోయిందని, వారిని కఠినంగా శిక్షించి తన భూమిని తనకు అప్పగించాలని వినతిపత్రం ఇచ్చారు.
` మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఆయన తమ్ముడు అహ్మద్ బాషా, అల్లావుద్దీన్, షంషీర్, జమీల్, అబ్దుల్, ఖాదర్, గయాజ్ హనిదుద్దీన్లు పేదలమైన తమ భూములకు దొంగ పత్రాలు సృష్టించి అక్రమంగా భూములను కబ్జా చేశారని కడపకు చెందిన వి. శోభారాణి ఫిర్యాదు చేసింది. వెళ్లి అడిగితే దౌర్జన్యం చేస్తున్నారు.. అధికారులకు పలుమార్లు అర్జీలు పెట్టుకున్నా పట్టించుకోలేదు.. తమకు న్యాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
` వైసీపీ నేతలు ఎం.అశోక్, వి.విజయ్‌కుమార్‌లు చీకట్లో తమ ఇంటికి 15 మంది రౌడీలను తీసుకు వచ్చి చంపుతామని బెదిరించి ఖాళీ రిజిస్టర్ బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని అనంతపురానికి చెందిన ఎం.పద్మజ ఫిర్యాదు చేసింది. క్రికెట్ బ్యాట్ లతో కొట్టి మహిళను అని కూడా చూడకుండా పొత్తి కడుపులో తన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విచారించి వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు.
` తహసీల్దారు, వైసీపీ నేతలు కుమ్మక్కై కోర్టు విచారణలో ఉన్న తమ భూమిని అక్రమంగా ఆన్లైన్ చేసుకున్నారని ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం రాజంపల్లికి చెందిన ఓర్సు అల్లూరమ్మ తెలిపారు. అక్రమంగా ఆన్లైన్ చేసిన తహసీల్దారుపై చర్యలు తీసుకుని తమ భూమి తమకు ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది.
`తన ఇంటి డోర్ నెంబర్‌ను వైసీపీ మహిళా నాయకురాలు సంపూర్ణ పార్వతి కొట్టేసి తమకు వేరే డోర్ నెంబర్ కేటాయించి బలవంతంగా ఆ డోర్ నెంబర్‌పై పన్ను కట్టాలని బెదిరిస్తున్నారని గుంటూరు జిల్లా తాడేపల్లి మహానాడుకు చెందిన అబ్దుల్ ముజీద్ వాపోయాడు. దీనిపై అధికారుల వద్దకు వెళితే పట్టించుకోలేదని. తమ ఇంటి డోర్ నెంబర్ తమకు ఉండేలా చూడాలని విజ్ఞప్తిచేశాడు.
` ఇచ్చిన డబ్బులు తమకు తిరిగి ఇవ్వమని అడుగుతుంటే లెటర్లో తన పేరు రాసి చనిపోతామని తన మేనకోడలు కిలారి వసంతి ఇబ్బంది పెడుతుందని.. తమకు రావాల్సిన రూ.8.50 లక్షలు ఇప్పించాలని తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామానికి చెందిన కిలారి పిచ్చయ్య విజ్ఞప్తి చేశాడు.
` 2018లో మంజూరు అయిన దోబీఘాట్‌కు డబ్బులు ఇంకా రాలేదని, డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన పలువురు రజకులు వేడుకున్నారు.
` రాష్ట్ర, జిల్లాస్థాయి మీడియా అక్రిడిటేషన్ కమిటీలో సభ్యులుగా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్ అసోసియేషన్‌కు చెందిన వారికి ప్రాతినిధ్యం కల్పించాలని ఆ శాఖ మంత్రికి వారు విజ్ఞప్తి చేశారు.
`బాపట్ల మండలానికి చెందిన వీరయ్య సమస్యను వివరిస్తూ తమ గ్రామంలో 2013 నుంచి 2018 వరకు అభివృద్ధి పనులు చేయగా ఆ బిల్లులు నేటికీ రాలేదని, బిల్లులు ఇప్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు
` ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో వెంకన్నచెరువులో చేపల పెంపకం వల్ల చెరువులో ఉన్న తాగునీరు కలుషితం అవుతుందని చెరువులో చేపల పెంప కాన్ని నిలుపుదల చేయాలని పలువురు గ్రీవెన్స్‌లో విన్నవించారు.
` భూ, ఆస్తి తగాదాలను పరిష్కరించాలని అర్జీదారులు పోటెత్తివచ్చి అర్జీలు ఇచ్చారు. ఇళ్లు మంజూరు, రేషన్ కార్డులు, పింఛన్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మరికొందరు విన్నవించుకున్నారు. సీఎంఆర్ఎఫ్ సాయం కోసం పలువురు బిల్లులతో వచ్చి వినతిపత్రాలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో తమపై పెట్టిన అక్రమ కేసులు తొలగించాలని టీడీపీ సానుభూ తిపరులు వేడుకున్నారు.