- ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడుల సాధనకు ప్రణాళిక
- ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీకి మంత్రిమండలి ఆమోదం
- రూ.80వేల కోట్ల పెట్టుబడులకూ కేబినెట్ ఆమోద ముద్ర
- లక్షమందికి ఉద్యోగ, ఉపాధికి అవకాశాలు
- కీలక అంశాలను చర్చించి ఆమోదించిన మంత్రిమండలి
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం
- మంత్రిమండలి నిర్ణయాలను వెల్లడిరచిన మంత్రి పార్థసారథి
అమరావతి (చైతన్య రథం): పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలసీలను రూపొందిస్తోందని సమాచార మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడిరచారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో అపారంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించిందన్నారు. ఇందులో భాగంగానే గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో `ఏపీ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 4.0కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. దీని ద్వారా పరిశ్రమలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయని వివరించారు. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడిరచారు. ‘‘ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీ ద్వారా యూపీ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు లబ్ధిపొందాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా.. ఏపీలో ప్రత్యేకమైన పాలసీ లేకపోవడంతో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు రాని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో దాదాపు 150 బిలియన్ డాలర్ల వ్యాపారమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించింది.
పెట్టుబడులు పెట్టేందుకు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలూ ఆసక్తి చూపుతున్నాయి. విశాఖలో ఐటీ సేవల కోసం పలు కంపెనీల నుంచి ప్రతిపాదనలు ఇచ్చాయి. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ)కి వచ్చిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది’’ అని మంత్రి కొలుసు వివరించారు. విశాఖలో సిపి సంస్థ రూ.16,466 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుందని, మధురవాడలో ఆ సంస్థకు 3.6 ఎకరాలు ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసిందని మంత్రి పార్థసారథి వెల్లడిరచారు. కూటమి ప్రభుత్వం లక్ష్యాలను ప్రతిబింబించేలా గురువారంనాటి కేబినెట్ సమావేశం జరగిందని మంత్రి వివరించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అంటూనే.. అదే కేబినెట్ సమావేశంలో ప్రస్ఫుటమైందన్నారు. నిర్థిష్టమైన ఆలోచన, విజన్‌తో రాష్ట్ర భవిష్యత్తుకు పటిష్టమైన పునాధులు వేయాలనే లక్ష్యంతో ఈ`క్యాబినెట్ భేటీ జరిగిందన్నారు. ఈ కేబినెట్ సమావేశంలోనే దాదాపు రూ.80 వేల కోట్లు పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోద ముద్ర లభించిందన్నారు. ఈ నిర్ణయంతో 1.5 లక్షలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశలు లభించనున్నట్టు మంత్రి వెల్లడిరచారు. భవిష్యత్తులో పెట్టుబడిదారులు అందరికీ అంతిమ గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ అయ్యేలా విధానాలు చేపట్టామని, అందుకనుగుణంగా వచ్చిన పెట్టుబడుల ప్రతిపాదనలకు మంత్రిమండలి సుదీర్ఘంగా చర్చించి ఆమోదించిందని మంత్రి కొలుసు వెల్లడిరచారు.
ఇదిలావుంటే `మంత్రి మండలి సమావేశంలో పలు కీలకాంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలో మొత్తం రూ.80వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటన్నింటినీ గ్రౌండ్ చేయించిన పక్షంలో లక్షమందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం చంద్రబాబు మంత్రిమండలికి వెల్లడిరచారు. మంత్రిమండలి ఆమోదించిన సంస్థల వెంటబడి మరీ గ్రౌండ్ చేయించాలని మంత్రులకు సూచించారు. ఐటీ, రెన్యువబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్, డ్రోన్, ఆటోమొబైల్స్ రంగాల్లో ఈ పరిశ్రమలు వస్తున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. త్వరలో ఇల్లులేని నిరుపేదలకు గ్రామాల్లో మూడుసెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చే కార్యక్రమం వెంటనే చేపట్టాలని.. ఈ విషయంపై అందరూ దృష్టి సారించాలని మంత్రులకు మార్గనిర్దేశం చేశారు. క్వాంటమ్ వ్యాలీ మాదిరిగా గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలోనూ అందరికంటే ముందుండాలని.. దీనివల్ల రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందన్నారు. సింగపూర్‌తో సంబంధాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు మనం చూపించిన చొరవతో సింగపూర్ ప్రభుత్వం ముందుకొచ్చి సహాయం చేసిందని గుర్తు చేశారు.
గతంలో అమరావతి రాజధానిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్ కన్సార్టియం ముందుకు వచ్చిందని.. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఆ కంపెనీ నిర్వాహకులను అప్పటి సీఎం జగన్ వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కంపెనీ నిర్వాహకులపై జగన్ ప్రభుత్వం అవినీతి ముద్ర వేసిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. సింగపూర్ కన్సార్టియం నిర్వాహకులపై కేసు పెట్టేందుకూ ప్రయత్నం చేశారని.. దీంతో వాళ్లు ఏపీపై పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. సింగపూర్‌తో సంబంధాలు అన్నింటిని కూడా జగన్ చెడగొట్టారని.. అందుకనే వాళ్లతో మళ్లీ మన సంబంధాలను పునరుద్ధరించుకోవాలని చంద్రబాబు సూచించారు. సింగపూర్ కన్సార్టియం నిర్వాహకులు సీడ్ క్యాపిటల్ వినా ఏ ప్రాజెక్ట్ అయినా చేపడతామని అంటున్నారని సీఎం చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేశారు.
2024నుంచి 2025 సంవత్సరానికి నీటి పన్నుపై వడ్డీని పూర్తిగా రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే తిరుపతి తొక్కిసలాటపై జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఇచ్చిన కమిషన్ నివేదికపైనా కేబినెట్ చర్చించింది.
ఇరువురు అధికారులపై చర్యలు తీసుకోవాలని మంత్రిమండలి ఆదేశాలు జారీ చేసింది. గో సంరక్షణ అధికారి, మరో డీఎస్పీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది. కాగా, అప్పటి తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడుకి క్లీన్ చిట్ ఇచ్చింది ఏకసభ్య కమిషన్. తిరుపతిలో భవనాల క్రమబద్ధీకరణ విషయంలో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోవాలని, అలాగే తిరుపతిలో స్పష్టమైన చట్టం తేవాలని కేబినెట్ భావించింది. ఈసారి క్రమబద్ధీకరణ చేసిన తర్వాత చట్టం తీసుకువచ్చి భవిష్యత్‌లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేయకుండా చూడాలని నిర్ణయించింది కేబినెట్.
లిక్కర్ కేసు, వైఎస్సార్‌సీ నేతలకు కౌంటర్లు, సుపరిపాలనపైనా తొలుత మంత్రివర్గం చర్చించింది. తర్వాత మొత్తం 42 అజెండా అంశాలపై చర్చ కొనసాగింది.
ఎల్‌ఆర్‌ఎస్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్, ఎస్‌ఐపీబీ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఆర్డీఏ ప్రతిపాదనకు ఆమోదం తెలపడంతోపాటు పలు సంస్థలకు భూకేటాయింపుపైనా కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. నాలా చట్ట సవరణకు సంబంధించి చర్చించి ఆమోదం తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్‌కూ కేబినెట్ ఆమోదం తెలిపింది. నవంబర్‌లో 8 క్వి, బిట్ క్వాంటం కంప్యూటర్ ఆవిష్కరించునున్నట్టు ఈ సందర్భంగా మంత్రిమండలికి సీఎం చంద్రబాబు వెల్లడిరచారు. ఈ టెక్నాలజీని దేశంలోనే తొలిసారిగా అమరావతిలో ఆవిష్కరిస్తున్నట్టు స్పష్టం చేశారు. వ్యవసాయం, నీటి నిర్వహణ, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది వేసిన క్వాంటం మిషన్‌కు సీఎం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.