- టీడీపీ హయాంలోనే వారికి ఉన్నత గుర్తింపు దక్కింది
- విద్యావంతులై వ్యాపారవేత్తలు కావాలన్నదే చంద్రబాబు లక్ష్యం
- కురుబలను రాజకీయంగా, ఆర్థికంగా అన్నివిధాలా ఆదుకున్నారు
- అధికారికంగా భక్త కనకదాస జయంత్యుత్సవాలు హర్షణీయం
- బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత
అనంతపురం(చైతన్యరథం): కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో బీసీలకు స్వర్ణయుగం మొదలైందని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పేర్కొన్నారు. అనంతపురం గుత్తి రోడ్డులోని కె.టి.ఆర్ కన్వెన్షన్ హాలులో సోమవారం శ్రీభక్త కనకదాస రాష్ట్రస్థాయి జయంతోత్సవాలను ఆమె ప్రారంభించా రు. మంత్రితో పాటు అనంతపురం, హిందూపురం ఎంపీలు అంబిక లక్ష్మీనారాయణ, బి.కె.పార్థసారథి, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ పోలా భాస్కర్, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ సంచాలకులు, మేనేజింగ్ డైరెక్టర్ ఎ.మల్లికార్జున, జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న తదితరులు పాల్గొన్నారు. ముందుగా కనకదాస చిత్రపటానికి వారంతా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ శ్రీ భక్త కనకదాస రాష్ట్రస్థాయి జయంతోత్స వాలను అధికారికంగా నిర్వహించేలా ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌కు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. జయంతోత్సవాలను విజయవంతం చేసిన కురుబ కుల బాం ధవులకు కృతజ్ఞతలు తెలిపారు.
బీసీలు ముందుండాలన్నదే చంద్రబాబు లక్ష్యం
ముఖ్యమంత్రి చంద్రబాబు కురుబలను రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు తీసుకువచ్చి ఎంతగానో ఆదుకున్నారన్నారు. నాడు ఎన్టీఆర్ ఈ జిల్లాలో రామచం ద్రయ్యకు మంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బీసీలను గుర్తించి వారు అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకునేది తెలుగుదేశం పార్టీ అన్నారు. నేడు జిల్లాలో రెండు ఎంపీ స్థానాలను కురుబలకు కేటాయించారని, ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చి మంత్రిని చేసి బీసీ సంక్షేమ శాఖ కేటాయించారన్నారు. బీసీలను చైతన్యవంతులు కావాలని, రాష్ట్రంలో బీసీలకు స్వర్ణయుగం మొదలైందందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కనకదాస జయంతోత్సవాలు ప్రతి జిల్లా కేంద్రంలో చేయాలని రూ.12.50 కోట్ల నిధులు ముఖ్యమంత్రి కేటాయించారన్నారు. భక్త కనకదాసు అందరూ సంయుక్తంగా ముందుంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారని, ఊరూరా కీర్తనలు చేశారని తెలిపారు. కురుబ సామాజికవర్గంలో కనకదాసుకు గుర్తింపు గర్వ కారణమన్నారు. బీసీలు, బలహీనవర్గాల వారికి తెలుగుదేశం పార్టీ బ్యాక్ బోన్ అని చంద్రబాబు చెప్పారని, తన కూటమి ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిం చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. విద్యావంతులై ప్రతి బీసీ వ్యాపారవేత్త కావాలన్నదే ఆయన లక్ష్యమన్నారు. కురుబలు షీఫామ్ పెట్టుకుని వ్యాపారాలు చేస్తున్నారని, వారికి రూ.50 లక్షల వరకు ప్రతి యూనిట్‌కు రుణాలు ఇవ్వడం జరు గుతుందన్నారు. యూనిట్‌కు రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు బీసీ సంక్షేమ శాఖ తరపున ఇచ్చే అవకాశం ఉందన్నారు. అందులో 10 శాతం లబ్ధిదారుని వాటా, 40 శాతం సబ్సిడీ, 50 శాతం బ్యాంకు రుణం వస్తుందని తెలిపారు. గతంలో ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు నిధులు లేవని, అవి ఉత్సవ విగ్రహాలుగా మారాయన్నారు. ప్రస్తుతం కార్పొరేషన్లకు వెయ్యి కోట్ల వరకు నిధులు ఇవ్వడం జరిగిందని, బీసీలు అని రంగాల్లో ముందుండాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కంకణం కట్టు కున్నారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం, అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. టీటీడీలో బోర్డ్ మెంబర్‌గా కురుబలకు అవకాశం ఇవ్వడం జరుగుతుందని, శ్రీశైలం లో బోర్డ్ మెంబర్‌గా కురుబలకు ఇస్తామన్నారని తెలిపారు. బీసీ బిడ్డలు విద్యా వేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ఎదగాలని, వారికి స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యం కావాలని అడిగారని, కూటమి ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు.
కురుబ కనకదాస కళ్యాణ మండపానికి రూ.20 లక్షలు
` అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ
సామాన్య కుటుంబంలో జన్మించి కుల వివక్షతకు వ్యతిరేకంగా శ్రీ భక్త కనకదాస పోరాడారు. సమాజంలో అందరూ సమానమని, అందరూ మంచి మిత్రులుగా మెల గాలని కాంక్షించారు. సమాజానికి కనకదాస మార్గోపదేశం చేశారు. కురుబలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇంతకుముందు ఎవరూ అలా ప్రాధా న్యం ఇవ్వలేదు. తమను ఎన్నికల్లో గెలిపించిన వాల్మీకులు, కురుబ సామాజికవర్గాల వారికి పాదాభివందనం చేస్తున్నాం. కురుబలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కురుబ కనకదాస కళ్యాణ మండపం కోసం ఎంపీ నిధుల నుంచి రూ.20 లక్షలు కేటా యిస్తాం.
ముఖ్యమంత్రికి ధన్యవాదాలు
` హిందూపురం ఎంపీ బి.కె.పార్థసారథి
ఎన్నికలకు ముందు భక్త కనకదాసు జయంతిని అధికారికంగా నిర్వహించాలని చంద్రబాబుని అడిగితే ఆనాడు హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ ఈరోజు అధికారికంగా కనకదాసు జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు ధన్యవాదాలు. 15-20 సంవత్స రాల నుంచి కురుబ కులస్తులు ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు ఎదుగుతు న్నారు. వారికి చదువు, సంస్కారం, పాలనలో భాగస్వామ్యం ఉంది. కర్ణాటకలో పుట్టిన భక్త కనకదాసు కురుబ కులానికి వన్నెతెచ్చిన వ్యక్తి. ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళుతున్నాం. కురుబలు అందరితో సమానంగా ఎదగాలంటే బాగా చదువుకుని ఆర్థికంగా ఎదిగి రాజకీయాల్లోకి రావాలి. ఇతర కులస్తులను గౌర వించాలి. అందరం సమానంగా ఎదిగి హక్కుల కోసం పోరాడుతూ కురుబల అభివృద్ధికి ఐకమత్యంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ఎన్నికల హామీలన్నీ తమ ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఉమ్మడి జిల్లాకు కేంద్రం నుంచి ఎంపీ నిధులు తీసుకు వస్తాం.. కురుబ కళ్యాణ మండపాల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు.
కురుబలకు చంద్రబాబు రాజకీయ ప్రాధాన్యం
` అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
శ్రీ భక్త కనకదాస రాష్ట్రస్థాయి జయంతోత్సవాలను అనంతపురంలో జరుపు కోవడానికి అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కురుబలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించారు. పెనుగొండ నుంచి ప్రాతినిధ్యం వహించిన సవితమ్మకు మంత్రి పదవి, హిందూపురం పార్లమెంట్‌కు ఎంపీగా పార్థసారథికి అవకాశం కల్పించారు. కనకదాసు 1509లో జన్మించారు..సామాన్యులకు కూడా అర్థమయ్యేలా ఆయన రచనలు చేశారు.. కృష్ణ భక్తుడిగా తన జీవితాన్ని దైవానికి అంకితం చేశారు. సమాజంలో వివక్షతకు వ్యతి రేకంగా పోరాడి కురుబల ఆరాధ్య దైవంగా నిలిచారు. కురుబలకు అత్యధిక ప్రాధా న్యత ఇస్తూ వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తోంది.
గొర్రెల యూనిట్లు, రుణాలతో కురుబలను ఆదుకోవాలి
`మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
పరిటాల కుటుంబం మొదటి నుంచి కురుబలకు అండగా ఉంటోంది. వారు కూడా కష్టకాలంలో తమ వెన్నంటే నడిచారు. పరిటాల రవి మొదటి నుంచి కురుబ కులస్థులకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచారు. ఆయన మరణాంతరం మా కుటుంబానికి కురుబలు అండగా నిలిచారు. ఒకప్పుడు పార్థసారథిని జడ్పీ ఛైర్మన్‌ను చేయడంతో పాటు..ఇంకా ఎంతోమంది కురుబలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించిన వ్యక్తి పరిటాల రవి. ఆ రోజుల్లో రామచంద్రయ్య వంటి వారిని ఎన్టీఆర్ మంత్రిగా చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కురుబలకు ప్రాధాన్యమిస్తూ.. వారికి అండగా నిలిచారు. చంద్రబాబు చొరవతోనే ఈ రోజు రాష్ట్రస్థాయిలో అధికారికంగా భక్త కనకదాసు జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. మరోవైపు రాప్తాడు నియోజకవర్గంలో కురుబలు ఎక్కువగా ఉన్నారు..వారికి ప్రధానమైన వృత్తి గొర్రెల పెంపకం. ఇటీవల గొర్రెలు వ్యాధుల బారిన పడి చనిపోతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. అందుకే గొర్రెలకు ఇన్సూరెన్స్ చేయించే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. మరోవైపు మంత్రి సవిత, ఎంపీ పార్థసారథి ప్రత్యేకంగా చొరవ తీసుకుని..జిల్లాకు మరీ ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలోని కురుబలకు గొర్రెలు, మేకల యూనిట్లు, రుణాలు ఎక్కువగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
కురుబలకు ఇది గొప్ప పండుగ
` కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు
కనకదాసు రాష్ట్రస్థాయి జయంతోత్సవాలు కురుబలకు ఇది గొప్ప పండుగ. జిల్లాలో కురుబలు చాలామంది ఉన్నారు. వారికి చాలా సమస్యలు ఉన్నాయి. ఉమ్మడి అనంత జిల్లాకు అవసరమైన నిధులను తీసుకురావాలని ఎంపీలను కోరారు. వచ్చే సంవత్సరం నిర్వహించే కనకదాస జయంతికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానిసాం. కల్యాణదుర్గం పట్టణంలో కనకదాసు విగ్రహ ఏర్పాటు చేస్తాం. కురుబలకు అన్నివిధాలా తాము సహకరిస్తాం.
భక్త కనకదాసు జయంత్యుత్సవాలు హర్షణీయం
` జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్
కలెక్టర్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ శ్రీ భక్త కనకదాస రాష్ట్రస్థాయి జయంతోత్సవాలను అనంతపురం జిల్లాలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌కు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి టీజీ భరత్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలవ శ్రీని వాసులుకు ధన్యవాదాలు తెలిపారు. బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ పోలా భాస్కర్, ఐఏఎస్, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ సంచాలకులు, మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ కనకదాస రాష్ట్రస్థాయి జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు. విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కలెక్టర్‌కు శాలువా కప్పి మెమోంటో అందజేసి మంత్రి సన్మానించారు. సీపీఐ నాయకులు జగదీష్, జిల్లా కురుబ కుల సంఘాల నాయకులు తిప్పటి ఈశ్వరయ్య, తగరకుంట కృష్ణమూర్తి, ఆంజనే యులు, ఆవుల కృష్ణయ్య, గంగులకుంట రమణ, సీనయ్య, విఠల గౌడ్, బాలాజీ, మల్లికార్జున, సోమశేఖర్ తదితరులను శాలువా కప్పి సన్మానించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ డీడీ ఖుష్బూ కొఠారి, ఆర్డీవో కేశవ నాయుడు, డీటీడబ్ల్యూవో రామాంజనేయులు, డీఆర్‌డీఏ పీడీ ఈశ్వరయ్య, తహసీల్దార్ హరికుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, కురుబ, వెనుకబడిన తరగతుల సహకార సంఘాల నాయకులు, ఆయా శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, తదితరులు పాల్గొన్నారు.