అమరావతి (చైతన్య రథం): సింగపూర్ రిపబ్లిక్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో సమావేశం అనంతరం.. ‘ఇది కొత్త అధ్యాయానికి నాంది’ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. షణ్ముగరత్నంతో సాగిన సమావేశంపై సంతోషం వ్యక్తం చేస్తూ.. ‘మీతో సమావేశం గొప్ప ఆనందాన్నిస్తోంది. భారత్ `సింగపూర్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించడమే కాదు, కొత్త అధ్యాయానికి అడుగులేస్తోన్న భావన కలుగుతోంది. జ్ఞాన, ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్లు, అమరావతి అభివృద్ధి, పట్టణ ప్రణాళిక, పునరుత్పాదకశక్తి వంటి రంగాలలో పరస్పర సహకారంగా సాగిన సుదీర్ఘ చర్చ సంతృప్తినిస్తోంది’ అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.