- మంత్రి లోకేష్ వల్లే తమ కల సాకారమయిందని కృతజ్ఞతలు
- గత ఎన్నికల ముందు మాట ఇచ్చారు
- నేడు అవినీతికి తావులేకుండా, పార్టీలకతీతంగా పట్టాలు ఇచ్చారని సంతోషం
- మంగళగిరికి లోకేష్ శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉండాలని దీవెనలు
మంగళగిరి (చైతన్యరథం): మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా శాశ్వత ఇంటిపట్టాలు అందుకున్న మంగళగిరి నియోజకవర్గ పేదల్లో ఆనందం ఉప్పొంగుతోంది. దశాబ్దాలుగా ఎందరు నాయకుల చుట్టూ తిరిగినా కాని పని, నేడు మంత్రి లోకేష్ చొరవతో అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే కార్యరూపం దాల్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి లోకేష్ పట్టుదల వల్లే తమ ఏళ్లనాటి కల సాకారమయిందని కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. బట్టలు పెట్టి మరీ శాశ్వత ఇంటి పట్టా అందజేస్తున్న మంత్రి లోకేష్ రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిదంటున్నారు. లోకేష్..మంగళగిరికి శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉండాలని దీవిస్తున్నారు. లబ్ధిదారుల ఆనందం వారి మాటల్లోనే..
ఇంటి పట్టా కోసం తిరిగి తిరిగి వేసారాం..
ఇప్పుడు సంతోషంగా ఉంది
-గరిక రాములు, రమణమ్మ
రత్నాలచెరువు, మంగళగిరి
మేం 13 ఏళ్లుగా మంగళగిరి రత్నాలచెరువులో నివాసం ఉంటున్నాం. నేను రిక్షాబండి నడపుకుంటుండగా.. నా భార్య కూలి పనులకు వెళ్తుంది. గతంలో ఇంటి పట్టా కోసం అనేక సంవత్సరాలు నాయకుల చుట్టూ తిరిగి తిరిగి వేసారాం. ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు నారా లోకేష్ బట్టలు పెట్టి శాశ్వత ఇంటి పట్టా ఇవ్వడం ఆనందంగా ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రత్నాల చెరువులో రోడ్లు వేశారు. ఇక్కడకు వచ్చి ఇంటి పట్టా అందుకుని సంతోషంగా వెళ్తున్నాం.
40 ఏళ్లుగా ఇంటి పట్టా కోసం ఎదురుచూస్తున్నాం..
లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు
-కొండా శివమ్మ
రత్నాలచెరువు, మంగళగిరి
మేం మంగళగిరి రత్నాలచెరువు ఎస్టీకాలనీలో 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నాం. చిల్లరకొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాం. నా చిన్ననాటి నుంచి ఇక్కడే పెరిగా. ఇంటి పట్టా కోసం 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం. ఎన్నికల సమయంలో నారా లోకేష్ వచ్చి.. శాశ్వత ఇంటి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అన్నట్లుగా పట్టా ఇచ్చి.. మాట నిలబెట్టుకున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది.
లోకేష్ నిజమైన హీరో..
రూపాయి ఖర్చులేకుండా ఆస్తిపై హక్కు కల్పించారు
బందరు రాజ్యలక్ష్మి, సుబ్బారావు
మా తండ్రి 40 ఏళ్ల క్రితం మంగళగిరి రత్నాలచెరువులో రూ.150తో పూరిపాకను కొనుగోలు చేశారు. అప్పటి నుంచి మేం ఆ ఇంటిలోనే నివాసం ఉంటున్నాం. లోకేష్ వచ్చిన తర్వాత ఆస్తిపై మాకు శాశ్వత హక్కు కల్పించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆయనే నిజమైన హీరో. మేం ఇంటి పట్టా కోసం ఎవరికీ రూపాయి ఇవ్వలేదు. ఎవరి చుట్టూ తిరగలేదు. అధికారులే వచ్చి కొలతలు తీసుకున్నారు. ఇవాళ లోకేష్ చేతుల మీదుగా ఇంటి పట్టా అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
ఎన్ని ప్రభుత్వాలు మారినా మాకు పట్టాలు ఇవ్వలేదు
మా 45 ఏళ్ల కల లోకేష్ నెరవేర్చారు
ఇటికాల పెద్దింట్లమ్మ
రత్నాలచెరువు, మంగళగిరి
మేం 45 ఏళ్లుగా మంగళగిరి రత్నాలచెరువులో నివాసం ఉంటున్నాం. నేను కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. నాకు నలుగురు కుమార్తెలు. నా భర్త ఇటీవలే మరణించారు. దశాబ్దాలుగా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి రత్నాలచెరువులో జీవనం సాగిస్తున్నాం. గతంలో ఇక్కడ మంచినీరు కూడా లభించేది కాదు. ఎంతో మంది నాయకులు వచ్చారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. అయినా మాకు పట్టాలు ఇవ్వలేదు. ఇప్పుడు నారా లోకేష్ చేతుల మీదుగా శాశ్వత ఇంటి పట్టా అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా 45 ఏళ్ల కలను నారా లోకేష్ నెరవేర్చారు.
పార్టీలు పట్టించుకోకుండా పట్టాలు ఇచ్చారు
లోకేష్ ప్రజలకు మంచి చేశారు
దర్శనం హంస, దర్శనం సీత, ఏసమ్మ
రత్నాలచెరువు, మంగళగిరి
మేం గత 43 ఏళ్లుగా మంగళగిరి రత్నాలచెరువులో నివాసం ఉంటున్నాం. పట్టాల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నాం. గతంలో ఇంటి పట్టాలు అడిగితే రత్నాలచెరువులో ఇళ్లను తొలగిస్తామని చెప్పారు. దీంతో మా ఇళ్లను ఎప్పుడు తొలగిస్తారోనని భయంభయంగా జీవనం సాగించాం. నారా లోకేష్ పార్టీలు పట్టించుకోకుండా పట్టాలు ఇచ్చారు. ప్రజలకు మంచి చేసే వారే నాయకులు. లోకేష్ ప్రజలకు మంచి చేశారు. ఆయన చేతులమీదుగా శాశ్వత ఇంటి పట్టాలు అందుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇళ్లను తొలగిస్తారనే భయం మాకు లేదు.
మంచి మెజార్టీతో గెలిపించినందుకు లోకేష్ ప్రజల రుణం తీర్చుకుంటున్నారు
నాగులపల్లి వెంకట సత్యనారాయణ
రత్నాలచెరువు, మంగళగిరి
మంగళగిరి రత్నాలచెరువులో 42 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నాను. పట్టాల విషయంలో ఎంతో మంది నాయకులు వచ్చి కాకమ్మ కబర్లు చెప్పి వెళ్లిపోయారు. లోకేష్ మొదటి సారి గెలిస్తే ఇంటిపట్టాలు ఇచ్చేవారేమో. దురదృష్టం ఆయన గెలవలేదు. ఆయనేంటో ప్రజలకు అర్థం కాలేదు. రెండోసారి మంచి మెజార్టీతో గెలిపించినందుకు లోకేష్ ప్రజల రుణం తీర్చుకుంటున్నారు. 42 ఏళ్ల కల నిజమైనందుకు ఆనందంగా ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు లోకేష్‌కి ధన్యవాదాలు.
గతంలో ఎవరివల్లా కాలేదు..
లోకేష్ వల్లే ఇంటి పట్టా సాధ్యమైంది!
సాలిపల్లి రేయమ్మ, దుర్గారావు
మహానాడు 6వ రోడ్డు, తాడేపల్లి
తాడేపల్లి మహానాడులో గత 40 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నాం. మహానాడు కాలనీ ఏర్పడిన నాటి నుంచి అక్కడే నివసిస్తున్నాం. ఇంటి పట్టాల కోసం గతంలో ఎంతో మంది నాయకులను కలిసి విజ్ఞప్తి చేశాం. ఎవరివల్లా కాలేదు. నారా లోకేష్ వల్లే ఇంటి పట్టా సాధ్యమైంది. ఇక్కడకు వచ్చిన తర్వాత సదుపాయాలు బాగా ఉన్నాయి. మర్యాదగా చూసుకున్నారు. లోకేష్ చేతుల మీదుగా శాశ్వత ఇంటి పట్టా అందుకోవడం ఆనందంగా ఉంది. మా కల నెరవేరింది.