అమరావతి (చైతన్యరథం): స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆయన చూపిన తెగువ, ధైర్యం నిరుపమానం అని కొనియాడారు. సైమన్ గో బ్యాక్ అంటూ బ్రిటీష్ వారి తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి నిలిచి ఆంధ్రకేసరిగా పేరు గడిరచారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విశేష కృషిచేశారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషిచేద్దామని పిలుపు ఇచ్చారు.