అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం విడుదల చేశారు. వచ్చే ఏడాది (2025) మార్చి 17 నుండి 31 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా, మరింత మెరుగ్గా సన్నద్ధమయ్యేందుకు వీలుగా పరీక్షలను రోజు మార్చి రోజు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించామని మంత్రి లోకేష్ తెలిపారు. ఈ అదనపు సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మరింత మెరుగైన ఫలితాలు, మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. పరీక్షలకు హాజరవుతున్న తమ్ముళ్లు, చెల్లెళ్లు మంచి ఫలితాలు సాధించాలని శుభాభినందనలు తెలియజేశారు.