- నాయుడు, మోదీ సమర్థ నాయకత్వంలో అభివృద్ధి పరుగులు
- మా ముఖ్యమంత్రికి కొత్తనగరాలు నిర్మించిన చరిత్ర ఉంది
- ఆ అనుభవంతోనే అద్భుతమైన అమరావతి నిర్మాణం చేపట్టారు
- భారీ పెట్టుబడుల ఆకర్షణలో చరిత్ర సృష్టిస్తున్నాం
- యుఎస్ ` ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ సమ్మిట్‌లో మంత్రి లోకేష్
న్యూఢల్లీి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై నమో అంటే నరేంద్ర మోదీ కాదు… నాయుడు అండ్ మోదీ. ఇద్దరు సమర్థ నేతల నేతృత్వాన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఢల్లీిలో బుధవారం నిర్వహించిన యుఎస్ ` ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ సమ్మిట్‌లో మంత్రి లోకేష్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. అడోబ్ చైర్మన్ శంతను నారాయణ్ సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ వంటి భారీ పెట్టుబడులతో చరిత్ర సృష్టిస్తున్నామన్నారు. బ్రెయిన్ డ్రెయిన్ నుంచి బ్రెయిన్ గెయిన్ చేస్తున్నాం. వర్టికల్, హారిజంటల్ ఇంటిగ్రేషన్ ద్వారా ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తున్నాం. టూరిజం రంగంలో 50వేల హోటల్ రూమ్‌లు లక్ష్యంగా పెట్టుకున్నాం, ఇప్పటికే 8వేల 500 రూమ్‌ల వసతి అందుబాటులోకి తెచ్చాం. నేను 180 బిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిని. మా లక్ష్యం 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు.
ఏపీలో మేం అధికారంలోకి వచ్చిన కేవలం 17నెలల్లో ఇప్పటివరకు 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాం. మా రాష్ట్రంలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టబోతోంది. ఇది భారతదేశ చరిత్రలో సింగిల్ లార్జెస్ట్ ఎఫ్‌డిఐ ఇన్వెస్ట్‌మెంట్. ఆర్సెలర్ మిట్టల్ సంస్థ భారత్‌లో అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌ను విశాఖపట్నం సమీపంలో నిర్మించబోతోంది. కేవలం ఒకే ఒక్క జూమ్ కాల్ ద్వారా ఈ భారీ ఉక్కు పరిశ్రమను రప్పించగలిగాం. ఏపీిలో భారీ పెట్టుబడులు రావడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. రెండోది మా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లీడర్ షిప్ ట్రాక్ రికార్డు. 3వది డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో చేపట్టిన సంస్కరణలన్నింటినీ ఏపీ వెనువెంటనే అమలు చేస్తోందని మంత్రి లోకేష్ చెప్పారు.
అత్యుత్తమ విధానాలు
ఆంధ్రప్రదేశ్‌లో మేం బెస్ట్ ఇన్ క్లాస్ పాలసీలను అమలు చేస్తున్నాం. వివిధ రంగాల్లో పెట్టుబడులకు ముందుకు వచ్చేవారికి అత్యుత్తమ ప్రోత్సాహకాలు అందజేస్తున్నాం. పారిశ్రామికవేత్తలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాం. మా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి నాలుగు దశాబ్ధాల సుదీర్ఘమైన ట్రాక్ రికార్డు ఉంది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ప్రాజెక్టును మాదిగా భావించి పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలతో కలిసి వాట్సాప్ గ్రూప్‌లను ఏర్పాటుచేసి పురోగతిపై నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. పూర్తి పారదర్శకమైన విధానాలు అనుసరిస్తుండటంతో ఒకరివెంట మరొకరు ఏపీిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు.
నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత
ఏఐ, క్వాంటమ్ వంటి అధునాతన సాంకేతికలను అందిపుచ్చుకుంటూ క్లస్టర్ బేస్డ్ అభివృద్ధికి మేం ప్రాధాన్యతనిస్తున్నాం. పరిశ్రమలకు అనువైన ఎకో సిస్టమ్ అభివృద్ధి చేయడంలో విద్యారంగం కీలకపాత్ర పోషిస్తుంది. యూనివర్సిటీ స్థాయిలో కరిక్యులమ్ ప్రక్షాళన చేసి ఏఐ పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నాం. హైదరాబాద్ ఐఎస్‌బి నమూనాలో ఆంధ్రప్రదేశ్‌లో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వాన స్కిల్ సెన్సస్ చేపట్టాం. మంగళగిరి నియోజకవర్గంలో తొలుత ఇది విఫలమైంది… ఏఐ ద్వారా స్కిల్ సెన్సస్ చేపట్టాలని చంద్రబాబు మాకు దిశానిర్దేశం చేశారు. సాధారణ ఏసీ మెకానిక్, కార్పెంటర్ వంటి వారి స్కిల్ ఎసెస్‌మెంట్ కోసం ఏఐ ఆధారిత విధానం అమలు చేస్తున్నాం. దీనిద్వారా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత నిస్తున్నామని మంత్రి లోకేష్ చెప్పారు.
దేశానికి నమూనాగా అమరావతి ల్యాండ్ పూలింగ్
మా ముఖ్యమంత్రి చంద్రబాబుకి కొత్త నగరాలు నిర్మించిన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పుడు అమరావతి మాదిరిగానే గతంలో సైబరాబాద్ నిర్మించారు. సింగపూర్ ఆర్కిటెక్టుల ద్వారా కృష్ణానది తీరంలో గుంటూరు ` విజయవాడల నడుమ సుందరమైన అమరావతి నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో రైతులను కూడా భాగస్వాములుగా చేశాం. 30వేలమంది రైతులు రాజధాని నిర్మాణానికి స్వచ్చందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని చెప్పడంతో వారు అంగీకరించారు. భారత్‌లో కొత్తనగరాల నిర్మాణానికి మేం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ విధానం దిక్సూచిగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ను కాలిఫోర్నియా ఆఫ్ ఈస్ట్ గా పిలువవచ్చు. మాకు సుదూర తీరప్రాంతం, తీరం పొడవునా అందమైన నగరాలు ఉన్నాయి. పరిశ్రమలకు అనువైన వాతావరణాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సమయం నడుస్తోంది. గూగుల్, మెటా, ఆర్సెలర్ మిట్టల్ వంటి భారీ పెట్టుబడుల ఆకర్షణ ద్వారా మీ కళ్లముందే చరిత్ర సృష్టించబోతున్నాం. మీరు మా రాష్ట్రాన్ని సందర్శించి మేం అమలు చేస్తున్న విధానాలను పరిశీలించండి. 2047 నాటికి భారత్ ప్రపంచంలో నెం.1గా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని మంత్రి లోకేష్ తెలిపారు.
విద్యావ్యవస్థలో సంస్కరణలు
మేం క్లస్టర్ బేస్డ్ అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యత నిస్తున్నాం. వర్టికల్, హారిజంటల్ ఇంటిగ్రేషన్ ద్వారా పారిశ్రామికాభివృద్ధికి కృషిచేస్తున్నాం. ఇందులో మొదటిది వర్టికల్ ఇంటిగ్రేషన్. ఇందులో స్కిల్ డెవలప్‌మెంట్, సర్టిఫికేషన్ వంటివి అంతర్భాగంగా ఉంటాయి. రెండవది సోషల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి. టూరిజం, ఎక్సయిజ్ శాఖల్లో ప్రగతిశీల విధానాలను అమలు చేస్తున్నాం. బ్లూ కాలర్, వైట్ కాలర్ జాబ్స్‌పై కూడా మేం దృష్టిసారించాం. పరిశ్రమల ఆకర్షణకు హాస్పిటాలిటీ కూడా చాలా ముఖ్యం. ఇందుకోసం రాబోయే అయిదేళ్లలో 50వేల హోటల్ రూమ్‌లను సిద్ధం చేయాలని నిర్ణయించాం. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇతర రాష్ట్రాలకంటే మేం ముందువరుసలో ఉండటానికి ఇది కూడా ఒక కారణం. హెచ్‌ఆర్‌డి, ఐటీి శాఖలను నేను ఛాలెంజ్ గా స్వీకరించాను. వ్యవస్థలో మార్పునకు విద్యాశాఖ సరైందని భావించి దానిని స్వీకరించాను. నేడు ఉన్నతస్థానాల్లో ఉన్న ప్రతిఒక్కరూ విద్యద్వారా లబ్ధి పొందినవారే. ప్రాథóమిక స్థాయి నుండి యూనివర్సిటీ వరకు విద్యావ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాను. ఐటీి శాఖ ద్వారా భవిష్యత్ సాంకేతికతలను యువతకు అందించేందుకు ఆ శాఖను చేపట్టాను. దేశంలో హెచ్‌ఆర్‌డి, ఐటీి శాఖలను కలిపి నిర్వహించిన మంత్రిని తాను మాత్రమేనని మంత్రి లోకేష్ చెప్పారు.















