- పీఎం ఏజేఏవై కింద మంజూరైన సంక్షేమ వసతి గృహాలకు త్వరితగతిన నిధులు విడుదల చేయాలి
- కేంద్రాన్ని కోరిన మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి
ఢిల్లీ (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులు విడుదల చేయాలని కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత శాఖ మంత్రి డా. వీరేంద్ర కుమార్‌కు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి విజ్ఞప్తి చేశారు. దేశంలోని షెడ్యూల్డ్ సామాజిక వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తీసుకువచ్చిన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన (పీఎం ఏజేఏవై)కు సంబంధించి ఢిల్లీలో శనివారం జరిగిన సమన్వయ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి హాజరయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మంత్రి డోలా మాట్లాడుతూ….. ప్రస్తుతం పీఎం ఆదర్శ గ్రామ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.20 లక్షలు రూ. 50 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. దీనితోపాటు ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన శాఖా సంబంధమైన నిధులు విడుదల చేయాలని కోరారు. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం షెడ్యూల్ వర్గాల ప్రజలకు సంక్షేమం అందించే దిశగా ముందుకు వెళ్తుతోందని ఈ సమావేశంలో మంత్రి డోలా తెలిపారు. ూవీ – AజీA్ కింద మంజూరైన సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు త్వరితగతిన నిధులు కూడా విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ విజ్ఞప్తికి కేంద్రమంత్రి వీరేంద్ర కుమార్ సానుకూలంగా స్పందించినట్లు మంత్రి డోలా తెలిపారు.