- అభివృద్ధికి టీడీపీ బ్రాండ్
- ప్రజలకు దగ్గరగా ఉన్నవారే నాకు దగ్గరగా ఉంటారు
- కుప్పం పార్టీ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు
కుప్పం (చైతన్య రథం): ఇకపై ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో కార్యకర్తలు భాగస్వాములు కావాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ‘సుపరిపాలనలో తొలి అడుగు -ఇంటిరిటి ప్రచారం’ కార్యక్రమ నిర్వహణపై కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. ‘‘పొలిటికల్ గవర్నెన్స్ చేపడుతున్నాం. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో మీరంతా పాలుపంచుకోవాలి. నేను ప్రభుత్వ పనితో సమానంగా పార్టీ కోసం పని చేస్తున్నాను. పనులు చేయడం ఎంత ముఖ్యమో.. చేసిన పనిని చెప్పుకోవడం కూడా అంతే ముఖ్యం. నేను మొదటిసారి కుప్పానికి వచ్చినప్పటికంటే ఇప్పుడు ఎంతో మార్పు వచ్చింది. సుపరిపాలనలో తొలి అడుగు.. ఇంటింటి ప్రచార కార్యక్రమం మొదలు పెట్టాం. ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు.. దాన్ని ప్రజలకూ తెలియ చెప్పాల్సిన బాధ్యతా ఉంది. గత పాలకులు అరాచకాలు చేసి 11కు పడిపోయారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ అని చెప్పాం. హామీలిచ్చిన విధంగా పని చేస్తున్నామని ప్రజలకు చెప్పాలి. కార్యకర్తలు ఇంటింటి వెళ్లి ప్రచారం చేసేటప్పుడు ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దండి. గత ప్రభుత్వం పెన్షన్లల్లో కోత పెట్టింది. మనం అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నాం. అభివృద్ధికి బ్రాండ్ టీడీపీ అయితే.. టీడీపీకి బ్రాండ్ కార్యకర్తలే.
నేతలు అటూ ఇటూ మారతారు కానీ కార్యకర్తలే శాశ్వతంగా ఉంటారు. డబుల్ సంక్షేమం చేస్తున్నాం. ఫలితం కూడా డబుల్‌గానే ఉండాలనే లక్ష్యంతో కేడర్ పని చేయాలి. కుప్పంలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులే. అవి కూడా ఏసీ బస్సులే ఉండేలా చేస్తాం. కుప్పంలో 100 శాతం సోలార్ రూఫ్ టాప్ చేయించాలి. కుప్పానికి ఎయిర్ పోర్టు రాబోతోంది. అభివృద్ధిని అడ్డుకోవద్దు. కుప్పం అభివృద్ధికి ప్రజల సహకారం కూడా కావాలి. మల్లప్ప కొండ, నన్యాల్ వంటి వాటిని టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేస్తున్నాం. హంద్రీ-నీవా నీళ్లు వస్తున్నాయి. భవిష్యత్తులో కుప్పంలో కరవు అనేదే లేకుండా చేస్తాం. ప్రజలకు మంచి జరిగితే టీడీపీ కార్యకర్తే గుర్తుకు రావాలి’’ అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
టీడీపీ కార్యకర్తకి మంచి పేరు శాశ్వతం కావాలి
‘‘ప్రజలకు దగ్గరైన వారు నాకు దగ్గరగా ఉంటారు. ప్రజల్లో చెడ్డ పేరుంటే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తాను. కుప్పంలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇదే ఫార్మూలా. టీడీపీ కుటుంబ సభ్యులకు సమాజంలో శాశ్వతంగా మంచి పేరు ఉండాలి. పార్టీ కోసం పని చేసిన వారికి.. గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డ వారికి ప్రయార్టీ ఇవ్వాలి. టీడీపీది పెద్ద సైన్యం. ఎవరి పరిధిలో వారు చేస్తే అద్భుతాలు సాధించగలం. రాబోయే నెల రోజుల్లో 100 శాతం ఇంటిరిటికి ప్రచారం చేయాలి. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ 5-6 శాతం పెరగాలి. లీడర్ షిప్ ట్రైనింగ్ కార్యక్రమాలు చేపడతాం’’ అని టీడీపీ అధినేత వెల్లడిరచారు. కార్యక్రమంలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.