శ్రీ జగన్ రెడ్డికి ఊడిగం చేస్తున్నారు: ఎంఎస్ రాజు
శ్రీ దళితజాతి పరువు తీస్తున్నారు: పీతల సుజాత
శ్రీ జగన్ రెడ్డి కళ్లలో ఆనందం చూసేందుకే: కెఎస్ జవహర్
శ్రీ ప్రతిపక్షాలపై సునీల్ ఫ్రస్టేషన్: ప్రతిభా భారతి
శ్రీ సునీల్ మూల్యం చెల్లించక తప్పదు: పరసా రత్నం
శ్రీ రాజారెడ్డి రాజ్యాంగం అమలు: ఆనందరావు
శ్రీ ఆయన మానసిక స్థితి సరిగా లేదు: స్వామిదాసు
శ్రీ అంబేద్కర్ రాజ్యాంగానికే అవమానం: ఎరిక్సన్ బాబు
అమరావతి : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తొత్తుగా మారిన ఎపి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ దళిత వ్యవహారశైలి దళితజాతికే కళంకమని తెలుగుదేశంపార్టీ ఎస్సీ నేత లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టిడిపి జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం టిడిపి సీని యర్ దళిత నేతలు విలేకరులతో మాట్లాడుతూ ప్రతి పక్షపార్టీ నేతలు, కేడర్ టార్గెట్‌గా ఎపి సిఐడి సునీల్ కుమార్ సాగిస్తున్న దమనకాండను తూర్పార బట్టారు. ఒక సీనియర్ ఐఎఎస్ అధికారి నన్న విషయం మర్చి పోయి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి సునీల్‌కుమార్ ఊడి గం చేస్తున్నారని మండిపడ్డారు. ఆత్మాభిమానాన్ని ముఖ్యమంత్రికి తాకట్టుపెట్టి విలువలకు తిలోదకాలి చ్చారంటూ నిప్పులు చెరిగారు. సునీల్‌కుమార్ తీరు మార్చుకోకపోతే రాష్ట్రస్థాయిలో ఉద్యమం చేపడతామ ని వారు హెచ్చరించారు.
జగన్ రెడ్డికి ఊడిగం చేస్తున్న సునీల్ కుమార్ : టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్. రాజు
ఏపీ సీఐడీ చీఫ్ సునీల్‌కు మార్ జగన్‌రెడ్డికి ఊడిగం చేస్తు న్నారని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు మండిపడ్డారు. మొత్తం సీఐడీ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ నేతలు ప్రశ్నిస్తే అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి వేధించి కస్టడీలో చిత్రహింసలు పెడుతున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టమని మీకు చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నల్లో ఎవరు చెప్పా రంటూ అర్ధరాత్రి వరకూ హింసి స్తున్నారు. దళితులు తలదించుకునేలా సునీల్‌కుమార్ వ్యవహరశైలి ఉంది. ముఖ్యమంత్రికి భజన చేయమని మీకు ఐపిఎస్ ట్రైనిం గ్ చేశారా?రాష్ట్రంలో దళితుడలపై, మహిళలపై దాడు లు జరుగుతుంటే స్పందించని సునీల్‌కుమార్, కేవలం జగన్, ఆయన కుటుంబంపై పోస్టులు పెడితే మాత్రం రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నాయకులు పార్టీలో పనిచేయకుండా బెదిరించడం సరికాదు. నిజ ంగా ఐపీసీ అధికారి ఐతే దళితుల దాడులపై ఎందు కు స్పందించడంలేదు? వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై టీడీపీ నేతలు రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో నాలు గైదు వేలకు పైగా ఫిర్యాదు చేసినా ఒక్క దానిపై నైనా స్పందించారా? అని ప్రశ్నించారు.
దళితజాతి పరువు తీస్తున్నారు : మాజీ మంత్రి పీతల సుజాత
ఎమ్మెల్యే టికెట్ కోసం సీఐడీచీఫ్ సునీల్‌కుమార్ ముఖ్య మంత్రి జగన్‌రెడ్డికి ఊడిగం చేస్తూ దళితజాతి పరువు తీస్తు న్నాడని మాజీమంత్రి పీతల సుజాత మండి పడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడవలసిన పోలీసు వ్యవస్తే అడ్డదారులు తొక్కుతోంది. ప్రజలను రక్షిం చాల్సిన పోలీసులే భక్ష కులుగా తయారయ్యారు. అన్యా యంగా ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలను కేసుల్లో ఇరికిస్తున్నారు. వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలు అవంలంబిస్తోంది. ప్రశ్నిస్తు న్న టీడీపీ నాయకులను టార్గెట్ చేశారు.దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. సీఐడీ శాఖని చీఫ్ మినిష్టర్ డిపా ర్టుమెంట్‌గా చేసేశారు. ధర్మపీఠం లాంటి సీఐడీ డిపా ర్టుమెంటును నిర్వీర్యం చేశారు. ఆశాఖను దిగజార్చా రు. సునీల్‌కుమార్ వచ్చాక సీఐడీ డిపార్టుమెంటు దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఆయన స్వార్థ ప్రయో జనాల కోసం వృత్తిధర్మాన్ని తాకట్టుపెడుతున్నారు. సీఎం చెప్పిన పనులు చేస్తూ టీడీపీ వారిని లక్ష్యంగా చేసుకున్నారు. ఐసీఎస్ అధికారిగా రాష్ట్రాన్ని, ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత సునీల్ కుమార్ పై ఉంది. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది.
ప్రతిపక్షాలపై సునీల్ ఫ్రస్టేషన్: ప్రతిభా భారతి శాసనసభ మాజీ స్పీకర్
సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ తన వ్యక్తిగత ప్రెస్టేషన్‌ని ప్రతి పక్షపార్టీపై రుద్దుతున్నారని తెలు గుదేశంపార్టీ జాతీయ ఉపాధ్య క్షురాలు, శాసనసభ మాజీ స్పీక ర్ కావలి ప్రతిభాభారతి దుయ్య బట్టారు. తెలుగుదేశం కార్యకర్తల ఇళ్లకు అర్ధరాత్రి వెళ్లి ఇబ్బంది పెడుతున్నారు. ఒక్కొక్కరిని అరెస్టు చేస్తు న్నారు. వైసీపీ నాయకులు పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఇది ఎంతవరకు సబబు? ముఖ్యమంత్రికి అనుకూలంగా లేకపోతే వేధింపులు తప్పడంలేదు. ఎమ్మెల్యే సీటు కోసం జగన్ రెడ్డికి ఊడిగం చేస్తున్నా రు. సునీల్ అనేక దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెడుతు న్నారు. దురాగతాలు జరగకుండా చూడాల్సిన పోలీసు వ్యవస్థే అమాయకులను ఇబ్బందిపెడుతోంది. తెలుగు దేశం కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనే ఎజెండాతో నడుస్తున్నారు. ఈ పద్దతి మానుకోవాలి. సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ ఎమ్మెల్యే, ఎంపీ సీటు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. జగన్‌రెడ్డికి ఊడిగం చేయ డంలో నిమగ్నమయ్యారు. సీఐడీ సునీల్ దళిత జాతి పరువు తీస్తున్నారని ప్రతిభా భారతి మండిపడ్డారు.
జగన్ రెడ్డి కళ్లలో ఆనందం చూసేందుకే :మాజీ మంత్రి కేఎస్ జవహర్
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కళ్ల ల్లో ఆనందంచూసేందుకే సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ ఆరాటపడు తున్నారని మాజీ మంత్రి కేఎస్ జవహర్ దుయ్యబట్టారు. ప్రతి పక్షనేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పగ, ప్రతికా రానికికూడా దిగుతున్నారన్నారు. సీఐడీ సునీల్‌కు మార్ జగన్‌కు తొత్తుగా మారారు. ఎంపీ పదవి కోసం జగన్‌ను సంతృప్తి పరుస్తున్నారు. జగన్‌ను సంతృప్తి పరిస్తే ఎంపీ అవ్వచ్చనుకుంటున్నారు. జగన్ మెప్పు పొంధి తానుఅనుకున్నది సాధించుకునేందుకే తెలుగు దేశం పార్టీ కార్యకర్తలను హింసకు గురిచేస్తు న్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్య కర్తలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. నేరాలను నియంత్రించవలసి వ్యక్తి నేరాలకు పాల్పడుతున్నాడు. కంచే చేను మేస్తున్న చందంగా సునీల్ కుమార్ వ్యవహారశైలి ఉంది.అంబేద్కరిస్టు మసుగులో గతంలో పెట్టిన ఎయిమ్స్ అనే సంస్థ ద్వారా రాజకీయ లబ్ది పొందడానికి తాపత్రయ పడుతున్నారు. ఏదైనా కేసు లో ఎఫ్‌ఐఆర్‌ని ఫాలో అవడంలేదు. హైకోర్టు, సుప్రీం కోర్టు అనేక సందర్బాల్లో 41 ోటీసు ఇవ్వమని చెప్పిన ప్పటికీ తుంగలో తొక్కారు. ఆయన అమలాపురంలో పోటీచేస్తే రాజకీయంగా సమాధానం చెబుతాం.
సునీల్ మూల్యం చెల్లించక తప్పదు :మాజీ మంత్రి పరసా రత్నం
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఆడమన్నట్లు ఆఢుతున్న సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ భవిష్యత్తు లో మూల్యం చెల్లించక తప్పదని మాజీమంత్రి పరసారత్నం అన్నా రు. రాష్ట్రంలో దళితులకు దారుణమైన అవమా నం జరుగుతోంది. సునీల్‌కుమార్ వ్యవహారశైలితో దళితు లను ఘోరంగా అవమానిస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తల జోలికొస్తే చూస్తూ ఊరుకోమని సునీల్ కుమార్ గుర్తించాలి. ఎప్పుడూ అమావాస్య రోజులే ఉండవు. పౌర్ణమి కూడా వస్తుంది. ఆ వెలుగులో జగన్ రెడ్డి చీకట్లోకి వెళ్లిపోవడం ఖాయం. సునీల్ కుమార్ వ్యక్తిగత ఇబ్బందులను ప్రజలపై రుద్దడమేం టి? టీడీపీ కార్యకర్తలను ముఖ్యంగా దళితులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సునీల్ కుమార్ అరాచకాలకు మా ప్రభుత్వం వచ్చాక మూల్యం చెల్లించుకోక తప్పదని పరసా రత్నం హెచ్చరించారు.
రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు :మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు
అంబేద్కర్ రాజ్యాంగాన్ని, పక్కనపడేస్తూ సొంత రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్‌రెడ్డి అమలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మండిపడ్డారు. ఐపీఎస్ చదివి, అంబేద్కర్ అంటే ఇష్టం అని చెప్పుకునే సీఐడీ సునీల్ కుమార్ జగన్ రెడ్డి ఆలోచనలు అమలు చేస్తున్నారన్నారు. యావత్ దళిత జాతి సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మీ విధానాలు మార్చుకోవాలని హితవు పలికారు. మీపై వస్తున్న ఆరోపణలు చూసి దళితులగా తాము బాధపడుతున్నామని చెప్పారు. ఐదేళ్ల పాటు ఉండే జగన్ రెడ్డి కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కించపరచడం ఎంతమాత్రం తగదన్నారు. మీ చర్యలను మేం ఖండిస్తున్నామని చెప్పారు. సీఐడీ అంటే పెద్దపెద్ద నేరాలు చేసిన వారిని విచారించాలన్నారు. ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తున్న సోషల్ మీడియాలో పోస్టుల పట్ల ఎందుకు చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు .
సునీల్ కుమార్ మానసిక స్థితి సరిగా లేదు : మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు
సీఐడీ సునీల్ కుమార్ మానసిక స్థితి సరిగా లేదని మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు చెప్పారు. టీడీపీ లక్ష్యంగా ఎయిమ్స్ అనేసంస్థ పెట్టి నేతలను బాధపెడుతు న్నారన్నారు. వచ్చే ప్రభుత్వం టీడీపీదేనని గుర్తుపెట్టు కోవాలని హెచ్చరించారు. టిడిపి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చాక సునీల్ తగిన మూల్యం చెల్లించు కుంటారన్నారు. చట్టపరంగా తమ ప్రభుత్వంలో చర్యలు ఉంటాయని చెప్పారు. నేడు దళితులపై దాడులు పెరిగిపోయాయని, జగన్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. వాక్ స్వాతంత్య్రాన్ని, వ్యక్తిగత స్వాతంత్య్రాన్ని హరిస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై శారీరక, మానసిక హింసకు పాల్పడుతున్నారని, నేరం చేసే వాడు కాదు, నేరం చూస్తున్నవాడు కూడా దోషేనని, తాము వస్తే మీపై కచ్చితంగా చర్యలు తీసుకుంటా మని నల్లగట్ల స్వామిదాసు హెచ్చరించారు.
అంబేద్కర్ రాజ్యాంగానికే అవమానం : రాష్ట్ర అధికార ప్రతినిధి ఎరిక్షన్ బాబు
సోషల్ మీడియాలో పోస్టుల ఆధారంగా టీడీపీ కార్యకర్తలు, నాయకులకు నోటీసులు ఇవ్వకుండా కేసులు పెట్టి హింసించడం అంబేద్కర్ రాజ్యాంగానికే అవమానకరమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గూడూరి ఎరిక్సన్ బాబు చెప్పారు. సునీల్ దళిత సామాజికవర్గం నుంచి వచ్చా రని,రిజర్వేషన్ ఫలాలు అను భవిస్తున్న ఆయన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పారు. దళి తులు తలెత్తుకుని తిరుగుతు ా్న రంటే, దానికి అంబేద్కర్ కారణమని చెప్పారు. సీఐడీ చీఫ్‌గా ఉన్న సునీల్ చిన్న చిన్న కార్యకర్తలపై తన ప్రతాపం చూపిస్తున్నారని మండిపడ్డారు. వివేకా నందరెడ్డిని హత్యచేస్తే మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అటువంటి కీలకమైన కేసులు వదిలేసి వా ట్సాప్ లలో వచ్చిన వాటిపై కేసులు పెట్టే పరిస్థితికి దిగజారారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కోడికత్తి కేసు నిందితుడి తల్లి జగన్‌రెడ్డిని కలవడానికి వస్తే పట్టించుకోకపోగా, కేసు విషయంలో ఎలాంటి చర్యలు లేవన్నారు. మీ చర్యలను ఒక్కసారి పునపరిశీలించుకోవాలని ఎరిక్సన్ బాబు సలహా ఇచ్చారు.