- అరాచక శక్తులను ఉపేక్షించే ప్రసక్తే లేదు
- బాలికలపై అత్యాచారాలను అధ్యయనం చేస్తున్నాం
- స్పెషల్ డ్రైవ్‌కు ఆయా శాఖలతో కమిటీలు వేస్తాం
- విద్యార్థినులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం
- హోంమంత్రి వంగలపూడి అనిత
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగించేందుకు అరా చక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని, అలాంటి వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. నేరస్తులను దండిరచే విషయంలో పార్టీలు, కులాలను పరిగణనలోకి తీసుకునే ప్రసక్తే లేదని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సామాన్య ప్రజల జీవనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు రక్షణ కల్పించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. బాలిక లపై జరుగుతున్న అత్యాచారాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని, ఎక్కువగా దగ్గరి బంధువుల ద్వారానే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. మహిళా, శిశు సంక్షేమ, విద్యా, పోలీసు శాఖల సమన్వయంతో స్పెషల్ డ్రైవ్‌కు కమిటీని నియమించి విద్యార్థినులతో పాటు తల్లిదండ్రులకు కూడా అత్యాచారాలకు ఆస్కారం ఉన్న కారణాలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడిరచారు.