అమరావతి (చైతన్యరథం): పిల్లలకు చదువు పట్ల ఆసక్తి పెంపొందిస్తూ పాఠాలు నేర్పుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఈ మేరకు ఎక్స్లో మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు. విశాఖ జిల్లా, పెందుర్తి మండలం, పినగాడి మండల ప్రాథమిక పాఠశాల సెకండరీ గ్రేడ్ టీచర్ పల్టాసింగి అలివేలి మంగ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆటపాటలతో విద్యాబుద్ధులు నేర్పుతున్న తీరు చాలా బాగుంది. Learning made easy with Activities టీచింగ్ విధానంతో చదువు పట్ల పిల్లలు ఆసక్తి కనబరిచేలా విధులు నిర్వర్తిస్తున్న టీచర్కి అభినందనలు. Unique innovative Teaching methods, No Bag Day Activities, Word Building, FLN Based Learning వంటి అంశాలను పిల్లలకు బోధిస్తూ.. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్న టీచర్ పల్టాసింగి అలివేలి మంగ కృషి ప్రశంసనీయమని మంత్రి లోకేష్ అభినందించారు.













