ఇందిరాగాంధీ ఏకఛత్రాధిపత్యం చెలాయించింది. ఏపీలో కాంగ్రెస్ దుర్మార్గాలకు ఎదురులేదు, తిరుగులేదు. ఎన్టీఆర్ పోరాట పటిమతో కాంగ్రెస్ మోనోపలీని బద్దలుకొట్టారు. అనంతరం వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ కుట్రలను, దౌర్జన్యాలను, అరాచకాలను ఓడిరచారు.
నక్సల్ తీవ్రవాదుల కైమోర్స్ సహా హింసా చర్యలను చంద్రబాబు ఎదురొడ్డి పోరాడారు. ఫ్యాక్షనిస్టుల రక్తపాతం, మతకల్లోలాలు ఎదుర్కొని శాంతి భద్రతలను కాపాడారు.
యువగళం పాదయాత్రపై దమనకాండను ఎదురొడ్డి లోకేష్ వీరోచిత పోరాట పటిమ ప్రదర్శించారు. జగన్‌బాబా 40 దొంగలముఠా కలలో కూడా రెడ్‌బుక్‌ను కలవరించే స్థితి తెచ్చారు.
టీడీపీ నేతలు, కార్యకర్తలు, చివరకు పార్టీ సానుభూతిపరులు సైతం 2004`09 మధ్య వైఎస్ ప్రభుత్వ భీకర దాడులను తిప్పికొట్టారు.
2019`24 మధ్య జగన్ పాలనలో వందలాది టీడీపీ నేతలను, కార్యకర్తలను హత్యలు చేసినా, వేలాదిమందిని జైళ్లలో కుక్కి హింసించినా వీరోచితంగా పోరాడి విజయం సాధించారు.
ఢల్లీి సుల్తానులు దక్షిణాది రాష్ట్రాలను కబళించకుండా ఎదురొడ్డి పోరాడిన కాకతీయులు, ముసునూరి రాజులు, విజయనగర సామ్రాజ్య యోధులలో నేటి టీడీపీని బలపరుస్తున్న సామాజిక వర్గాల పూర్వీకులు అగ్రపీఠాన పోరాడి విజయం సాధించారు.
టీడీపీ డీఎన్‌ఏలో ఆనాడూ.. ఈనాడూ పోరాట డీఎన్‌ఏ ఉందిగానీ, భయపడే డిఎన్‌ఏ లేనే లేదు.
శిశుపాలుని 99 తప్పులను శ్రీకృష్ణుడు సహించింది, భరించింది భయంతో కాదు. `పాపం పండినప్పుడు శ్రీకృష్ణుడు చేయాల్సింది చేశాడు. `అరాచకవాదుల ఆట ఇంట్రొవెల్ వరకూ సాగుతుంది. ఇంట్రొవెల్ తరువాత భల్లాలదేవుడైనా కుప్పకూలక మానరు.
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌తో సహా ప్రతి హామీనీ అమలు చేస్తున్నది. ప్రజలలో ప్రత్యేకించి పేదలలో ఈ ప్రభుత్వంపట్ల సానుకూలత పెరిగినట్టు ‘సుపరి పాలనలో తొలిఅడుగు’ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో వ్యక్తమవుతున్నది. అభివృద్ధి విషయంలో టీడీపీకి పోటీలేదు.. సాటిలేదు.
పింఛనుదారుల్లో 80శాతం మంది 2024 ఎన్నికలలో వైకాపాకు ఓటు వేశారు. నేడు రూ.4వేల పింఛనుతో 80శాతం పైగా టీడీపీవైపు మారారు. అమ్మఒడి ప్రభావంతో వైకాపాకు మహిళలు అధికంగా ఓటువేశారు. నేడు తల్లికి వందనంతో మహిళలు, అత్యధికులు కూటమివైపు మారారు. కార్మికులు, ఉద్యోగులు, రైతులు, ధాన్యం కొనుగోలు, ఉచిత ఇసుక, జీతాలు సకాలంలో చెల్లింపుల వల్ల ప్రభుత్వంపట్ల సానుకూలంగానే ఉన్నారు. సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించకుండా వారి స్వయం ఉపాధికే ఖర్చు చేయడంవల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు సంతోషంగా ఉన్నారు. 16347 ఉపాధ్యాయ నియామకాలు, 6100 పోలీసు ఉద్యోగ నియామకాలు, 9.4 లక్షల పెట్టుబడుల ద్వారా 8.5 ఉద్యోగావకాశాల వల్ల యువత కూటమివైపే ఉన్నారు. రానున్న నాలుగేళ్లలో ఇది మరింత పెరుగుతుంది.
వైకాపా అబద్ధపు ప్రచారాలు, కుట్రలు ఇప్పుడు సకాలంలో ఎండగట్టబడుతున్నవి. గతంలోలాగ ఇప్పుడు కోడికత్తి, గులకరాయి, వివేకా హత్యలాంటి కుట్రలను కూటమి ప్రభుత్వం సహించే స్థితి లేదు.
కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు, ఒక్కఛాన్స్ నాటకాలకు మోసపోయి 2019`24 మధ్య తమ ధన, మాన, ప్రాణాలకు, ఆస్తులకు ఎలా ప్రమాదం ఏర్పడిరదో ప్రజలు మర్చిపోవడానికి నేడు సిద్ధంగా లేరు. ప్రభుత్వం, కూటమి పార్టీలు కూడా కుల, మత, ప్రాంతీయ విద్వేష ప్రచారాలను సహించే స్థితి లేదు.
వ్యాపార, పారిశ్రామికవర్గాలు నేడు భయంలేకుండా స్వేచ్ఛగా వారివారి వ్యాపారాలు చేసుకోగలుగుతున్నారు. వారిపై దాడులు లేవు. ప్రభుత్వంపట్ల కులాలకు అతీతంగా సానుకూలంగానే ఉన్నారు. మరి 2029లో జగన్ బాబా 40 దొంగలు ఎలా అధికారంలోకి రాగలరు? అది మైండ్ గేమ్ మాత్రమే!
ఆ సర్వేలు ఈ సర్వేల పేరిట, ఈవీఎంల పేరిట ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రబలిపోయినట్టు జగన్ ముఠా గోరంతలను కొండంతలు చేసి నమ్మించే కృత్రిమ కథలల్లుతున్నారు. అబద్ధాలది అల్పాయుష్షు మాత్రమే!
2024 ఎన్నికల ముందు జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరిగాయి. ఆనాడు జగన్ ప్రభుత్వమే ఉన్నది. పులివెందులవున్న పశ్చిమ రాయలసీమలో కూడా ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ అభ్యర్థి బ్యాలెట్ పేపర్ల ద్వారా గెలిచారు? ఆ ఎన్నికల్లో ఈవీఎంలు లేవు కదా?
రప్పా రప్పాలకు పాల్పడ్డ వైఎస్ రాజారెడ్డి ఏమయ్యారు? అలాగే పరిటాల శ్రీరాములును రపారప్పా నరికిన మద్దెలచెరువు సూరి కుటుంబం ఏమయ్యింది.?
ప్రజాస్వామ్య పంథాలోకి మారకుండా జగన్ రప్పా రప్పాలు, అబద్ధాలు, కుట్రలు నమ్ముకుంటే వైకాపా భవిష్యత్ కనుమరుగే. జగన్ ఒక్కో అరాచక యాత్రకు కోటానుకోట్లు దోపిడీ డబ్బు ఖర్చుచేసి తోలుకొచ్చే జనం.. వాపేగాని బలుపు కాదు. సీపం సీఎం అంటూ మాఫియాలు, సైకోలు చేసేది కాకిగోలేనని ప్రజలకు స్పష్టంగా తెలుసు. 2029తోపాటు 2034లో సైతం కూటమినే ప్రజలు గెలిపిస్తారు. స్వర్ణాంధ్రను సాకారం చేసుకుంటారు.
గురజాల మాల్యాద్రి,
ఛైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్