- ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌ను ప్రపంచానికి పరిచయం చేద్దాం
- లెర్నింగ్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మోడల్ తీసుకువస్తాం
- విద్యావ్యవస్థలో సంస్కరణలు ఉమ్మడి బాధ్యత కావాలి
- పదేళ్లలో జరగని సంస్కరణలు 9 నెలల్లోనే చేపట్టాం
- ఐదేళ్లలో 12 లక్షలమంది సర్కారీ చదువుకు దూరమయ్యారు
- ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేస్తాం
- రూ.4,271 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వైసీపీ చలవే
- బాధ్యత తీసుకుని.. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు చెల్లిస్తాం
- విద్యారంగ సంస్కరణలపై మండలిలో మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్య రథం): కలిసికట్టుగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌ను ప్రపంచానికి పరిచయం చేద్దామని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విద్యాశాఖ తనకు భారం కాదు, బాధ్యతని పేర్కొన్నారు. విద్యారంగంలో సంస్కరణలపై మండలిలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఏ శాఖ కావాలని ముఖ్యమంత్రి అడిగినప్పుడు కఠిన శాఖ ఇవ్వాలని కోరానని, అందులో భాగంగా తానే విద్యాశాఖను ఎంచుకున్నానని మంత్రి లోకేష్ వివరించారు. అసమానతలు పోవాలంటే విద్యతోనే సాధ్యమని చెప్పానని, తాను ఏ బాధ్యతలు తీసుకున్నా అసలు పరిస్థితి ఏంటి? ఏం జరుగుతోంది? ఏం మార్పులు చేయాలనేది చూస్తానని అన్నారు. తాను మంత్రి అయిన తర్వాత విద్యాశాఖ అధికారులను అడిగిన మొదటి ప్రశ్న ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారని. ఇందుకు ఆరు నెలల సమయం పట్టింది. మళ్లీ ఎవరో రాసిన లెక్కలు చెప్పడం కాదు.. ఆన్‌లైన్‌లో తెలియాలని చెప్పా. అది చూసిన తర్వాత నిజంగా బాధేసింది. గడచిన ఐదేళ్లలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు. ఇది రికార్డ్. పాఠశాల విద్య, జూనియర్ కశాశాలలను కలిపి చెప్పిన లెక్క ఇది. ఇందుకు ప్రధాన కారణం జీవో 117. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. ప్రతిపక్ష నేతలు కూడా ఉంటే బాగుండేది. చర్చ జరగాలి. చర్చ జరిగితేనే వాస్తవాలు బయటకు వస్తాయి. జీవో 117 వల్ల పదిమంది కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు టీడీపీ హయాంలో 1,215 ఉంటే.. వైసీపీ హయాంలో 5,500 పాఠశాలలకు పెరిగాయి. 20 మంది కంటే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలు గతంలో 5,520 ఉంటే… అది 13,720కి పెరిగాయి. ఏకోపాధ్యాయ పాఠశాలలు 12,512కి పెరిగాయి. డేటా కోసం ఎందుకు ఇంత సమయం పడుతుందని మీరందరూ అడగవచ్చు. కావాలని రికార్డులను గత ప్రభుత్వం తారుమారు చేసింది. డ్రాప్‌బాక్స్‌లో లక్షమంది విద్యార్థులను ఉంచారు. వీరంతా 17 ఏళ్లకంటే ఎక్కువ వయస్సున్న వారు. ఎన్‌రోల్‌మెంట్ చూపించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం వాస్తవాలకు దూరంగా పనిచేసింది. దీనివల్ల 12.5 శాతానికి డ్రాప్ అవుట్ రేట్ పెరిగిందని మంత్రి లోకేష్ వివరించారు.
వైసీపీ పాలనలో ఫౌండేషన్ న్యూమరసీ స్కిల్స్ పడిపోయాయి
అందరూ సర్వేల గురించి మాట్లాడుతున్నారు. ఎన్‌ఏఎస్ సర్వే ప్రకారం 2017 నుంచి 2021 వరకు 3వ తరగతి లాంగ్వేజ్‌లో టీడీపీ ప్రభుత్వంలో మొదటి స్థానంలో ఉంటే.. 2021కి వచ్చేనాటికి 27వ స్థానానికి పడిపోయాం. పదోతరగతి మ్యాథ్స్ సబ్జెక్టుకు వస్తే.. మనం మొదటి స్థానంనుంచి 12వ స్థానానికి, సైన్స్ మొదటి స్థానంనుంచి 15వ స్థానానికి పడిపోయాం. ఇంగ్లీష్ ఏకంగా 4వ స్థానం నుంచి 14వ స్థానానికి దిగజారాం. ఏఎస్‌ఈఆర్ సర్వే ప్రకారం ఐదో తరగతి విద్యార్థులు రెండో తరగతి పాఠ్యపుస్తకాన్ని 2018లో 57శాతం మంది చదవగా.. అది 37శాతానికి పడిపోయింది. 8వ తరగతి విద్యార్థులు కూడా గతంలో 78శాతం మంది రెండో తరగతి పాఠ్యపుస్తకాన్ని చదవగా.. నేడు 53 శాతానికి పడిపోయింది. 90శాతం మంది ముడో తరగతి విద్యార్థుల్లో ఫౌండేషన్ న్యూమరసీ స్కిల్స్ లేవని లోకేష్ వివరించారు.
సీబీఎస్‌ఈ విధానంపై ఎలాంటి కసరత్తు చేయలేదు
మండలిలో నిరసన తెలుపుతూ సీబీఎస్‌ఈ, టోఫెల్, ఐబీ గురించి మాట్లాడారు. నేను కూడా సీబీఎస్‌ఈ స్టూడెంట్‌నే. ఇందుకు చాలా కసరత్తు అవసరం. గత ప్రభుత్వం ఎలాంటి సన్నద్ధత లేకుండా వెయ్యి పాఠశాలల్లో సీబీఎస్‌ఈ ప్రవేశపెట్టారు. ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు. విద్యార్థులను సన్నద్ధం చేయలేదు. మాక్‌టెస్ట్ పెడితే 90శాతం మంది విద్యార్థులు కనీసం ఒక సబ్జెట్‌లో ఫెయిల్ అయ్యారు. అందుకే అందరినీ సన్నద్ధం చేసిన తర్వాతనే సీబీఎస్‌ఈ విధానానికి వెళ్లాలనేది ప్రభుత్వ లక్ష్యం. టోఫెల్ అమలుచేసేందుకు ఆ సంస్థకు రూ.59 కోట్లు చెల్లించారు. పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఐబీ విషయానికి వస్తే మధ్యంతర నివేదికకే రూ.5కోట్లు వృధా చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో చర్చించాల్సిన అవసరం ఉందని లోకేష్ స్పష్టం చేశారు.
టీచర్లపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేస్తాం
గత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎన్నో రకాలుగా అవమానించింది. ఏకంగా మద్యం షాపుల ముందు కాపలా పెట్టింది. ప్రశ్నిస్తే కేసుల పేరుతో వేధించారు. గతంలో పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. 2022లో 1,570 మంది ఉపాధ్యాయులను నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారు. 45 యాప్‌లు తీసుకువచ్చారు. దీంతో ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు. టాయిలెట్ క్లీనింగ్ దగ్గర యాప్ తొలగించాం. మిగతా యాప్‌ల భారాన్ని తగ్గిస్తాం. సింగిల్ ఫ్లాట్‌ఫాం తీసుకువస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
కేంద్ర నిధులకు మ్యాచింగ్ గ్రాంటూ ఇవ్వలేదు
నాడు-నేడు కింద మొదటి విడత పనులు పూర్తిచేసేందుకు రూ.881 కోట్లు అవసరం. నాడు-నేడులో బెంచ్‌లు అందించిన పాఠశాలలను 117 జీవో ద్వారా మూసివేశారు. కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ కింద రూ.900కోట్లు మౌలిక సదుపాయాలకు కేటాయిస్తే.. గత వైసీపీ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేదు. ఆక్స్‌ఫర్డ్ తెలుగు డిక్షనరీ తీసుకువస్తే జగన్‌రెడ్డి మ్యానిఫెస్టో ఫోటో పెట్టారు. బెల్ట్‌లను కూడా వదల్లేదు. చిక్కీలపైనా జగన్‌రెడ్డి ఫోటో ముద్రించారు. పిల్లలు చదువుకుంటున్న నోట్‌బుక్స్‌పై జగన్ రెడ్డి ఫోటో పెట్టారు. ఇంటర్ మొదటి సంవత్సరం బోటనీ పుస్తకంపై జగన్‌రెడ్డి ఫోటో ముద్రించారు. లక్ష్మీపార్వతీ సందేశం ఒక పేజీలో ముద్రించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సందేశం కూడా ఒక పేజీలో ముద్రించారు. ఇంటర్‌లోనే మొత్తం 18 పేజీలు ఈవిధంగా ముద్రించారు. వీటిని తొలగించడంతో రూ.30లక్షలు ఆదా అయ్యాయి. గుడ్లను కూడా వదిలిపెట్టలేదని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు.
పారదర్శకంగా టెండర్లు
పారదర్శకంగా టెండర్లు నిర్వహించాం. ఒక్క స్కూల్ కిట్లలోనే వచ్చే ఐదేళ్లలో రూ.300 కోట్ల రూపాయలు ఆదా చేయనున్నాం. 9.4శాతం ధరలు తగ్గించాం. ఎక్కడా రాజకీయ నేతల ఫోటోలు పెట్టలేదు. ఎవరి సందేశాలు లేవు. మంచి నాణ్యతతో రెండువైపు ప్రింటింగ్ చేసి స్కూల్ యూనిఫామ్స్ అందిస్తున్నాం. పొలిటకల్ రంగులు ఎక్కడా లేవు. గత ప్రభుత్వం బ్యాగులను కూడా వదిలిపెట్టలేదు. జగన్‌రెడ్డి పేరు రాసుకున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో స్కూల్ కిట్స్ అందజేస్తున్నాం. ఎక్కడా మా పార్టీ రంగులు లేవు. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో ఎక్కడా మా ఫోటోలు, రంగులు లేవు. ఎక్కడా రీసైక్లింగ్ అవ్వకూడదని చిక్కీల్లో కేవలం ప్రభుత్వ లోగో పెట్టాం. బెల్ట్‌పై డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు ముద్రించామని వివరించారు.
ఎక్కడా రాజకీయ నేతల ఫోటోలు లేవు
పుస్తకాల బరువు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాం. మహారాష్ట్ర వెళ్లి పరిశీలన చేశాం. మొదటి తరగతి ఫస్ట్ సెమ్‌కి రెండే రెండు పుస్తకాలు ఇవ్వనున్నాం. సెకెండ్ సెమ్‌కు రెండు పుస్తకాలు ఇస్తాం. గతంలో 8 పుస్తకాలు ఇచ్చేవారు. వీటిని నాలుగు చేశాం. అన్ని తరగతుల్లో తగ్గించాం. ప్రభుత్వ లోగో తప్ప ఎక్కడా రాజకీయ నేతల ఫోటోలు లేవు. చిక్కీల్లో ఐదేళ్లలో రూ.240 కోట్ల రూపాయలు ఆదా చేస్తున్నాం. కోడిగుడ్ల రవాణలో రూ.144 కోట్లు ఆదా చేస్తున్నాం. గత ప్రభుత్వం సుమారు రూ.352 కోట్ల బకాయిలు పెట్టారు. గుడ్లకు రూ.200 కోట్లు, చిక్కీలకు రూ.60 కోట్లు, ఆయా, నైట్ వాచ్‌మెన్‌లకు రూ.65 కోట్లు, క్లీనింగ్ మెటీరియల్స్‌కు రూ.22 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. అవన్నీ కూటమి ప్రభుత్వం చెల్లించింది. గత ప్రభుత్వం ట్యాబ్‌ల కోసం రూ.1300 కోట్లు వృధా చేసింది. సూపర్ విజన్‌తో ప్రభుత్వ పాఠశాలల్లో డెస్క్ టాప్ కంప్యూటర్లు అందజేస్తామని లోకేష్ వివరించారు.
కూటమి హయాంలో ఇంటర్ ప్రవేశాలు పెరిగాయి
కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే జూనియర్ కాలేజీల్లో 16.61 శాతం ప్రవేశాలు పెరిగాయి. ఇంటర్ మొదటి సంవత్సరంలో గత టీడీపీ ప్రభుత్వ పాలనలో ఉత్తీర్ణత 42శాతంఉంటే.. వైసీపీ ప్రభుత్వంలో 30శాతానికి పడిపోయింది. రెండో ఏడాదిలో 58 శాతం ఉంటే.. వైసీపీ హయాంలో 39శాతానికి పడిపోయింది. ఇంటర్ విద్యార్థులకు స్కూల్స్ కిట్స్‌ను, మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేశారు. హైస్కూల్ ప్లస్ వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని లోకేష్ అన్నారు.
కుటుంబీకులు, కార్యకర్తలను వీసీలుగా నియమించారు
ఉన్నత విద్య విషయానికి వస్తే 2014నుంచి 2019 వరకు ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో 200లోపు ర్యాంకుల్లో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు 9 ఉండగా.. నేడు 5కి పడిపోయాయి. 2019లో ఏయూ యూనివర్సిటీ 29వ ర్యాంకులో ఉంటే.. నేడు 41వ ర్యాంకుకు పడిపోయింది. ఎస్వీయూ 72 నుంచి 100-150 మధ్య పడిపోయింది. ఏఎన్‌యూ అసలు ర్యాంకింగ్‌కు ఎంపిక కాలేదు. 2024లో 97వ స్థానానికి వచ్చింది. జేఎన్టీయూ అనంతపూర్, కాకినాడ, ఎస్కేయూ, పద్మావతి మహిళా యూనివర్సిటీలు ర్యాంకింగ్‌కు ఎంపిక కాలేదు. ఇందుకు కారణం జగన్‌రెడ్డి, కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలను ఏకంగా వీసీలుగా నియమించారు. ఏయూ యూనివర్సిటీ వీసీగా ప్రసాద్‌రెడ్డి, ఎస్వీయూ యూనివర్సిటీ వీసీ ఏకపక్షంగా వ్యవహరించారు.
వీసీల నియామకంలో పారదర్శకంగా వ్యవహరించాం
వీసీల నియామకంలో పారదర్శకంగా వ్యవహరించాం. ఐఐటీ ఖరగ్‌పూర్, ఎన్‌ఐటీ వరంగల్‌లో పనిచేసిన వారిని వీసీలుగా నియమించాం. అద్భుతమైన వైస్ ఛాన్స్‌లర్స్‌ను జల్లెడపట్టి తీసుకువచ్చాం. పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీకి మన వైఎస్ ఛాన్స్‌లర్‌ను తీసుకెళ్లారు. వీసీలుగా ఉన్నవారు ఎవరూ నా బంధువులు కాదు. నా మిత్రులు కాదు. ఒక్కసారి కూడా ఫేస్ టూ ఫేస్ కలవలేదు. విశ్వవిద్యాలయాలకు పూర్వవైభవం తీసుకువస్తాం. అందులో భాగంగానే వీసీల నియామకం చేప్టటాం. ఐఐఐటీలకు గవర్నర్ ఛాన్స్‌లర్‌గా ఉంటారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని చాన్స్‌లర్‌గా చేసే ప్రయత్నం చేశారు. దానిని రద్దు చేశాం. తిరిగి గవర్నర్‌కే ఆ బాధ్యత అప్పగించామని లోకేష్ వివరించారు.
రూ.4,271 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టారు
గత ప్రభుత్వం ట్యూషన్ ఫీజు రూ.2,832 కోట్లు బకాయిలు పెట్టారు. హాస్టల్ ఫీజు రూ.989 కోట్లు బకాయిలు పెట్టారు. పీజీ ఫీజురీయింబర్స్ మెంట్ రూ.450 కోట్లు బకాయిలు పెట్టారు. మొత్తం రూ.4,271 కోట్లు బకాయిలు పెట్టారు. గత ప్రభుత్వ బకాయిల విషయంలో.. మన ప్రభుత్వం తప్పనిసరిగా దశలవారీగా ఫీజులు చెల్లించే బాధ్యత తీసుకుంటుంది. పీజీ ఫీజు రీయింబర్స్ మెంట్ తిరిగి ప్రారంభిస్తాం. ఎయిడెడ్ వ్యవస్థపై ఆనాడు కలిసికట్టుగా పోరాడాం. ఆనాడు పోలీసులను పంపి విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయించారు. జగన్ రెడ్డి నిర్వాకంతో ఎయిడెడె లో సుమారు 1,100 మంది ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. దీనికి ప్రత్యామ్నాయం తీసుకువస్తాం.
గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్