- సమస్యల పరిష్కార వేదికగా సేవలు
- స్వచ్ఛంద సంస్థలా ఆపన్నులకు అభయహస్తం
- నాయకులను తయారుచేసే కర్మాగారం
- నిరుద్యోగ యువతకు దారి చూపే మార్గదర్శి
- కార్యాలయ ఆవిర్భావ వేడుకల్లో నాయకులు
మంగళగిరి(చైతన్యరథం): సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం..తెలుగుజాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడమే సీఎం చంద్రబా బు, మంత్రి నారా లోకేష్ లక్ష్యమని టీడీపీ నేతలు పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కారాలయ 5వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నేతలు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కేంద్ర కార్యాల యం గుండెకాయ..దేశంలో ఏ పార్టీ కార్యాలయ ప్రజలకు భోజనం పెట్టి వారి సమస్య లను పరిష్కరించడం లేదు..కేవలం ఒక్క టీడీపీ కార్యాలయంలోనే ఇలా జరుగుతుందని తెలిపారు. టీడీపీ నేతలు, పార్టీ కార్యాలయ సిబ్బంది కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్నారని ప్రశంసించారు. ప్రతినిత్యం కార్యకర్తలతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచే యాలని సూచించారు. శత వసంతాల పాటు పార్టీ వర్ధిల్లేలా అన్న ఎన్టీఆర్ ఆశయ స్ఫూర్తితో ముందుకువెళ్లాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలు పరిష్కరించే దేవాలయం గా ప్రజల గుండెల్లో టీడీపీ కేంద్రాలయం ఉంటుందన్నారు. అటువంటి దేవాలయంపై దుర్మార్గులు చేసిన దాడికి తగిన మూల్యం చెల్లించుకుంటున్నారని తెలిపారు. టీడీపీ ఒక రాజకీయ పార్టీలా కాకుండా ప్రజలకు సేవచేసే స్వచ్ఛంద సంస్థలా పనిచేస్తుంది.. ప్రజలకు పేదరికాన్ని దూరం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపి..తెలుగువారి గౌర వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్నదే చంద్రబాబు లక్ష్యమన్నారు. టీడీపీకి తిరుగు లేదని ..తెలుగుజాతి ఉన్నంత వరకు పార్టీ ప్రజాసేవలో ఉంటుందన్నారు. సేవతో పాటు నాయ కులను తయారు చేసే కర్మాగారం టీడీపీ అని కొనియాడారు. టీడీపీలో నాయకులకు కొరతలేదని..పార్టీలో పనిచేస్తున్నందుకు తాము గర్వపడుతున్నామని తెలిపారు.
సభ్యత్వంతో కార్యకర్తల కుటుంబాలకు భరోసా
కార్యకర్తల కుటుంబాల శ్రేయస్సు కోసం దేశంలోనే మొట్టమొదటిసారి సభ్యత్వంతో కార్యకర్తలకు బీమా సదుపాయం కల్పించిన గొప్ప తెలుగుదేశం..సాధారణ సభ్యత్వ రుసుము రూ.100 కాగా ఈ ఏడాది నుంచి కొత్తగా శాశ్వత సభ్యత్వం రూ.లక్షతో ప్రవేశ పెట్టడం జరిగిందని తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రతిఒక్కరూ తాము ఉన్న చోట నుంచే మొబైల్, కంప్యూటర్, ట్యాబ్‌ల ద్వారా సభ్యత్వ నమోదు చేసుకోవచ్చని తెలిపారు. వాట్సప్, టెలిగ్రాం, మన టీడీపీ యాప్‌తో కూడా కొత్త సభ్యత్వం తీసుకోవ చ్చన్నారు. పాత సభ్యత్వం రెన్యువల్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. పార్టీ క్రియాశీలక సభ్యులకు అందించే బీమా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడం జరిగింది. అనుకోని ప్రమాదాల్లో కార్యకర్తలు మృత్యువాత పడితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా బీమా భరోసాగా నిలుస్తుందని తెలిపారు. ప్రమాద బీమా కింద ఇప్పటివరకు 5,144 మందికి రూ.102.26 కోట్లు అందించినట్లు వివరించారు. సహజ మరణం, ఇతర సమ స్యలపై 4,874 మందికి రూ.18 కోట్లు పార్టీ సాయం చేసిందని తెలిపారు.
పేద విద్యార్థుల చదువుకు సాయం.. నిరుద్యోగులకు భరోసా
విద్యార్థుల చదువుకు పెద్దపీట వేస్తూ 1,670 మందికి రూ.2.35 కోట్లు, విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు 180 మందికి ఎన్‌టిఆర్, ఇతర విద్యాసంస్థల ద్వారా 4,732 మందికి సాయం చేశామని పేర్కొన్నారు. విద్యతోనే సమాజంలో అసమానతలు తొలగి కుటుంబాల్లో పేదరికం పోతుందన్నారు. యువతలో నైపుణ్యం పెంచేందుకు ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పార్టీ కార్యాలయంలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఆధ్వర్యంలో గత మూడేళ్ల నుంచి శిక్షణ తరగతులు నిర్వహించి దేశ విదేశాల్లో విద్య, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటికీ 1987 మంది శిక్షణ ఇవ్వ గా 870 మంది ఉద్యోగాలు పొందినట్లు చెప్పారు. వీరిలో విదేశాలలో ఉద్యోగాలు పొం దిన వారు 200 మంది ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు ఎం.ఎ.షరీఫ్, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, కౌన్సిల్ చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, మాజీ మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యే గల్లా మాధవి, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, కార్పొరేషన్ల చైర్మన్లు ఆనం వెంకట రమణారెడ్డి, నీలాయపాలెం విజయకుమార్, క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి దాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బ్రహ్మం చౌదరి, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు, రిసెప్షన్ సభ్యులు హాజీ హసన్ బాషా, నేతలు కోడూరు అఖిల్, దేవినేని శంకర్‌నాయుడు, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజశేఖర్, తెలుగురైతు ప్రధాన కార్యదర్శి బి.శివసాంబరెడ్డి, ఎన్‌ఆర్‌ఐ వింగ్ కోఆర్డినేటర్ రాజశేఖ ర్, దామోదర్‌రాజు, మునిరత్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు.