- ఉన్నత ప్రమాణాలతో సౌకర్యాలు కల్పించాలి
- పేద విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేయాలి
- 100 శాతం ఉత్తీర్ణత, సీట్ల భర్తీ జరగాలి
- వార్డెన్లు గార్డియన్‌గా వ్యవహరించాలి
- విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
- మెనూ పర్యవేక్షణకు కమిటీలు వేయాలి
- మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి
- తొమ్మిది జిల్లాల అధికారులతో సదస్సు
విశాఖపట్నం(చైతన్యరథం): సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, విద్య అందించడం ద్వారా వారు పరిశుభ్ర, ఆరోగ్యకర, సౌకర్యవంతమైన వాతావరణంలో చదువు కునే పరిస్థితులు కల్పించే దిశగా సంక్షేమ అధికారులు హాస్టళ్లలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు కృషిచేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఆదేశించా రు. నగరంలోని రుషికొండ గీతం విశ్వవిద్యాలయంలోని మదర్ థెరిసా ఆడిటోరియంలో సాంఘిక సంక్షేమశాఖ ప్రాంతీయ సదస్సు సోమవారం నిర్వహించారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయ నగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఉమ్మడి తూర్పుగోదావారి జిల్లాలోని కాకినాడ, డా.అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి తదితర తొమ్మిది జిల్లాలకు చెందిన సాంఘిక సంక్షేమ ఉప సంచాలకులు, సంక్షేమ అధికారులు, సహాయ సంక్షేమాధికారులు, హాస్టళ్ల సంక్షేమాధికారు లు 230 మంది ఈ సదస్సులో పాల్గొన్నారు. హాస్టళ్లలో సీట్ల భర్తీ, టెన్త్, ఇంటర్‌లో విద్యార్థుల ఉత్తీర్ణత, హాస్టల్ భవనాల మరమ్మ తులు, డైట్ బిల్లుల చెల్లింపు, పారిశుద్ధ్య నిర్వహణ, మెనూ ప్రకా రం నాణ్యమైన భోజన వసతి కల్పించడం, హాస్టళ్ల తనిఖీలు తదిత ర అంశాలపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ డైరెక్టర్ లావణ్యవేణి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.ఎం.నాయక్‌లతో కలసి మంత్రి జిల్లాల వారీగా, అంశాల వారీగా సమీక్షించారు. విద్యార్థులకు వార్డెన్‌లే గార్డియన్‌లుగా ప్రతిభావంతులైన విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఇంటర్ ఉత్తీర్ణత సాధించి గత ఏడాది నీట్‌లో కొద్దిపాటి ర్యాంకు తేడాతో సీట్లు పొందలేకపోయిన ఎస్సీ విద్యార్థుల కోసం సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ ఏడాది సీటు సాధించలేని వారు ఉంటే వారిని లాంగ్ టర్మ్ కోచింగ్ వినియోగించుకునేలా ప్రోత్సహించాలని కోరారు. హాస్టళ్లలో చదివిన ఏ ఒక్క విద్యార్థి టెన్త్, ఇంటర్‌లో ఫెయిల్ కావడానికి వీల్లేదని స్పష్టంచేశారు.
100 శాతం సీట్ల భర్తీ కావాలి
హాస్టళ్లలో వందశాతం ప్రవేశాలు జరిగి సీట్లన్నీ భర్తీ కావాలని స్పష్టంచేశారు. 100 శాతం సీట్ల భర్తీ వచ్చే ఏడాది నుంచి జరగా లని స్పష్టంచేశారు. ఈ ఏడాది వరకు కనీసం 75 శాతం సీట్లు భర్తీ కావాలన్నారు. హాస్టళ్లలో చదివే విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించి హాస్టల్ నుంచి బయటకు వెళ్లాలన్నారు. వచ్చే ఏడాది నుంచి నూరు శాతం హాస్టల్ సీట్లు భర్తీచేయలేని వార్డెన్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
విద్యార్థుల ఆరోగ్యంపై పర్యవేక్షించాలి
హాస్టళ్ల విద్యార్థులకు ప్రతినెలా క్రమం తప్పకుండా వైద్యాధి కారులతో ఆరోగ్య తనిఖీలు చేయిస్తూ వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ప్రతినెలా వైద్యాధికారులు, వారానికో సారి ఏఎన్‌ఎంల ద్వారా ఆరోగ్య తనిఖీలు చేయించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని నిత్యం గమనిస్తూ ఏ విద్యార్థి అయినా అనా రోగ్యానికి గురైన వెంటనే తక్షణ వైద్యం అందించాలని సూచిం చారు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, హాస్టళ్లలో నీరు నిల్వలేకుండా చూడటం, వేడిచేసిన నీటిని అందించడం, పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరి చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మెనూ ప్రకారం నాణ్య మైన ఆహారాన్ని అందించాలని మంత్రి ఆదేశించారు. మెనూ అమ లుపై పర్యవేక్షణకు విద్యార్థులతో కూడిన కమిటీలు వేయాలని చెప్పారు. హాస్టళ్లలో అందిస్తున్న ఆహారం నాణ్యతపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటామని పేర్కొన్నా రు. వార్డెన్లు విద్యార్థులతో పాటుగా హాస్టళ్లలోనే బసచేయాలని చెప్పారు. బయటకు వెళ్లి రోడ్డు పక్కన దొరికే తినుబండారాలతో అస్వస్థతకు గురవుతున్నారని, హాస్టల్‌లోనే వారికి ఆరోగ్యకర ఆహా రాన్ని అందించాలన్నారు. ఈ సమావేశంలో విశాఖ జిల్లా ఉప సంచాలకులు కె.రామారావు, రాష్ట్ర కార్యాలయం డీడీ లక్ష్మీసుధ, అన్ని జిల్లాల డీడీలు, ఏఎస్‌డబ్ల్యూవోలు, హెచ్‌డబ్ల్యూవోలు పాల్గొ న్నారు.