అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థల విద్యుత్ సర్‌ఛార్జి మాఫీ చేస్తున్నట్టు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు వన్‌టైం సెటిల్‌మెంట్ స్కీమ్ (ఓటీఎస్) కింద సర్‌ఛార్జి మాఫీ చేసేందుకు అనుమతిచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ విభాగాలు, సంస్థలన్నీ విద్యుత్ వినియోగం కింద రూ.3,176 కోట్ల మేర డిస్కాంలకు బకాయి పడ్డాయి. బకాయిలపై విధించిన సర్‌ఛార్జిని మాఫీ చేయాలంటూ ప్రభుత్వం లేఖ రాసింది. 2024 డిసెంబరు 31నాటికి ప్రభుత్వం మొత్తం పెండిరగ్ బకాయిలు రూ.12,169 కోట్లుగా ఉన్నట్టు ఈఆర్సీ వెల్లడిరచింది. ఇందులో కరెంటు బకాయిలు రూ.9,010కోట్ల మేర చెల్లింపుల ఆలస్యంపై విధించిన సర్‌ఛార్జి రూ.3,158 కోట్లు ఉన్నట్టు స్పష్టం చేసింది. ఇందులో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కరెంటు బకాయిలు రూ.4,782 కోట్లుగా వెల్లడిరచింది. వీటిలో రూ.1,605కోట్ల మేర సర్‌ఛార్జి కట్టాల్సి ఉందని ఈఆర్సీ స్పష్టం చేసింది. ప్రభుత్వ విభాగాలు, సంస్థలు కరెంటు బకాయిలు చెల్లించేందుకుగాను 2024-25 ఆర్థిక సంవత్సరానికి సర్‌ఛార్జిని మాఫీ చేసేందుకు ఈఆర్సీ అనుమతించింది. ప్రత్యేక కేసుగా పరిగణించి ఓటీఎస్ కింద రూ.1,605 కోట్ల మాఫీకి డిస్కమ్‌లకు అనుమతి ఇస్తూ ఈఆర్సీ ఉత్తర్వులు ఇచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెందిన కరెంటు బకాయిలను మాత్రం 2025 ఏప్రిల్ 17వ తేదీలోపు చెల్లించాల్సిందిగా ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీచేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గడువు తేదీని పొడిగించొద్దని డిస్కమ్‌లకు సూచిస్తూ ఏపీఈఆర్సీ ఉత్తర్వులిచ్చింది..