- వారికి అన్నివిధాలా రాణించేలా గుర్తింపు తెచ్చాం
- ఎన్టీఆర్ వారికి ఆస్తిలో సమాన హక్కు కల్పించారు
- పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, పట్టాభిరామ్
- టీడీపీ కేంద్ర కార్యాలయంలో దుస్తుల పంపిణీ
మంగళగిరి(చైతన్యరథం): ఆస్తిలో హక్కు కల్పించి నాడు అన్న ఎన్టీఆర్ మహిళలకు అండగా ఉంటే… నేడు వారికి సరైన ప్రోత్సాహం ఇచ్చి సీఎం చంద్రబాబు అన్ని విధాలా పెద్దన్నలా ఉన్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. ముఖ్యఅతిథిగా వర్ల రామయ్య, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ పాల్గొ ని మహిళా నాయకుల చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలకు గౌరవం కల్పించి అన్ని విధాలా ప్రోత్సహించి వారి అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించేలా పార్టీ కృషి చేస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీలో అనేక మంది రాజకీయంగా ఎదిగేలా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రోత్సహిం చారన్నారు. అసెంబ్లీ తొలి స్పీకర్‌గా మహిళకు స్థానం కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెలిపారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో ఉన్న మహిళా సిబ్బందికి వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాతర్ల రమేష్, సయ్య ద్ రఫీ, మహిళా నాయకులు కృష్ణవేణి, రాధిక, దుర్గ, తదితరులు పాల్గొన్నారు.