- జేపీసీ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి
- ముస్లిం సమాజంతో విస్తృతంగా చర్చలు
- జేపీసీ ముందుకు నాలుగు సవరణలు
- మూడిరటికి ఆమోదం
- ముస్లింల అభిప్రాయాలు పట్టించుకోకుండా జగన్ ద్రోహం
అమరావతి (చైతన్యరథం): వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో టీడీపీ మరోసారి ముస్లింల పక్షాన గట్టిగా నిలబడిరది. వక్ఫ్ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లి, సవరణలు చేసేలా పట్టుబట్టి, ముస్లింల పక్షాన పోరాడిరది. టీడీపీ పట్టువల్లే దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు కేంద్రం ఆంగీకరించింది. ఎన్డీఏలో ఉంటూనే ముస్లింల హక్కుల కోసం టీడీపీ పోరాడి సాధించింది. వక్ఫ్ చట్టంలో టీడీపీ ప్రవేశపెట్టిన నాలుగు సవరణల్లో, మూడిరటికి జేపీసీ ఆమోదం తెలిపింది. జేపీసీ ఆమోదించిన 14 సవరణల్లో 3 టీడీపీ సూచించినవే కావటం గమనార్హం. టీడీపీ ప్రతిపాదించిన సవరణలు ఇవీ…
1. కొత్త చట్టం అమల్లోకి రావడానికి ముందున్న వక్ఫ్ ఆస్తులు యథాతథం
‘వాడుక ద్వారా వక్ఫ్’’ గా ఇప్పటికే నమోదైన ప్రస్తుత వక్ఫ్ ఆస్తుల కేసులు తిరిగి తెరిచేందుకు వీలు లేదు. వాటికి వక్ఫ్ దస్తావేజు లేనప్పటికీ, వక్ఫ్ ఆస్తులుగానే ఉంటాయి. మొత్తం వక్ఫ్ ఆస్తుల్లో దాదాపు 40 నుండి 50 శాతం వరకు వాడుక ద్వారా వక్ఫ్ కేటగిరీలోకి వస్తాయి. అనేక మసీదులు, శ్మశానవాటికలు, అషూర్-ఖానాలు, దర్గాలు, ఈద్గాలు మొదలైనవి అనాదిగా మతపరమైన ప్రయోజనాల కోసం వినియోగంలో ఉన్నాయి. ఈ సంస్థలు, వాటి ఆస్తులు వాడుక ద్వారా వక్ఫ్ పరిధిలోకి వస్తాయి. వాటిలో చాలా వాటికి వక్ఫ్ దస్తావేజులు లేవు.
2. వివాదాలపై విచారణ అధికారిగా కలెక్టరు వద్దు. ప్రభుత్వం నియమించిన డిజిగ్నేటెడ్ అధికారికి ఇవ్వాలి.
ఏదైనా ఆస్తిపై వివాదం వస్తే దానిపై నిర్ణయం తీసుకునే అధిóకారాన్ని జిల్లా కలెక్టర్‌కు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. ప్రస్తుతం అనేక వివాదాలు పెండిరగ్‌లో ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఒక నిర్దిష్ట ఆస్తి వక్ఫ్‌కు చెందినదా, ప్రభుత్వానికి చెందినదా అనే వివాదాలు తలెత్తవచ్చు. దానిపై నిర్ణయం తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉండకూడదని టీడీపీ ప్రతిపాదించింది. వివాదంపై విచారణకు అధికారిని నియమించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వదిలివేయాలని సూచించిన సవరణకు జేపీసీ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా కలెక్టర్ స్థాయికి మించిన అధికారిని నియమించవచ్చు.
3. డిజిటల్‌గా పత్రాలను సమర్పించడానికి 6 నెలల గడువు నిబంధన తొలగింపు. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అధికారిక పోర్టల్‌లో వక్ఫ్ ఆస్తుల వివరాలను నమోదు చేయడానికి 6 నెలలు
కాకుండా తగినంత సమయం ఇవ్వాలి.
ప్రతిపాదిత చట్టం ప్రకారం ఇది అమల్లోకి వచ్చిన ఆరు నెలల్లోపు వక్ఫ్ ఆస్తుల వివరాలు అధికారిక పోర్టల్లో నమోదు చేయాలి. ఆ గడువు లోపు నమోదు కాని ఆస్తుల గురించి ఏ కోర్టులోనూ దావా వేసేందుకు, అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఉండదు. చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉండదు. దీనిని టీడీపీ వ్యతిరేకించి ఈ గడువు నిబంధన తీసేయాలని పట్టుబట్టింది. ఈ సవరణకు జేపీసీ ఆమోదం తెలిపింది. తగిన కారణం ఉందని కోర్టుకు ఆమోదయోగ్యంగా తెలియపరిస్తే, ఆరు నెలల గడువు తర్వాత కూడా దావా, అప్పీల్, ఇతర చట్టపరమైన చర్యలకు సంబంధించి దరఖాస్తును కోర్టు స్వీకరించవచ్చు. ఈ సవరణతో, వక్ఫ్ ఆస్తుల నమోదును పూర్తి చేయడానికి ఆరు నెలల కంటే ఎక్కువ ఆలస్యం జరిగితే సరిదిద్దుకునేందుకు సంబంధించిన వారికి/సంస్థలకు తగిన సమయం ఇస్తారు.
టీడీపీ వల్లే జేపీసీ ఏర్పాటు
వక్ఫ్ సవరణ చట్టంపై టీడీపీ మొదటినుంచీ ముస్లింలకు మద్దతుగా నిలిచింది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ప్రతిపాదిత ఈ సవరణ బిల్లులోని లోపాలను వ్యతిరేకించింది. ముస్లిం సమాజం మనోభావాలను గౌరవిస్తూ, వక్ఫ్ బిల్లుపై సమగ్ర చర్చ జరగాలని, జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ కోరింది. టీడీపీ డిమాండ్‌కు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, జగదాంబికా పాల్ అధ్యక్షతన 31 మంది సభ్యులతో జేపీసీని ఏర్పాటు చేసింది. ఈ జేపీసీలో తెలుగు రాష్ట్రాల ప్రతినిధులుగా తెలంగాణ నుండి అసదుద్దీన్ ఒవైసీ (ఏఐఎంఐఎం), డీకే అరుణ (బీజేపీ), ఆంధ్రప్రదేశ్ నుండి లావు శ్రీకృష్ణ దేవరాయలు (టీడీపీ), విజయసాయి రెడ్డి (వైసీపీ) సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ వక్ఫ్‌కు సంబంధించిన 284 మందితో చర్చలు జరిపింది. ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, గౌహతి, భువనేశ్వర్, పాట్నా, కోల్‌కతా, లక్నో వంటి నగరాల్లో సమావేశం అయింది. మూడు అధ్యయన పర్యటనలు చేసింది. వక్ఫ్ బోర్డులు, ప్రభుత్వాలు, మైనారిటీ కమిషన్ల అభిప్రాయాలను సేకరించింది. జేపీసీ 38 సార్లు సమావేశమైంది. ఈ సమావేశాలకు అసదుద్దీన్ ఒవైసీ 14 సార్లు, డీకే అరుణ 12 సార్లు, లావు శ్రీ కృష్ణ దేవరాయలు 11 సార్లు హజరయ్యారు. విజయసాయి రెడ్డి కేవలం 4 సమావేశాలకు మాత్రమే హాజరై, చివరి సమావేశానికి ముందే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ముస్లిం మైనారిటీల మనోభావాలను గౌరవిస్తూ, వక్ఫ్ బిల్లుపై వారి ఆందోళనలను తెలుసుకోవడానికి జేపీసీ సభ్యుడు లావు శ్రీ కృష్ణ దేవరాయలు దేశవ్యాప్తంగా విస్తృత సంప్రదింపులు జరిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి, రాష్ట్రంలోని మైనారిటీ పెద్దలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వక్ఫ్ హోదా, కలెక్టర్ అధికారాలు, వక్ఫ్ బోర్డు నిర్మాణం, ట్రిబ్యునల్ అధికారాలు వంటి కీలక అంశాలపై ముస్లిం మైనారిటీల ఆందోళనలను, మనోభావాలను జేపీసీ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రతినిధులతో కూడిన ఒక అధికారిక కమిటీని ఏర్పాటు చేసి, జేపీసీని కలిసి రాష్ట్రం తరపున పలు ముఖ్యమైన సవరణలను ప్రతిపాదించారు. జేపీసీ సభ్యులు గంటకు పైగా ముస్లిం పెద్దల అభిప్రాయాలను శ్రద్ధగా విన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 44 సవరణలు రాగా, వాటిలో 14 సవరణలను జేపీసీ ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా నియమించిన కమిటీ ప్రతిపాదించిన 3 సవరణలను జేపీసీ ఆమోదించడం తెలుగుదేశం పార్టీ కృషికి తార్కాణం.
వైసీపీ ద్రోహం
తెలుగు రాష్ట్రాల తరపున జేపీసీలో ప్రాతినిధ్యం వహించే అవకాశం వైసీపీకి వచ్చినా.. ముస్లింల అభిప్రాయాలను వినడానికి కూడా జగన్ ఇష్టపడలేదు. భయంతో, యలహంకలో తలదాచుకున్నారు. జేపీసీ సమావేశాలకు డుమ్మా కొడుతూ.. చివరి జేపీసీ సమావేశానికి ముందే విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, ముస్లిం సమాజానికి ద్రోహం చేశారు. వక్ఫ్ సవరణ చట్టంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ ఏ ఒక్క సవరణ, డిమాండ్ చేయలేదనే విషయాన్ని ముస్లిం సమాజం తెలుసుకోవాలి.
ఈ మొత్తం వ్యవహారంలో, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ముస్లిం మైనారిటీల పక్షాన నిలబడి, వారి హక్కుల పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేసింది. ముస్లిం సమాజం పట్ట తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.