- 20లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రణాళికాబద్ధంగా కృషి
- అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు సీడాప్ ద్వారా శిక్షణ
- ఇకపై చదువుతోపాటే విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చేలా చర్యలు
- జర్మనీలో ఉద్యోగాలు పొందిన యువతకు మంత్రి లోకేష్ అభినందన
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీడాప్, ఓంక్యాప్ బలోపేతంపై దృష్టి సారించామని, సీడాప్ ద్వారా రాబోయే అయిదేళ్లలో ఇతర దేశాల్లో 50వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (ూజుజుణAూ), ఇండో యూరో సింక్రనైజేషన్ అండ్ జర్మన్ హెల్త్ కేర్ సంయుక్త భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్లేస్‌మెంట్ పథకం (ూఙవతీంవaం ూశ్రీaషవఎవఅ్ ంషష్ట్రవఎవ)`నర్సింగ్ ప్రొఫెషనల్స్ కింద 14మంది నర్సింగ్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్‌కి జర్మనీలోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు కల్పిస్తూ కాల్ లెటర్స్ అందాయి. ఈ సందర్భంగా ఉండవల్లి నివాసంలో శనివారం జరిగిన కార్యక్రమంలో జర్మనీలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… తొలిబ్యాచ్‌లో సీడాప్ ద్వారా మొత్తం 171 మందికి శిక్షణ ఇవ్వగా, ఇప్పటికే వివిధ విభాగాల్లో 40మంది ఎంపికయ్యారని, 14 మంది త్వరలోనే జర్మనీ వెళుతున్నారన్నారు. మిగిలిన అభ్యర్థులు కూడా వివిధ దశల్లో శిక్షణ పూర్తి చేసుకుంటున్నారు, వారికి త్వరలోనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన (ణణఖGఖ్) – విదేశ్ అనుసంధానంతో గ్రామీణ యువతకు అంతర్జాతీయ ప్లేస్‌మెంట్స్ లక్ష్యంగా సీడాప్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.
అంతర్జాతీయ అవకాశాలే చంద్రబాబు లక్ష్యం
అంతర్జాతీయస్థాయి ఉద్యోగావకాశాలను ఆంధ్రప్రదేశ్ యువత అందిపుచ్చుకోవాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముందుచూపుతో ఐటిని ప్రోత్సహించడంవల్ల ఈరోజు విదేశాల్లో పనిచేసే భారత ఐటి ప్రొఫెషనల్స్‌లో 30శాతం తెలుగువారే ఉన్నారు. ఇప్పుడు ఏఐ, ఎంఎల్, క్వాంటమ్ టెక్నాలజీలపై దృష్టిసారించారు. ప్రస్తుతం జర్మనీ వెళ్తున్న ప్రతిఒక్కరూ మరో 10మందికి స్పూర్తిగా నిలవాలి. విదేశీ ఉద్యోగాల వల్ల మీ కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి. అంతర్జాతీయ స్థాయి అవకాశాలను మన విద్యార్థులు అందిపుచ్చుకునే విధంగా సీడాప్-ఓంక్యాప్ ద్వారా విదేశీ భాషల్లో శిక్షణ ఇస్తున్నాం. హార్డ్ వర్క్‌కు ప్రత్యామ్నాయం లేదు, పట్టుదల, కమిట్‌మెంట్ తో యువత ముందుకు సాగాలి. చంద్రబాబు సూపర్ ` 6 లో ప్రధాన హామీ అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పన. ఈ లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగతున్నాం. ఈ నెలలోనే నైపుణ్యం పోర్టల్ ను ప్రారంభించబోతున్నాం. ఇకపై చదువు పూర్తయిన తర్వాత కాకుండా చదువుకునేటప్పుడే జర్మనీ, జపాన్ వంటి విదేశీ భాషల్లో శిక్షణ ఇస్తాం. మన బిడ్డలకు ఇమిగ్రేషన్ ద్వారా మెరుగైన విదేశీ ఉద్యోగాలు కల్పించాలనేది ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం. జర్మనీ, జపాన్‌లో హెల్త్ కేర్, నర్సింగ్ ప్రొఫెషనల్స్‌కు మంచి డిమాండ్ ఉందని మంత్రి లోకేష్ తెలిపారు.
మహిళా సాధికారత ద్వారా సమాజాభివృద్ధి
ఆర్థిక స్వాతంత్య్రం ద్వారానే సమాజంలో మార్పు సాధ్యం. విదేశీ ఉద్యోగాల ద్వారా మీ కలలను సాకారం చేసుకొని కుటుంబాలకు గర్వకారణంగా నిలవండి. సమాజాభివృద్ధిలో మహిళా సాధికారత కీలక పాత్ర పోషిస్తుంది. అందుకోసమే స్త్రీశక్తి వంటి పథకాలు, దీపం-2 వంటి పథకాల ద్వారా వారికి చేదోడుగా నిలుస్తున్నాం. మహిళలను గౌరవించేలా కేజీ టూ పీజీ కరిక్యులమ్‌లో మార్పులు తెస్తున్నాం. మహిళలను కించపర్చే సినిమాలను సైతం విడుదల కాకుండా అడ్డుకోవాలన్నదే మా అభిమతం. ప్రస్తుతం నర్సింగ్ విద్యను అభ్యసిస్తూ విదేశాలకు వెళ్లాలనుకునే యువతకు మీరు టార్చ్ బేరర్లుగా నిలవాలి. విదేశీ భాషలకు సంబంధించిన పరీక్ష కేంద్రాలను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ తెలిపారు. సీడాప్ ద్వారా ఇస్తున్న శిక్షణా కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జర్మనీలో ఉద్యోగాలు సాధించిన నర్సింగ్ విద్యార్థులను లోకేష్ సన్మానించి, వారి వృత్తికి ఉపయోగపడేలా ట్యాబ్స్ అందజేసారు.
రూ.2.8 లక్షల ఉద్యోగం…కలగా ఉంది
బీఎస్సీ నర్సింగ్ కోర్సు చదివిన తాము స్థానిక ఆసుపత్రుల్లో నెలకు 15వేల నుంచి రూ.20వేల జీతానికి పనిచేసే వాళ్లం.. సీడాప్ ద్వారా శిక్షణ తర్వాత నెలకు రూ.2.8లక్షల శాలరీతో జర్మనీలో ఉద్యోగం లభించడం తమకు కలగా ఉందని జర్మనీలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. సీడాప్ ద్వారా శిక్షణ పొంది జర్మనీలో ఉద్యోగాలు సాధించిన 14మంది యువతీయువకులతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. వీరిలో 9మంది నిరుపేద ఎస్సీలు కాగా, ముగ్గురు బీసీలు ఉన్నారు. విదేశీ ఉద్యోగాలు పొందిన వారు మంత్రి లోకేష్ ఎదుట తమ మనోభావాలను తెలియజేస్తూ… తాము ప్రైవేటు కన్సల్టెన్సీల వద్ద ఇదే ఉద్యోగాల శిక్షణ కోసం సంప్రదిస్తే రూ.8లక్షల వరకు అడిగారు. అంత డబ్బు భరించే స్థోమత మా కుటుంబాలకు లేదు. సీడాప్ ద్వారా ఒక్క రూపాయి తీసుకోకుండా 8నెలలపాటు ఎ1 నుంచి బి2 వరకు జర్మన్ భాషల్లో శిక్షణ ఇచ్చి, ఉద్యోగం వచ్చేలా చేశారు.
వివిధ కారణాల వల్ల తొలిప్రయత్నంలో ఫెయిలైన వారికి సైతం మళ్లీ శిక్షణ ఇచ్చి పాసయ్యేలా చేశారు. జర్మనీ వెళ్లాక మా జీవితాలు మారిపోబోతున్నాయి. తమ కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ చేసిన సహాయాన్ని జీవితంలో మరువబోమని వారు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి మంత్రి లోకేష్ స్పందిస్తూ… కూటమి ప్రభుత్వం ద్వారా శిక్షణ పొంది విదేశాల్లో ఉద్యోగాలు పొందిన ఒక్కొక్కరు పదిమంది జర్మనీలో ఉద్యోగాలు సాధించేలా గైడెన్స్ ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీడాప్ చైర్మన్ గునిపాటి దీపక్ రెడ్డి, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండి గణేష్ కుమార్, స్కిల్ ఇంటర్నేషనల్ యాక్టివిటీస్ సలహాదారు సీతాశర్మ, సీడాప్ సీఈఓ పి.నారాయణస్వామి, సీడాప్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కె.శ్యామ్ ప్రసాద్, సీడాప్ స్టేట్ మిషన్ మేనేజర్ ఎల్.ప్రసాద్ బాబు, తదితరులు పాల్గొన్నారు.