- అందుకోసం జీఎస్టీ డేటా లైవ్ యాక్సెస్ ఇవ్వండి
- జీఎస్టీపై మంత్రుల కమిటీ సమావేశంలో రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల సూచన
అనంతపురం (చైతన్యరథం): పన్ను ఎగవేతదారులను కట్టడి చేయడానికి అన్ని రాష్ట్రాల ఇంట్రా స్టేట్, ఇంటర్ స్టేట్ స్థాయిలోని జీఎస్టీ డేటా సమాచారం లైవ్‌గా యాక్సెస్ ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ పన్నుల సరళిని పరిశీలించడానికి ఏర్పాటయిన మంత్రుల కమిటీ శుక్రవారం న్యూఢల్లీిలో సమావేశమైనది. గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ పి. సావంత్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రి పయ్యావుల కేశవ్ అనంతపురం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీి భవనం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ పన్ను ఎగవేతదారులను కట్టడి చేయడానికి, ఉత్తమ విధానాల అమలుకు ఇంటర్ డిపార్ట్‌మెంటల్ అనుసంధానం చేస్తూ లైవ్ సమాచారం అందుబాటులో ఉండేలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో చర్యలు తీసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సమావేశం ఎంతో ఫలవంతంగా జరిగిందని, పలు రాష్ట్రాలు అమలు చేస్తున్న డేటా అనలిటిక్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానాలు పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఈ సమావేశంలో ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ పన్ను చెల్లింపులపై, జీఎస్టీ పన్ను ఎగవేత దారుల గుర్తింపు, వాటి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, మరింత మెరుగ్గా జీఎస్టీ వసూళ్ల, పన్ను లీకేజీలు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై, వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉత్తమ విధానాలు, తదితర అంశాలపై చర్చించారు. వే బిల్లులు, వాహన్, ఫాస్టాగ్, తదితర అంశాలపైనా చర్చించారు. డేటా అనలిటిక్స్ ద్వారా జీఎస్టీ డేటాను అనాలిసిస్ చేయడం ద్వారా తీసుకోవలసిన చర్యలపై కూలంకషంగా చర్చించారు. పంజాబ్, ఛత్తీస్‌ఘడ్, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తమ రాష్ట్రాల్లో జీఎస్టీ వసూలుకు, పన్ను ఎగవేతకు పాల్పడే వారిపై నిబంధనల మేరకు తీసుకుంటున్న చర్యలపై వివరించారు. జీఎస్టీ రెవెన్యూ అనలిటిక్స్‌పై మంత్రుల బృందం సమావేశం ఫలవంతమైనదని, వచ్చే సమావేశంలో మరింత విస్తృతంగా పురోగతితో చర్చిస్తామని, కమిటీకి నేతృత్వం వహించిన గోవా ముఖ్యమంత్రి తెలిపారు. కమిటీలో సభ్యులు..బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, ఛత్తీస్‌గఢ్ ఆర్థిక మంత్రి ఓం ప్రకాష్ చౌదరి, గుజరాత్ ఆర్థిక మంత్రి కనుభాయ్ దేశాయ్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా, తమిళనాడు ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ సమావేశంలో పాల్గొన్నారు