- కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుదని హామీ
అమరావతి (చైతన్యరథం): అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట మండలం, రాజానగరం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో వేదిక నిర్మాణం వద్ద జరిగిన ప్రమాదంలో ఇంగ్లీష్ అసిస్టెంట్ జ్యోత్స్న బాయి మృతి చెందడం బాధాకరమని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. ఆమె మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు. టీచర్ కుటుంబానికి అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ప్రమాదంపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. పాఠశాలల ఆవరణలో ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి లోకేష్ సూచించారు.














