- పేదరికం లేని రాష్ట్రమే లక్ష్యంగా అడుగులు
- పెన్షన్లను పెంచి మాట నిలుపుకున్నాం
- ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
తాడేపల్లి(చైతన్యరథం): పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం 47వ డివిజన్ ఈడేపల్లిలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే రూ.4000 పెన్షన్ అందిస్తున్నాం. దివ్యాంగులకు రూ.6 వేలు, నూరు శాతం వైకల్యం కలిగిన వారికి రూ.15 వేల పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. రాష్ట్రంలో ప్రస్తుతం 64 లక్షల మందికి ప్రతి నెలా రూ.2722 కోట్లను పెన్షన్ల రూపంలో అందిస్తున్నాం. ఏటా పెన్షన్ల కోసమే ఏకంగా రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పేదలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందనేందుకు పెన్షన్ల పంపిణీ నిదర్శనం. కృష్ణా జిల్లాలో 2,34,909 పెన్షన్లు ఉండగా, మచిలీపట్నంలో సుమారు 30 వేల పెన్షన్లు అందిస్తు న్నాం. ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నాం. పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచేం దుకు చర్యలు చేపట్టాం. తాజాగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పీ4 కార్యక్ర మాన్ని రూపొందించాం. పేదరికం అనేది లేని రాష్ట్రంగా ఏపీని మార్చేందుకు ముఖ్య మంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగ స్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వయం ఉపాధి ద్వారా యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
కిడ్నీ బాధితుడికి రెండు నెలల పెన్షన్
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తాడేపల్లికి చెందిన ఉయ్యూరు వీరభద్రరావును మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు పరామర్శించారు. పానీ పూరీ బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నానని, కిడ్నీ వ్యాధి కారణంగా ఉపాధి కోల్పోయానని చెప్పగా వైద్యానికి అండగా నిలుస్తానని మంత్రి హామీ ఇచ్చారు. పానీ పూరి బండి నడుపుతున్నప్పటికీ పిలలను ఉన్నత చదువులు చదివించడంపై అభినందించారు. పెద్ద కుమారుడు ఎంబీఏ చదువుతూ పానీ పూరీ బండి నడుపుతు న్నట్లు చెప్పడంతో వారికి మెరుగైన ఉద్యోగావకాశం కల్పించేలా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రెండు నెలలకు సంబంధించి రూ.30 వేల పెన్షన్ మొత్తాన్ని వారికి అందజేశారు.