అమరావతి (చైతన్యరథం): తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రజల మాటకు విలువనిచ్చిన పాలనతో ఆనాడే ప్రజాస్వామ్య ప్రాధాన్యతను శ్రీ రామచంద్రుడు తెలియజేసారని సీఎం చంద్రబాబు అన్నారు. పాలకుడు ఎప్పుడూ ప్రజలకు ఆదర్శనీయుడుగా ఉండాలని తన పాలన ద్వారా తెలియజేసిన సుగుణాభిరాముని చరిత్రను ఈ సందర్భంగా మననం చేసుకుందామన్నారు. వాడవాడలా జరిగే నవమి వేడుకలు గ్రామాల్లో కొత్త శోభను ఆవిష్కరించాలని కోరుకుంటున్నానని, ఆ సీతారాముల కరుణతో ప్రజలందరూ ఆనంద ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ మరోసారి అందరికీ సీఎం చంద్రబాబు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.