విశాఖ: ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సరే… తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం సైనికుల్లా పని చేయాలని విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గణబాబు పిలుపునిచ్చారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం క్లస్టర్, యూనిట్ ఇంఛార్జ్‌లతో గణబాబు సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పార్టీ గెలుపే ప్రతి కార్యకర్త లక్ష్యమన్నారు. మూడేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని… వీటిని ప్రజలను వివరించాలని దిశా నిర్దేశం చేశారు.
ఈ సమావేశానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున పరిశీలకులుగా ఎమ్మెల్సీ ద్వారపూడి జగదీష్, ముఖ్య అతిథిగా విశాఖ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, కిమిడి మాలిక్, విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్, కార్పొరేటర్స్ సరగడం రాజశేఖర్, బొమ్మిడి రమణ, గల్లాచిన్న, దాడి వెంకట రమేష్, మూర్తి యాదవ్, వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీలు పాల్గొన్నారు.